ETV Bharat / state

గల్ఫ్ దేశాల్లో 10 లక్షల మంది తెలుగువారు - బాధితులకు ఏపీ ఎన్నార్టీఎస్​ సహాయం

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం - బాధితులకు ఏపీ ఎన్నార్టీఎస్​ కో ఆర్డినేటర్ల ద్వారా సహాయం - హెల్ప్‌లైన్‌ నంబర్లను వినియోగించుకోవాలని సూచన

APNRTS_Helping_To_Gulf_Victims
APNRTS_Helping_To_Gulf_Victims (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 2, 2026 at 5:17 PM IST

|

Updated : March 2, 2026 at 7:29 PM IST

3 Min Read
Choose ETV Bharat

APNRTS Helps Rescue Telugu People Stranded in Gulf Countries: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధితులకు 120 మంది ఏపీ ఎన్నార్టీఎస్​ ((APNRTS - Andhra Pradesh Non-Resident Telugu) కో ఆర్డినేటర్ల ద్వారా సహాయం అందిస్తున్నారు. ప్రస్తుతం మస్కట్ నుంచి ఇండియాకు విమానాలు రాకపోకలు ప్రారంభమయ్యాయని అధికారులు చెబుతున్నారు. 10 లక్షల మంది తెలుగు వాళ్లు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారని ఏపీఎన్నార్టీఎస్ ప్రతినిధులు తెలిపారు. దుబాయ్, కువైట్, సౌదీ, బహ్రెయిన్లకు వెళ్లిన పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు గల్ఫ్ పరిస్థితులను అడిగి తెలుసుకుంటుందని అన్నారు.

గల్ఫ్ దేశాల్లో 10 లక్షల మంది తెలుగువారు - బాధితులకు ఏపీ ఎన్నార్టీఎస్​ సహాయం (ETV Bharat)

గల్ఫ్​లో చిక్కుకున్న తెలుగు వారికి అండగా ఉంటామని ఏపీఎన్నార్టీఎస్ అధ్యక్షులు వేమూరి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమ వివరాలను ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ 24/7 హెల్‌లైన్‌ 0863-2340678, వాట్సాప్ +91 85000 27678 నంబర్లకు తెలియజేయవచ్చని, ఈమెయిల్: helpline@apnrts.com ద్వారా సంప్రదించి సహాయం పొందాలని సూచించారు.

వారితో మాట్లాడటం కొంచెం కష్టంగా ఉంది: గల్ఫ్‌ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటంతో రాష్ట్రం నుంచి చాలా మంది అక్కడకి వెళ్తున్నారని రవి కుమార్ తెలిపారు. మరి కొంతమంది పర్యటనల కోసం వెళ్లి అక్కడ ఇరుక్కుపోయారని వీరు ఎక్కువగా భయపడుతున్నారని చెప్పారు. ఏపీ ఎన్​ఆర్టీ హెల్ప్​లైన్ నంబర్లకు ఎప్పుడైనా చేయొచ్చని ప్రస్తుతం ఇరాన్​లో ఉన్నవారితో మాట్లాడటం కొంచెం కష్టంగా ఉందని తెలిపారు. మిగతా దేశాలలో ఉన్నవారితో చాలా మందితో మాట్లడి జాగ్రత్తలు చెప్పడం జరిగిందని తెలిపారు. మాకు రోజుకి 700 నుంచి 800 ఫోన్​లు వస్తున్నాయని ఇంకా వెబ్​సైట్​లో కో ఆర్డినేటర్ల వివరాలు ఉంటాయని వారికి ఏ సమయంలోనైనా సంప్రదించొచ్చని వేమూరి రవికుమార్ తెలిపారు.

"గల్ఫ్‌ దేశాల్లో సుమారు 10 లక్షల మంది వరకు ఏపీ వాసులు ఉన్నారు. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటంతో రాష్ట్రం నుంచి చాలా మంది అక్కడకి వెళ్తున్నారు. మరి కొంతమంది పర్యటనల కోసం వెళ్లి అక్కడ ఇరుక్కుపోయారు. వీరు ఎక్కువగా భయపడుతున్నారు. ఏపీ ఎన్​ఆర్టీ హెల్ప్​లైన్ నంబర్లకు ఎప్పుడైనా చేయొచ్చు. ప్రస్తుతం ఇరాన్​లో ఉన్నవారితో మాట్లాడటం కొంచెం కష్టంగా ఉంది. మిగతా దేశాలలో ఉన్నవారితో చాలా మందితో మాట్లడి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. మాకు రోజుకి 700 నుంచి 800 ఫోన్​లు వస్తున్నాయి. ఈ helpline@apnrts.com వెబ్​సైట్​లో కో ఆర్డినేటర్ల వివరాలు ఉంటాయి."- వేమూరి రవి, ఏపీ ఎన్​ఆర్టీ అధ్యక్షుడు

తెలుగువారి భద్రతపై స్పీకర్ ఆరా: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహ్రెయిన్‌లో నివసిస్తున్న తెలుగువారి భద్రతపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్‌లోని అమెరికన్ నావల్ బేస్‌పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రానికి చెందిన సుమారు 50 వేల మంది వరకు అక్కడ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన వారు అనేకమంది ఉపాధి నిమిత్తం బహ్రెయిన్‌లో స్థిరపడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల మధ్య నాతవరంకు చెందిన ఎన్నారై శెట్టి సతీష్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా ఫోన్ చేసి, అక్కడి తెలుగువారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

​బహ్రెయిన్‌లో ఉన్న తెలుగువారంతా అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని స్పీకర్ సూచించారు. ఎటువంటి ఆపద వచ్చినా ఏపీఎన్ఆర్టీ (APNRT) ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన భరోసా కల్పించారు. అవసరమైతే అక్కడి తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి తక్షణ సహాయక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కష్టకాలంలో తమ బాగోగులు తెలుసుకుని, అండగా నిలుస్తూ తమలో మనోధైర్యాన్ని నింపిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి ఎన్నారైలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు: మంత్రి కొండపల్లి

గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులు- వారి భద్రతపై ఆందోళనలు- తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు

Last Updated : March 2, 2026 at 7:29 PM IST