ETV Bharat / state

గ్రూప్‌-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లును కొట్టివేసిన హైకోర్టు

రిజర్వేషన్‌ పాయింట్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు కొట్టివేత - 2023 డిసెంబర్ 7న ఇచ్చిన నోటిఫికేషన్​ని రద్దు చేయాలని కోరుతూ పలువురు వ్యాజ్యాలు

High_Court_ON_GROUP_2_EXAM
High_Court_ON_GROUP_2_EXAM (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 30, 2025 at 8:03 PM IST

2 Min Read
Choose ETV Bharat

High Court Dismissed Petitions Filed Regarding Group-2: గ్రూప్-2పై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్ట్ ధర్మాసనం కొట్టివేసింది. గ్రూప్-2 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7న జారీ చేసిన నోటిఫికేషన్​లో మహిళలు, క్రీడాకారులు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు (హారిజాంటల్ రిజర్వేషన్) ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టేసింది. 2023 డిసెంబర్ 7న ఇచ్చిన నోటిఫికేషన్​ని రద్దు చేయాలని కోరుతూ పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్​ని నిర్ణయించి గూప్-2 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇటీవల ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఇప్పుడు తాజాగా నిర్ణయం వెల్లడిస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. గ్రూప్‌-2 పరీక్షలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వాటన్నిటినీ అధిగమించి పరీక్షను యథాతథంగా షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహిస్తామని గతంలో ఏపీపీఎస్సీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం రాసిన లేఖకు సమాధానం: గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని గతంలో ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పరీక్షలు వాయిదా వేయలేమని అప్పట్లో స్పష్టం చేసింది. ఇప్పుడు పరీక్షలను వాయిదా వేస్తే అభ్యర్థుల మానసికస్థితిపై ప్రభావం చూపిస్తుందన్న వివరించింది. ఈ క్రమంలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో ఎక్కడా రోస్టర్ పాయింట్‌ల ప్రస్తావన లేద స్పష్టం చేసింది. వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్ వెనక కోచింగ్ సెంటర్ల పాత్ర కుడా ఉన్నట్లు తెలుస్తోందని ఏపీపీఎస్సీ ప్రస్థావిచింది. కేవలం నోటిఫికేషన్​ను రద్దు చేయించడం కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీపీఎస్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ: రోస్టర్‌ తప్పులు సరిచేయకుండా గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహణపై రాష్ట్రంలో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈ పరీక్షను కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ కార్యదర్శికి ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్‌ అంశం కోర్టులో ఉందని, కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్‌ వేసేందుకు ఇంకా సమయం ఉందని లేఖలో తెలిపింది. అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ ప్రభుత్వం లేఖ రాసిన విషయం విధితమే.

ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారిని హోంలకు తరలించండి: హైకోర్టు

'న్యాయమూర్తుల కళ్లకు గంతలు కట్టలేరు' - మండిపడిన హైకోర్టు