ETV Bharat / state

ఆర్మీ ఉద్యోగి దారుణ హత్య - కట్టుకున్న భార్య చేతిలోనే హతం

ఆర్మీలో సుబేదర్‌గా ఉన్న పొన్నం కుమార్‌ గౌడ్(49) హత్య - అర్ధరాత్రి కుమార్‌పై భార్య, అత్తామామ, బావమరిది కలిసి దాడి - ఉత్తరాఖండ్‌లో విధులు నిర్వహిస్తూ నెల క్రితం సెలవులపై వచ్చిన కుమార్‌

Army employee Died in Medak
Army employee Died in Medak (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 7, 2026 at 10:59 PM IST

|

Updated : June 8, 2026 at 10:28 AM IST

2 Min Read
Choose ETV Bharat

Army Employee Murder in Medak : అతను ఆర్మీ ఉద్యోగి. సెలవుల రీత్యా కుటుంబంతో గడపటానికి స్వస్థలానికి వచ్చాడు. ఇంకా కొన్ని రోజులైతే తిరిగి విధుల్లో చేరునున్న ఆ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. కట్టుకున్న భార్య చేతిలోనే అతను అంతమయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన మెదక్​లోని మిలిటరీ కాలనీలో కలకలం రేపింది. భార్య ఎందుకు చంపాల్సి వచ్చింది? దీని వెనక ఉన్న కారణం ఏంటనే విషయం ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్మీ సుబేదార్​గా విధులు : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మెదక్​ మండలం ర్యాలమడుగుకు చెందిన కుమార్​ గౌడ్ ​(49) కొన్నేళ్ల కిందట కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన పద్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్ ​గౌడ్​ ఆర్మీ ఉద్యోగం చేస్తున్నాడు. అతను ప్రస్తుతం ఉత్తరాఖండ్​లో ఆర్మీ సుబేదార్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని భార్యాపిల్లలు మెదక్​లోని మిలిటరీ కాలనీలో నివాసం ఉంటున్నారు.

ఎప్పటి నుంచో మనస్పర్థాలు : కుమార్ గౌడ్​​ గత నెల 11న సెలవుల మీద ఇంటికి వచ్చాడు. తిరిగి ఈ నెల 10న విధుల్లో చేరాల్సి ఉంది. కానీ కొంతకాలం నుంచి కుమార్​ ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఈ అంశంతో పాటు పలు అంశాల కారణంగా కొన్నాళ్లుగా గొడవలు అవుతున్నాయి. దీనిపై పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అప్పుడు గొడవలు కొంచెం సద్దుమణిగాయి. కానీ 15 రోజుల కిందట దంపతుల మధ్య మళ్లీ తగాదా ఏర్పడింది. దీంతో పద్మ తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.

అనుమానంతో హత్య : పద్మ మెదక్​లో ఉంటున్న ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇవి పద్మ ఫోన్​కు అనుసంధానమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుమార్​ శనివారం రాత్రి ఇద్దరు అమ్మాయిలతో ఉన్నట్లు కెమెరా ద్వారా పద్మ చూసింది. వెంటనే పద్మ ఆమె తల్లిదండ్రులు, సోదరుడు కలిసి కుమార్ గౌడ్​ ఇంటికి వచ్చారు. జరిగిన విషయంపై వారంతా కుమార్​ గౌడ్​తో గొడవపడి, ఆగ్రహంతో అతనిపై దాడికి దిగారు. వెళ్లిన నలుగురు కలిసి కర్రలతో దాడి చేయడంతో అతను మృతి చెందాడు.

ఏమీ తెలియనట్లు ఆసుపత్రిలో చేరిక : కుమార్​ గౌడ్​ మృతి చెందినట్లు తెలియగానే వారంతా ఏమీ తెలియనట్లు ఆదివారం అతని సోదరుడు రవీందర్​కు ఫోన్​ చేశారు. మీ తమ్ముడికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చామని చెప్పారు. విషయం తెలుసుకుని వెంటనే ఆసుపత్రికి రాగా, కుమార్​ విగతజీవిగా కనిపించాడు. రవీందర్​ గౌడ్​ తన తమ్ముడి మృతదేహాన్ని పరిశీలించగా శరీరంపై గాయాలు కనిపించాయి. అనుమానం వచ్చి వెంటనే రవీందర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి పద్మను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసుకుని పద్మతో పాటు ఆమె తల్లిందండ్రులు ఎల్లమ్మ, కిష్టాగౌడ్​, తమ్ముడు సంతోశ్​​​ గౌడ్​ను అరెస్ట్​ చేశారు. ఈ ఘటనలో మరికొంతమంది ఉన్నట్లు అనుమానం ఉందని, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని మెదక్​ పట్టణ సీఐ మహేశ్​ తెలిపారు.

అమెరికాలో మేడ్చల్ జిల్లా యువకుడి ​హత్య - పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లగా దుండగుల కాల్పులు

సినిమా స్టోరీని మించిన స్క్రిప్ట్​ - 'రాజు' ఎంట్రీతో కట్టుకున్నోడిని బలిచ్చిన ఆలి!

Last Updated : June 8, 2026 at 10:28 AM IST