ETV Bharat / state

మీ ఇంట్లో శుభకార్యమా? - తక్కువ ఖర్చుతోనే టీటీడీ కళ్యాణ మండపం బుక్​ చేసుకోండిలా

పెళ్లిళ్ల సీజన్​లో మండపాలకు విపరీతమైన డిమాండ్​ - తక్కువ ఖర్చుతోనే అన్ని శుభకార్యాలకూ టీటీడీ కళ్యాణ మండపాలు -

TTD Kalyana Mandapam
TTD Kalyana Mandapam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 9, 2026 at 4:55 PM IST

2 Min Read
Choose ETV Bharat

Apply For TTD Kalyana Mandapam: పూర్వం ఏ వేడుక అయినా ఇంటి దగ్గర పచ్చని పందిళ్లలో జరిపేవారు. కానీ మానవ జీవన విధానంలో జరుగుతున్న మార్పులతో పాటే కొన్ని ఆచారాలు, సంస్కృతులు, అలవాట్లు, కట్టుబాట్లలో మార్పులు జరుగుతున్నాయి. అలాగే ఫంక్షన్​ హాళ్లలో పెళ్లిళ్లు జరుపుకునే ట్రెండ్​ కొనసాగుతుందిప్పుడు. ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి ఎంతో ముఖ్యమైన ఘట్టం. అలాంటి వేడుకను లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి వైభవంగా జరుపుకుంటున్నారు నేటితరం. ఇలా పెళ్లి మండపాలకు విపరీతమైన డిమాండ్​ పెరిగింది. దీంతో సామాన్య ప్రజానికం పడరాని పాట్లు పడుతుంది. ఈ తరుణంలో టీటీడీ వారందరికీ శుభవార్త చెప్పింది. మంచి సదుపాయాలతో, తక్కువ ఖర్చుతో అన్ని శుభకార్యాలకూ టీటీడీ కళ్యాణ మండపాన్ని బుక్​ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది.

అసలే మాఘమాసం, ఇప్పటికే కొత్త జంటలు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నాయి. ఈ సమయంలో తక్కువ ఖర్చుతో, సకల సౌకర్యాలతో పెళ్లి మండపాలు బుక్​ చేసుకోవాలనుకుంటున్నారా? టీటీడీ కళ్యాణ మండపం బుక్​ చేసుకోండి. కేవలం వివాహాలకే కాకుండా పలు శుభకార్యాలకు టీటీడీ మండపాల్లో జరుపుకోవచ్చు.

వివాహం, నిశ్చితార్థం, రిసెప్షన్​, షష్ఠిపూర్తి, బారసాల/నామకరణం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, అన్నప్రాశనం వంటి శుభకార్యాలు జరుపుకోవడానికి టీటీడీ మండపాలను బుక్​ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా రాష్ట్రాలలో టీటీడీ మండపాలు అందుబాటులో ఉన్నాయి.

మండపం ఎలా బుక్​ చేసుకోవాలంటే: ముందుగా టీటీడీ వెబ్​సైట్​ను తెరవాలి. దానిలో మీ ఖాతాలోని లాగిన్​ అవ్వాలి

https://ttdevasthanams.ap.gov.in/home/dashboard అందులో కళ్యాణమండపంను ఎంపిక చేసుకోవాలి.

Apply For TTD Kalyana Mandapam
టీటీడీ కళ్యాణ మండపం బుకింగ్​ (ETV Bharat)

ఆ తర్వాత మండపం వినియోగించుకునే విధానం గురించి కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటి అన్నింటికి అంగీకరిస్తూ టిక్​ మార్క్​ చేసి బుకింగ్​ ప్రక్రియను​ ముందుకు కొనసాగిస్తూ మండపం బుక్​ చేసుకునే ప్రక్రియను కొనసాగింవచ్చు.

Apply For TTD Kalyana Mandapam
టీటీడీ కళ్యాణ మండపం బుకింగ్​ (ETV Bharat)

అ తర్వాత ఏ రాష్ట్రం, జిల్లా, ప్రాంతం, వేడుక ఎంచుకోవాలి, తేదీ సహా ఎన్ని రోజులు వేడుక జరుపుకోవాలనుకుంటే అన్ని రోజుల కోసం మండపాన్ని బుక్​ చేసుకోవచ్చు.

Apply For TTD Kalyana Mandapam
టీటీడీ కళ్యాణ మండపం బుకింగ్​ (ETV Bharat)

ఖర్చు, మండపం వేళలు, మీరు ఎంచుకునే ప్రాంతం, శుభకార్యం మీద ఆధారపడి ఉంటాయి.

బుకింగ్​ పూర్తవడం కోసం ముందుగా కొంత సొమ్ము డిపాజిట్​ చెయ్యాల్సి ఉంటుంది. ఈ సొమ్ము కళ్యాణ మండపం బుక్​ అయిన తర్వాత రీఫండ్​ అవుతుంది.

అతి తక్కువ ఛార్జీలతో శుభకార్యం జరుపుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీ ఇంటి వేడుకను తక్కవ ఖర్చుతో టీటీడీ మండపంలో జరుపుకోండి.

తిరుపతిలోని వకుళమాత అన్నప్రసాద కేంద్రం సమీపంలోని శ్రీవారి కల్యాణవేదికలో శుభకార్యాలకు ఖర్చు

  • వివాహం - ఉచితం
  • ఉపనయనం - రూ.300
  • సత్యనారాయణ వ్రతం - రూ.300
  • కేశఖండన - రూ.200
  • నామకరణం - రూ.200
  • అన్నప్రాశన - రూ.200
  • అక్షరాభ్యాసం - రూ.200
  • వాహనపూజ - రూ.200
  • చెవిపోగులు కుట్టడం - రూ.50
  • చెవిపోగులు కుట్టడం (కాటేజీలో) - రూ.100
  • వేడుకలకు మేళం - రూ.100 (సెట్టు) రూ.300 (రెండు సెట్లు),
  • దస్త్రపూజ - రూ.200
  • ధార్మిక కార్యక్రమాలకు - రూ.200

భక్తులు పురోహితులను ముందుగానే సంప్రదించి కావాల్సిన పూజాసామగ్రి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని వేడుకలు సామూహికంగా జరిపిస్తారు. మరిన్ని వివరాలకు కల్యాణవేదిక వద్దనున్న పురోహిత సంఘాన్ని సంప్రదించవచ్చు.

శ్రీవాణి ట్రస్ట్‌ నిధులతో 5,000 ఆలయాలు - ఇప్పటికే 463కి అనుమతులు

హిందూ ఆలయాలకు సబ్సిడీపై టీటీడీ కానుకలు - మైక్​సెట్లు, విలువైన పంచలోహ విగ్రహాలు