ETV Bharat / state

ఏపీ టెట్‌ 2025 తుది ఫలితాలు విడుదల - రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

ఏపీ టెట్‌ 2025 తుది ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్ - గతేడాది డిసెంబర్‌లో జరిగిన పరీక్షలు - టెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 39.27 శాతం మంది అభ్యర్థులు

AP_TET_RESULTS
AP_TET_RESULTS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 9, 2026 at 7:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

AP TET 2025 Results Released: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2025) ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. టెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో విజయాలు సాధించాలని శుభాకాంక్షలు చెప్పారు

2025 డిసెంబర్‌ 10 నుంచి 21 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా 2,48,427 మంది హాజరైనట్లు ఏపీ టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి ముందుగా ప్రాథమిక కీ విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఫలితాలు విడుదల చేసినట్లు కన్వీనర్‌ పేర్కొన్నారు. టెట్‌లో 97,560 మంది (39.27 శాతం) ఉత్తీర్ణులు సాధించారు. ఈ పరీక్షకు 31,886 మంది ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులు హాజరుకాగా వారిలో 47.82 శాతం (15,239) మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణులయ్యారు. టెట్‌ పరీక్ష ఫలితాలను https://tet2dsc.apcfss.in, http://cse.ap.gov.in, 9552300009 వాట్సప్‌ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని టెట్‌ కన్వీనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకూ అవకాశం: గతంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాసేందుకు ప్రస్తుతం పని చేస్తున్న టీచర్లకూ అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 2011కు ముందు టెట్‌ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన టీచర్లకూ టెట్‌ రాసుకునే అవకాశం కల్పించారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్‌ పాస్‌ కావాలని సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబరు 1న తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి 2 ఏళ్లలో ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. 5 ఏళ్లలో పదవీవిరమణ చేయబోయే వారికి అవసరం లేదని, అయితే వారు పదోన్నతి పొందాలంటే టెట్‌ పాసవ్వాలని సూచించింది.

సుప్రీంకోర్టు తీర్పుపై అప్పట్లో కొన్ని సంఘాలు రివ్యూ పిటిషన్లు వేశాయి. ఈ తీర్పు కోసం వేచి ఉండేవారికీ వెసులుబాటు కల్పిస్తారు. ఇంకా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీలో 40% మార్కులున్నా బీఈడీలో ప్రవేశం కల్పించారు. ఈ సడలింపుతో బీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆ తర్వాత టెట్‌ రాయాలంటే 45% అర్హత మార్కులు అవసరమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ నిబంధనను సడలిస్తూ 40% ఉన్నా టెట్‌ రాసేందుకు అవకాశం కల్పించారు. ఈసారి 45% అర్హత మార్కులనే అనుసరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త - 2026 జనవరిలో నోటిఫికేషన్‌, మార్చిలో పరీక్షలు

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో దేశంలోనే ఏపీ టాప్ - ఏకంగా 12,912 స్కూల్స్