రాజధానిలో పోలీస్ టీ-20 క్రికెట్ పోటీలు - పాల్గొన్న హోంమంత్రి, డీజీపీ
ఆల్ ఇండియా పోలీసు సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం - స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించిన హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా- మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ గ్రౌండ్స్‌లో స్పోర్ట్స్ మీట్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 5:20 PM IST
All India Police Cricket Tournament at Mangalagiri : పోలీసుల్లో ఉన్న క్రీడాస్ఫూర్తిని, ఐక్యతను చాటేలా స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించడం గొప్ప విషయమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ గ్రౌండ్స్‌లో ఆల్ ఇండియా పోలీసు సౌత్ జోన్ టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ఆమె ప్రారంభించారు. అమరావతిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో రాజధాని ఖ్యాతి పెరుగుతుందన్నారు. ప్రజా భద్రతకు అహర్నిషలు శ్రమిస్తున్న పోలీసులు స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొనడం అభినందనీయమని డీజీపీ తెలిపారు.
పోటీలను 160 దేశాల్లో తిలకించేలా : ఆల్ ఇండియా స్థాయిలో రెండోసారి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఈనెల 24 వరకు జరగనున్న క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తోంది. ఈ పోటీలను సౌత్ జోన్ టోర్నీలో 6 రాష్ట్రాలతో పాటు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, ఐటీబీబీ, బోర్డర్ టీంలు కూడా తలపడుతున్నాయని హోంమంత్రి అనిత వివరించారు. నేడు అమరావతి అంటేనే ప్రజల రాజధాని. దీన్ని అభివృద్ది చేసేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు, పోటీలను 160 దేశాల్లో తిలకించేలా లైవ్ ఏర్పాటు చేశారన్నారు. అమరావతి ఖ్యాతి ఏ విధంగా విస్తరించనుందో అర్దం అవుతుందని తెలిపారు.
''పోలీసుల్లో క్రీడాస్ఫూర్తి ఐక్యత చాటేలా స్పోర్ట్స్ మీట్ పెట్టడం గొప్ప విషయం. అమరావతిలో ఇలాంటి కార్యక్రమాలతో రాజధాని ఖ్యాతి పెరుగుతుంది. మహిళా పోలీసులకూ ఇలాంటి స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలి. ప్రజా భద్రతకు పోలీసులు అహర్నిశలు కష్టపడతారు. క్రీడా స్ఫూర్తితో ప్రతిఒక్కరూ అడుగులు వేయాలి. మహిళా పోలీసులకూ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలని డీజీపీని కోరుతున్నా.'' - అనిత, హోంమంత్రి
సీఎం దూరదృష్టి, ప్రణాళిక బద్దమైన పనుల వల్ల అద్బుత రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేసేందుకు సమిష్టిగా కలిసి ఏర్పాట్లు చేశారని హోంమంత్రి అనిత ప్రశంసించారు. క్రీడల్లో జయాపజయాలు ఎలా ఉన్నా పోటీలో తలపడటం చాలా ముఖ్యమన్నారు. పోలీసులకు ఫిజికల్, మెంటల్ ఫిట్‌నెస్ ఎక్కువుగానే ఉంటుందన్నారు. కానీ ఈ తరహా క్రీడల వల్ల పోలీసులు మరింత ఫిట్‌గా తయారవుతారని, ఈ క్రికెట్ టోర్నీ పోలీసుల ఖ్యాతిని మరింత పెంచుతుందని ఆశిస్తున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు.
పోలీస్ బలగాల క్రమశిక్షణ, ఐక్యతకు, స్ఫూర్తికి నిదర్శనం : ఈ టోర్నీ క్రీడా పోటీ మాత్రమే కాదు, ఇది మన పోలీస్ బలగాల క్రమశిక్షణ, ఐక్యతకు, స్ఫూర్తికి నిదర్శనమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అమరావతి ఇప్పటికే 'ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26'ను విజయవంతంగా నిర్వహించిందని, ఇప్పుడు ఈ టోర్నమెంట్ ద్వారా క్రీడా నైపుణ్యానికి అమరావతి ఒక ప్రధాన కేంద్రంగా మారుతోందని వెల్లడించారు.
''నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులు స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొనడం అభినందనీయం. స్నేహపూర్వక వాతావరణంలో స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది.'' - హరీష్‌కుమార్ గుప్తా, డీజీపీ
క్రీడలు మనలో సహృద్భావం, పట్టుదల, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు. దక్షిణ భారతదేశం కేంద్ర బలగాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ సెల్యూట్ చేశారు.. వారి ప్రదర్శన మా అందరికీ స్ఫూర్తినిస్తుందని, క్రీడల్లోని క్రమశిక్షణ, ఐక్యతను ఎప్పుడూ ఇలాగే కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. పోలీస్ బలగాల ప్రతిష్ఠను పెంచడానికి ఏపీ పోలీస్ వ్యవస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
కల్తీపై చర్చకు సిద్ధమని జగన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు?: అనిత
ఇకపై త్వరగా కేసుల పరిష్కారం - 'ఏఐ4 ఏపీ పోలీస్'తో నూతన ప్రాజెక్ట్

