ETV Bharat / state

శ్రీవారి దర్శనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం - తప్పు చేసిన వారిపై క్రిమినల్‌ చర్యలు

టీటీడీలో తప్పు చేసిన వారిపై క్రిమినల్‌ చర్యలు - స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తెచ్చే యోచన - కల్తీ నెయ్యిపై శాసనసభలో నేడు 10.30 నుంచి 2 గంటల వరకు చర్చ

Government Plans to New Rules in Tirumala Darshan to Protect Temple Sanctity
Government Plans to New Rules in Tirumala Darshan to Protect Temple Sanctity (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 24, 2026 at 9:01 AM IST

2 Min Read
Choose ETV Bharat

Government Plans to New Rules in Tirumala Darshan to Protect Temple Sanctity : టీటీడీలో కల్తీ నెయ్యి సరఫరా వంటి అపచారాలు ఇక పై జరగకుండా, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించేలా నిబంధనల్ని మరింత తీవ్రతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవసరమైతే ప్రత్యేక చట్టం తేవాలి అన్న యోచనలో ఉంది. తిరుమలలోను కూడా స్వర్ణ దేవాలయం తరహాలో చట్టాన్ని తీసుకు వచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

అమృత్​సర్​లోని స్వర్ణ దేవాలయానికి ప్రత్యేక చట్టం ఉంది. అదే తరహాలో టీటీడీకి కూడా చట్టం తెచ్చేందుకు ఉన్న అవకాశాల్ని అధ్యయనం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈనెల 23వ తేదీన శాసన సభలోని తన ఛాంబర్​లో కొందరు మంత్రులు, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలోకి అన్యమతస్తులు ప్రవేశించాలి అంటే డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి చేస్తూ, నిబంధనల్లో మార్పులు చేయాలి అన్న నిర్ణయానికి వచ్చారు. టీటీడీ నిబంధనలు ప్రకారం అన్యమతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల టీటీడీ చుట్టూ అనేక వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త చట్టం ప్రవేశపెట్టనుంది. కఠిన నిబంధనలు తీసుకు వచ్చేందుకు కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. గతేడాది కాలంగా టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఇప్పటికే సిట్ విచారమ చేపట్టి కల్తీ జరిగినట్లు నిర్ధారించింది. స్వర్ణ దేవాలయం చట్టం పై అధ్యయనం చేయనున్నారు. ఆ తర్వాత శాసనసభలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అనంతరం బిల్లును ఆమోదిస్తే కొత్తం చట్టం అమల్లోకి రానుంది.

కల్తీ నెయ్యి వ్యవహారం పై నేడు శాసనసభలో ప్రత్యేక చర్చ చేపట్టనున్నారు. అధికార కూటమిలోని 3 పార్టీలకు చెందిన సుమారు 10 మంది సభ్యులతో ఈ అంశం పై మాట్లాడించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గొంతు నొప్పి కారణంగా సోమవారం శాసన సభ సమావేశాలకు హాజరు కాలేదు. నేడు కల్తీ నెయ్యి పై చర్చలో ఆయన పాల్గొని మాట్లాడతారని సమాచారం. చివర్లో సీఎం చంద్రబాబు ప్రకటన ఉంటుంది.

శ్రీవారి వైద్య సేవకులు - దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే?

మీ ఇంట్లో శుభకార్యమా? - తక్కువ ఖర్చుతోనే టీటీడీ కళ్యాణ మండపం బుక్​ చేసుకోండిలా