ETV Bharat / state

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు - ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్‌ తిరస్కరణ

సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్‌ను తిరస్కరించిన పట్నా కోర్టు - పట్నా నుంచి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఏపీ పోలీసులు - ఇవాళ ఉదయం సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

AP Police Arrest IPS Sunil
AP Police Arrest IPS Sunil (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 23, 2026 at 11:08 AM IST

2 Min Read
Choose ETV Bharat

AP Police Arrest IPS Sunil Nayak : రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్​నాయక్​ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సునీల్​నాయక్​ను ఏపీ పోలీసులు బిహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో సునీల్​నాయక్​​ నిందితుడిగా ఉన్నారు. గుంటూరులోని నగరంపాలె పోలీస్​స్టేషన్​లో సునీల్​నాయక్​ ​పై కేసు నమోదైంది.

వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో ఆయన డిప్యూటేషన్​పై సీఐడీలో పని చేశారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్​నాయక్ పాత్రపై ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ నిమిత్తం పలు సార్లు నోటీసులు ఇచ్చినా సునీల్​నాయక్​ స్పందించ లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్​నాయక్​ ​ బిహార్ సర్వీస్​కు వెళ్లిపోయారు.​

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో పోలీసు అధికారి సునీల్​నాయక్ అరెస్టు (ETV Bharat)

పాట్నాకు వెళ్లిన ఏపీ పోలీసులు : సునీల్​నాయక్​ను అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు బిహార్​లోని పట్నాకు వెళ్లారు. ప్రస్తుతం సునీల్​నాయక్​ అగ్నిమాపక శాఖ ఐజీగా పని చేస్తున్నారు. అక్కడ గృహ నిర్బంధంలో ఉన్న ఆయనను ఏపీ పోలీసులు ట్రాన్సిట్​ రిమాండ్​పై ఆంధ్రప్రదేశ్​కు తీసుకు రావాలనుకున్నారు.

బిహార్​ పోలీసుల కథనం ప్రకారం: పట్నాలోని అగ్నిమాపక దళ ఇన్​స్పెక్టర్​ జనరల్​ అధికారిక నివాసంపై ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందం దాడి చేసిందని బిహార్ పోలీసులు తెలిపారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్​లో హత్య కేసు నమోదు చేయడంతో అక్కడి పోలీసులు అరెస్టు చేశారని బిహార్​ పోలీసులు తెలిపారు.

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు : 2021లో అప్పటి నర్సాపురం ఏపీ రఘురామకృష్టరాజును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్​లోని సీఐడీలో సునీల్​నాయక్ విధులు నిర్వహించారు. తనపై కస్టడీలో దాడికి పాల్పడ్డారని అప్పట్లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కోర్టు ఆదేశం మేరకు సునీల్​నాయక్ పై కేసు నమోదు చేశారు. కోర్టు ఆయన బెయిల్ రద్దు చేసిన తర్వాత, ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి పట్నాకు వెళ్లారు.

ట్రాన్సిట్ వారెంట్ తిరస్కరణ :​ అయితే ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్​ను పట్నా కోర్టు తిరస్కరించింది. సునీల్ నాయక్​ను గుంటూరుకు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ తీసుకునేందుకు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం వారెంట్ ఇచ్చేందుకు నిరాకరించింది. బిహార్ వెళ్లిన పోలీసుల బృందం ఈ సమాచారాన్ని ఏపీ పోలీస్ ఉన్నతాధికారులకు చేరవేశారు. రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ పై ఆరోపణలున్నాయి. సంఘటన జరిగిన సమయంలో సునీల్ నాయక్ ఏపీ సీఐడిలో పని చేశారు.

రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం - ఐపీఎస్ సునీల్ కుమార్‌పై కేసు నమోదు

సునీల్​కుమార్​కు సిట్ నోటీసులు - డిసెంబర్ 4న విచారణకు హాజరవ్వాలని వెల్లడి