ETV Bharat / state

విజయవాడ పోలీసుల కొత్త అస్త్రం - డ్రంక్ అండ్ డ్రైవ్​కు చెక్!

రోడ్డు ప్రమాదాల కట్టడికి కొత్త అస్త్రం - ఎరైవ్‌ - ఎలైవ్‌ కార్యక్రమాన్ని చేపట్టిన విజయవాడ పోలీసులు, మార్చి 1వ తేదీ నుంచి దీన్ని అమలు పరిచేందుకు ట్రాఫిక్‌ పోలీసు విభాగం ఏర్పాటు

Arrive Alive Program in NTR District
Arrive Alive Program in NTR District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 20, 2026 at 2:19 PM IST

3 Min Read
Choose ETV Bharat

Arive Alive Program Prevent Road Accidents in NTR District: మద్యం మత్తులో ఒకరు, నిద్రమత్తులో ఇంకొకరు. కాలక్షేపంతో నిర్లక్ష్యం చేస్తుంది ఇంకొకరు. మద్యం తాగి వాహనాలు నడపడమే చట్టరీత్యా నేరం అయితే సెల్​ఫోన్​లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. అందుకే వీటిని కట్టడి చేసేందుకు గాను మద్యాన్నిసేవించి వాహనాలను యథేచ్ఛగా నడుపుతూ దొరికిన వారిపై కొత్త అస్త్రాన్ని ప్రయోగించనుంది విజయవాడ నగర ట్రాఫిక్​ పోలీసులు. ఇప్పటి వరకు మద్యం మత్తులో పోలీసులతో అనవసరంగా గొడవలను పెట్టుకోవడం, దాంతో ఫలితంగా జైలు శిక్షలు పడిన చోదకుల సమాచారాన్ని మాత్రమే విధులు నిర్వహించే సంస్థల యజమానులకు తెలియజేసేవారు.

రోడ్డు ప్రమాదాల కట్టడికి ఎరైవ్ - ఎలైవ్: అయితే ఈ క్రమంలో పోలీసు అధికారులు మద్యాన్ని తాగిన వాహనదారులపై కేసులను నమోదు చేసేవారు. అక్కడితో ఆగకుండా కౌన్సెలింగ్, జరిమానాలను సైతం విధించేవారు. దీంతో డ్రంక్ అండ్​ డ్రైవ్ చేసిన వారికి ప్రతికూలత భావన ఉండేది. అందుకే ఈ విధమైన తప్పుడు భావనను పోగొట్టేందుకు నగర పోలీసులు విప్లవాత్మకమైన ప్రయోగానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

Arive Alive Program Prevent Road Accidents in NTR District
Arive Alive Program Prevent Road Accidents in NTR District (ETV Bharat)

ప్రమాదాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా ఇటీవల 'ఎరైవ్ - ఎలైవ్' అనే కార్యక్రమాన్ని పోలీసులు వినూత్నంగా చేపట్టారు. దీన్ని అనుసరించి ప్రతిరోజు విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం, జి. కొండూరు పోలీసు స్టేషన్ల పరిధిలోని ఉన్నటువంటి దాదాపు 10 నుంచి 15 ప్రాంతాల్లో తనిఖీలు అదే విధంగా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం అతి వేగంతో వాహనాలను నడపడం, మద్యం మత్తు కారణంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Arive Alive Program Prevent Road Accidents in NTR District
Arive Alive Program Prevent Road Accidents in NTR District (ETV Bharat)

మార్చి 1వ తేదీ నుంచి అమలు: ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు వాహనాలను నడిపినట్లయితే వారి ఉద్యోగాలకు స్వస్తి తప్పదనే సంకేతాలను స్పష్టంగా పంపనున్నారు. అందులో భాగంగానే విజయవాడ నగర సీపీ రాజశేఖరబాబు, ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం ఆదేశాలతో మార్చి 1వ తేదీ నుంచి దీనిని అమలు చేసేందుకు అధికార పోలీసు యంత్రాంగం విస్తృతంగానే ఏర్పాట్లు చేస్తోంది. అయితే తనిఖీల్లో చిక్కిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సమాచారాన్ని అదే విధంగా వారు విధులు నిర్వహిస్తున్న సంస్థల నుంచి చిరునామాలను క్రోడీకరించినట్లు ట్రాఫిక్ విభాగ అధికారులు వివరిస్తున్నారు.

ఇలా చేస్తేనే అలా నడపకుండా ఉంటారు: ఎక్కువ శాతం మందిలో తాము ఎంత మద్యాన్ని తాగినా సరే వాహనాన్ని సమర్థంగా నడుపుతామనే ధీమా అనేది ఉంటుందని ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ అన్నారు. అయితే ఆ మత్తు ప్రభావం మాత్రం మెదడుపై తీవ్రంగా ఉంటుందన్న అవగాహన మాత్రం ఉండదని ఆయన తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్​లో చిక్కితే వారి వివరాలు ఆయా సంస్థల అధిపతులకు చేర్చాలని పోలీసు ఉన్నత అధికారులు యోచిస్తున్నారని వివరించారు. దీన్ని అమలు చేసినట్లయితే మాత్రం తమ ఉద్యోగం, పరువు - ప్రతిష్ఠలు పోతాయనే భయంతోనైనా మద్యం తాగి వాహనాన్ని నడపకుండా ఉంటారని ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్ తెలిపారు.

Arive Alive Program Prevent Road Accidents in NTR District
Arive Alive Program Prevent Road Accidents in NTR District (ETV Bharat)

నిబంధనలు: మోటారు వాహనాల చట్టం ప్రకారం మద్యం మత్తులో వాహనం నడుపుతూ తొలిసారి పట్టుబడితే రూ.10 వేల జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశముంది. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా, రెండేళ్ల వరకూ జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. మూణ్నెల్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేయాలి. అయితే ఇవేవీ పూర్తిస్థాయిలో అమలు కావట్లేదని పలువురంటున్నారు.

Arive Alive Program Prevent Road Accidents in NTR District
Arive Alive Program Prevent Road Accidents in NTR District (ETV Bharat)

కర్నూలు ఘటనైనా మేల్కొలుపు కావాలి - మద్యం మత్తులో డ్రైవింగ్‌కు ఏటా 50 మంది పైనే బలి

'నేనూ పోలీసునే - కేసు బుక్​ చేస్తారా' - డ్రంకెన్​ డ్రైవ్​ పరీక్షలో హల్​చల్​