ETV Bharat / state

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ - టీటీడీకి భారీ విరాళం

వేంకటేశ్వరస్వామి వారిలో సేవలో అనంత్ అంబానీ - టీటీడీకి భారీగా విరాళాల ప్రకటన - 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం

Anant Ambani AnnouncesHuge Donations to TTD
Anant Ambani AnnouncesHuge Donations to TTD (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 28, 2026 at 10:11 AM IST

2 Min Read
Choose ETV Bharat

Anant Ambani AnnouncesHuge Donations to TTD : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఇవాళ వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. తిరుమలకు చేరుకున్న అనంత్ అంబానీకి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

శ్రీవారి దర్శనానికి ముందు అనంత్ అంబానీ స్వామివారికి తలనీలాలు సమర్పించి, స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. అనంత్ అంబానీకి వేదపండితులు ఆశీర్వచనం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను సందర్శించారు.

టీటీడీకి భారీ విరాళాల ప్రకటన: ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ టీటీడీకి భారీ విరాళం అందజేయనున్నారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, భక్తుల రవాణా సౌకర్యాలలో భాగంగా సుమారు రూ.27.5 కోట్ల విలువ చేసే 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను అందించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనను కోరినట్లు తెలుస్తోంది. దీనికి అనంత్ అంబానీ సానుకూలంగా స్పందించి, తక్షణమే అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వాటి నిర్వహణకు అవసరమైన 50 మంది డ్రైవర్లను వారికి అయ్యే జీతభత్యాలను సైతం రిలయన్స్ సంస్థ భరించనుంది. వీటితో పాటు తిరుమల కొండపై ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా ఛార్జీంగ్ స్టేషన్లను కూడా నిర్మించనున్నారు.

టీటీడీ గోశాలను ఆధునికీకరణకు అంగీకారం: అదేవిధంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'వంతారా' జంతు సంరక్షణ కేంద్రం తరహాలోనే తిరుమలలోని టీటీడీ గోశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అనంత్ అంబానీ అంగీకారం తెలిపారు.

సర్వదర్శనానికి 30 గంటల సమయం: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు. శనివారం ఒక్కరోజే 85,582 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి 44,155 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చింది. నిన్న 4.66 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయించారు.

తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ - వీఐపీ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్

శ్రీవారి సేవలో "మహానటి" - భర్తతో కలిసి మొక్కులు చెల్లించుకున్న కీర్తి సురేశ్