ETV Bharat / state

దెబ్బతిన్న రేటింగ్​ను పెంచుకుంటే ఏపీ జెన్‌కోకు రూ.100 కోట్లు ఆదా!

వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు జెన్‌కో యత్నం - ఇప్పటికే వడ్డీ రేటు 8.7 శాతానికి తగ్గించిన బ్యాంకర్లు, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలతోనూ సంప్రదింపులు, దెబ్బతిన్న రేటింగ్‌ పెంచుకునేలా చర్యలు

AP Genco Trying To reduce Interest Burden
AP Genco Trying To reduce Interest Burden (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 27, 2025 at 8:12 AM IST

|

Updated : December 27, 2025 at 8:57 AM IST

3 Min Read
Choose ETV Bharat

AP Genco Is Trying To Reduce The Interest Burden: ఆర్థిక సమస్యలతో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని కారణంగా దెబ్బతిన్న రేటింగ్‌ను పెంచుకునేందుకు ఏపీ జెన్‌కో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ‘సి’ రేటింగ్‌లో ఉన్న సంస్థను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ‘బి’ కి పెంచుకోవడం ద్వారా రేటింగ్‌ను మెరుగుపరచుకునేందుకు చర్యలు చేపట్టింది.

ఏటా రూ.100 కోట్లు ఆదా: రేటింగ్‌ ఆధారంగా ఆర్థిక సంస్థలు రుణాలపై వడ్డీ రేటును నిర్ణయిస్తున్నాయి. జెన్‌కోకు ఉన్న రేటింగ్‌ పూర్తిగా దెబ్బతినడంతో అధిక వడ్డీకి రుణాలు తీసుకోవాల్సి పరిస్థితి వస్తోంది. దీనివల్ల సంస్థపై ఏటా రూ.100 కోట్ల వరకు అధిక భారం పడుతోంది. అందువల్ల ఎలాగైనా వడ్డీ భారాన్ని తగ్గించుకునేలా సంస్థ దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టింది. వడ్డీ రేటు సవరించడంపై పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), ఆర్‌ఈసీ (రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌) సహా వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది.

వడ్డీ 9 శాతం లోపు ఉండేలా చర్యలు: మూలధనం, నిర్వహణ వ్యయం కోసం ఏపీ జెన్‌కో సుమారు రూ.22,000 వేల కోట్లు (ఏపీ విద్యుత్‌ అభివృద్ధి సంస్థ రుణాలు కాకుండా) రుణంగా తీసుకుంది. రేటింగ్‌ తీవ్రస్థాయిలో దెబ్బతినడం వల్ల 10.5 శాతం వడ్డీ రేటుకు కొన్ని రుణాలను తీసుకుంది. అలా అధిక వడ్డీకి తీసుకున్న రుణాలు సుమారు రూ.10,000 వేల కోట్ల వరకు ఉంటాయని జెన్‌కో తేల్చింది. సంస్థ తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు సగటున 9 శాతం లోపు ఉండేలా ఇప్పుడు చర్యలు చేపట్టింది.

వడ్డీ రేటు 8.7 శాతం వరకు తగ్గింపు: ఎస్‌బీఐతో పాటు వివిధ బ్యాంకుల నుంచి నిర్వహణకు సుమారు రూ.3,000 వేల కోట్లు జెన్‌కో రుణంగా తీసుకుంది. దీనిపై వడ్డీ రేటు 10.5 శాతం వరకు ఉండటం గమనార్హం. సంప్రదింపుల తర్వాత 8.7 శాతానికి తగ్గించేందుకు బ్యాంక్‌ అంగీకరించింది. ఈ మేరకు ఎస్‌బీఐ ఇటీవల ఒప్పంద పత్రాన్ని ఇచ్చింది. దీనివల్ల ఏటా రూ.48 కోట్లు మిగులుతుంది. అధిక వడ్డీ రేటు తగ్గింపుపై పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలతోనూ జెన్‌కో సంప్రదింపులు జరుపుతోంది. సంస్థ రేటింగ్‌ చక్కగా మెరుగుపడితే వడ్డీ రేటు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని పలు సంస్థలు ఏపీజెన్​కోకి సూచించాయి.

ప్రతి ఏటా మరో రూ.50 కోట్లు ఆదా: తక్కువ రేటుకు తీసుకున్నటువంటి రుణాలను మినహాయించి అధిక వడ్డీ రేటు ఉన్న వాటిని 9.5 శాతానికి తగ్గించేందుకు సూత్రప్రాయంగా ఆ సంస్థలు అంగీకరించాయని అధికారులు వెల్లడించారు. దీనివలన ఏటా మరో రూ.50 కోట్లు వరకూ ఆదా అవుతుందని ప్రాథమిక అంచనా.

దీని ప్రకారం రేటింగ్‌ పెంచుకునేందుకు రెండు సంస్థలకు చెల్లించాల్సిన రుణాన్ని నిర్దేశిత వ్యవధిలో జెన్‌కో చెల్లించింది. దీనివల్ల ఆరు నెలల తర్వాత సంస్థ రేటింగ్‌ మెరుగుపడుతుందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

ఏపీ జెన్​కో చరిత్ర: 1999లో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు సంస్థ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలుగా విడిపోయింది. విభజన తరువాత ఈ స్థలాన్ని ఏపీ జెన్‌కో, ఒడిశాకు అప్పగించారు. తరువాత కొన్నాళ్లు అతిథిగృహాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థలం అన్యాక్రాంతానికి యత్నాలు జరుగుతుండటంతో ఒడిశా ప్రభుత్వం, కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో 2021 మార్చిలో ఇక్కడ అతిథిగృహాన్ని పూర్తిగా నిలిపివేసి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రానికి బదిలీ చేశారు.

అయితే అతిథిగృహం మూతపడి అయిదేళ్లు అవుతున్నా దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టు భవనాలు, స్థలం డంపింగ్‌యార్డులా మారాయి. ఈ ప్రాంతంలో భూముల విలువ ఎప్పుడో ఆకాశాన్నంటింది. మొత్తం రూ.18 కోట్ల విలువైన ఆస్తిని ఏపీ జెన్‌కో పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రానికి రానున్న రూ.లక్ష కోట్ల పెట్టుబడులు - ఏపీ జెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ భాగస్వామ్యంతో విద్యుత్‌ ప్రాజెక్టులు -

ఆర్థిక గండం గట్టెక్కడానికి.. అన్ని వేల కోట్లు కావాలా?!

Last Updated : December 27, 2025 at 8:57 AM IST