ETV Bharat / state

స్పెషల్ టెట్‌ షెడ్యూల్ ఇదే - నేటి నుంచే దరఖాస్తులు స్వీకరణ

ఇన్‌సర్వీస్‌ టీచర్ల కోసం ప్రత్యేక టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల - నోటిఫికేషన్‌ వివరాలు ఎక్స్​లో షేర్​ చేసిన మంత్రి లోకేశ్ - టీచర్లు టెట్‌ అర్హత పూర్తి చేసుకునేందుకు ప్రత్యేక అవకాశం

Nara Lokesh On TET Exam
టెట్ అభ్యర్థులకు లోకేశ్​ సలహా (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 25, 2026 at 7:33 AM IST

2 Min Read
Choose ETV Bharat

TET Exam: సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్‌ 24 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం కల్పించింది. హాల్​టికెట్లను అక్టోబర్‌ 5 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 11 నుంచి 21 వరకు పరీక్షలు రెండు విడతలుగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాయి. ప్రాథమిక ‘కీ’ని అక్టోబర్‌ 24న విడుదల చేస్తారు. నవంబర్‌ 1 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 10న తుది కీ విడుదల చేస్తారు. టెట్‌ ఫలితాలను నవంబరు 15న వెల్లడిస్తామని కన్వీనర్‌ కృష్ణారెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయుల వినతుల మేరకు ప్రభుత్వం ఈ ప్రకటన ఇచ్చింది.

ప్రత్యక్ష నియామకాలకు ప్రత్యేక టెట్‌ పనికిరాదు : ప్రత్యేక టెట్‌లో అర్హత సాధించినవారు భవిష్యత్తులో నిర్వహించే ఏ ప్రత్యక్ష నియామక ప్రక్రియకు హాజరుకాకూడదని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.‘డీఈడీ, బీఈడీ అర్హతలతో నియమితులైన ఎస్జీటీలు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయులు పేపర్‌-1, స్కూల్‌ అసిస్టెంట్లు, టీజీటీ, భాషా పండితులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేపర్‌-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లు సంబంధిత సబ్జెక్టులో పేపర్‌-2 పరీక్ష రాయాలి. టెట్‌ అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పుల్లేవు’ అని తెలిపింది.

ఎక్స్​లో షేర్​ చేసిన మంత్రి లోకేశ్​: స్పెషల్​ టెట్​ నోటిఫికేషన్​ వివరాలను విద్యాశాఖ మంత్రి లోకేశ్​ ఎక్స్​లో షేర్​ చేశారు. ఇందులో నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష తేదీలతో సహా పూర్తి వివరాలు ఉన్నాయి. ఇప్పటివరకు టెట్​ రాయనటువంటి లేదా రాసినా అర్హత సాధించని ఉపాధ్యాయులు ఇప్పుడు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అక్టోబర్​ 11-21 మధ్య పరీక్షలు : విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'స్పెషల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్' నిర్వహిస్తుండటం పట్ల విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్​ హర్షం వ్యక్తం చేశారు. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు టెట్​లో అర్హత సాధించి, ఆత్మవిశ్వాసంతో తమ వృత్తిపరమైన ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు.

అధికారిక వెబ్​సైట్​లో పూర్తి వివరాలు : అర్హులైన ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, మాక్ టెస్ట్‌ల ద్వారా పరీక్షకు సిద్ధం కావాలని మంత్రి లోకేశ్​ కోరారు. ఈ స్పెషల్ టెట్​కి సంబంధించిన మరిన్ని వివరాలు, మార్గదర్శకాల కోసం https://cse.ap.gov.in, https://tet2dsc.apcfss.in అనే అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా, ఉపాధ్యాయులను శక్తివంతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన విద్యకు బలమైన పునాది వేయడానికి అందరూ కలిసి పనిచేయాలని లోకేశ్​ పిలుపునిచ్చారు.

జగన్‌కు ఏపీపీఎస్సీ-డీఎస్సీ అర్థం కాదు - రెండూ ఒకటే అనుకుంటున్నారు: మంత్రి లోకేశ్​​

మెగా డీఎస్సీపై సభకు వచ్చి చర్చించాలి - జగన్​కు​ మంత్రి లోకేశ్​ సవాల్‌