ETV Bharat / state

విజయవాడలో 100 విద్యుత్ బస్సులు ఏర్పాటు - మహిళలకు స్త్రీశక్తి పథకం వర్తింపు

నగరంలో పరుగులు పెట్టనున్న విద్యుత్ బస్సులు - విజయవాడకు 100 బస్సులు కేటాయింపు, విద్యాధరపురం డిపోలో ఏర్పాటు కానున్న నిర్వహణ కేంద్రం, నిర్వహణ భారాన్ని కలిసి పంచుకోనున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

Arrangements For 100 Electric Buses in Vijayawada
Arrangements For 100 Electric Buses in Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 24, 2026 at 10:36 AM IST

3 Min Read
Choose ETV Bharat

Arrangements For 100 Electric Buses in Vijayawada: విద్యుత్ బస్సులు త్వరలో నగరంలో పరుగులు పెట్టనున్నాయి. ఇందులో భాగంగా రవాణా శాఖ అధికారులు విజయవాడకు 100 బస్సులు కేటాయించారు. ప్రధానంగా విద్యాధరపురం డిపోలో వీటి నిర్వహణ కేంద్రం ఏర్పాటు కానుంది.

దీనికి సంబంధించి ఇప్పటికే ఒప్పంద ప్రక్రియ అనేది పూర్తయింది. దాంతో మరో ఆరు నెలల్లో బస్సులు రోడ్డు పైకి రానున్నాయి. అంతేకాకుండా కాలుష్యనివారణకు పీఎం-ఈ-బస్​ సేవా పథకం ద్వారా నడుపుతున్నప్పటికీ వాటి నిర్వహణకు అయ్యేటటువంటి వ్యయాన్ని మాత్రం కలిసి పంచుకోనున్నాయి.

దాదాపు 7,000 లీటర్ల డీజిల్ ఆదా: బస్సులను ఓ సారి పరిశీలిస్తే ప్రస్తుతం 400 సిటీ బస్సులు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్త బస్సుల రాకతో అవసాన దశలోని బస్సులను తొలగిస్తారు. ఫలితంగా దాదాపు 7,000 లీటర్ల డీజిల్ వరకు ఆదా అవుతుండటం గమనార్హం. తిరుపతి ఐఐటీ బృందం గతంలో చేపట్టిన అధ్యయనంలో విజయవాడలో కార్బన్​మోనాక్సైడ్ ఆందోళనకరంగా ఉందని గుర్తించింది. విద్యుత్ బస్సులతో మాత్రం కొంతవరకు కాలుష్యం తగ్గుతుందని చెప్పవచ్చు.

అంతేకాకుండా విద్యుత్​ నిర్వహణ కేంద్రం ఏర్పాటుతో విద్యాధరపురం డిపో రూపురేఖలను మార్చనున్నారు. మెరక పనులు, ప్లాట్​ఫారాలు, అధికారులు, నిర్వాహకుల కార్యాలయ భవనాల నిర్మాణం, ఇతర సివిల్​ పనులకు రూ.12.5 కోట్లను కేటాయించారు. అందుకు 6,000 కేవీ సామర్థ్యంతో సబ్​స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్​ నిర్మాణం, 5 బస్సులకు ఒక్కోటి చొప్పున 20 ఛార్జింగ్ పాయింట్లు. వైరింగ్, ఇతర ఎలక్ట్రికల్ సామగ్రికి గాను దాదాపు రూ.10.5 కోట్లను వినియోగించనున్నారు.

ఇందుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను సమకూర్చుకోనుంది. పినాకిని మొబిలిటీ సంస్థకు బస్సుల నిర్వహణ బాధ్యతను అప్పగించారు. మొత్తం 250 మంది డ్రైవర్లను ఈ సంస్థ సమకూరుస్తుండగా 250 మంది కండక్టర్లను సైతం ఆర్టీసీ సర్దుబాటు చేస్తుంది.

స్త్రీ శక్తి పథకం వర్తింపు: దీని ప్రకారం ఒక్కో సీటుకు గాను మొత్తం 40 సీట్లు ఉంటాయి. అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణం సైతం వర్తించనుంది. మొత్తంగా 100 ఎలక్ట్రిక్ బస్సులను 11 మార్గాల్లో నడపనున్నారు.

మరింత సమాచారం: పెట్రోల్​, డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గిస్తూ పర్యావరణాన్ని రక్షించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 2023 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-బస్​ సేవా పేరిట ఓ పథకాన్ని తీసుకొచ్చింది. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్​షిప్​) విధానంలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఈ సేవా పథకాన్ని ప్రారంభించింది. విద్యుత్​ బస్సుల కోసం ఏపీలో 11 డిపోలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగానూ సివిల్, విద్యుత్ పనులకు కేంద్రం నిధులు సమకూర్చనుంది. ఏ ఏ జిల్లాలో కొత్త డిపోల నిర్మాణం చేపట్టనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎం-ఈబస్​ సేవ పథకం కింద కేంద్రం రాష్ట్రంలోని 11 నగరాల్లో ఏపీఎస్​ఆర్టీసీకి 750 విద్యుత్ బస్సులను కేటాయించిన విషయం తెలిసిందే. వీటి కోసం ఆయా డిపోల్లో కేంద్ర నిధులతో సివిల్​, విద్యుత్ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే విజయవాడ, నెల్లూరు, గుంటూరు, విశాఖకు 100 బస్సుల చొప్పున కేటాయించారు.

అదే విధంగా కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి, కడప, మంగళం (తిరుపతి), అనంతపురం, కర్నూలుకు 50 బస్సులు చొప్పున కేటాయించారు. ఈ బస్సులను పుణెకు చెందిన పినాకిల్ సంస్థ నడపనుంది. ఈ బస్సుల కోసం ఆ డిపోల్లో వివిధ నిర్మాణాలు, విద్యుత్ పనులు చేపట్టాల్సి ఉంది.

‘పీఎం- ఈబస్‌ సేవ’ పథకం కింద నిధులు కేటాయింపు - విద్యుత్‌ బస్సుల కోసం 11 డిపోల్లో ఏర్పాట్లు

ఆర్టీసీలో అన్నీ విద్యుత్‌ బస్సులే - ఇకపై వాటిలోనే ప్రయాణం