ETV Bharat / state

అధునాతన వ్యవస్థగా తిరుమల 'ఏఐ కమాండ్' - అయోధ్య, కాశీ, సోమనాథ్‌ ఆలయాల్లో అమలుకు సన్నాహాలు

తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్​ కమాండ్ కంట్రోల్ సెంటర్ - నిఘా పర్యవేక్షణ ద్వారా భక్తుల రద్దీని లెక్కించడం, అలిపిరి వద్ద తనిఖీలను లెక్కించడం, లడ్డూ ప్రసాద వితరణలో పారదర్శకతను పెంచడం దీని లక్ష్యాలు

AI Integrated Command Control Center in Tirumala
AI Integrated Command Control Center in Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 15, 2026 at 11:03 AM IST

2 Min Read
Choose ETV Bharat

AI Integrated Command Control Center in Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆధునిక సాంకేతికత ఆదర్శంగా ఉంది. ఆలయంలో భక్తుల రద్దీని లెక్కించడం, అలిపిరి వద్ద తనిఖీలను గణించడం, అదే విధంగా లడ్డూ ప్రసాద పంపిణీలో పారదర్శకతను మరింత పెంచడం, ఈ విధంగా తిరుమలలో అనేక రకాలైన కీలక అంశాలను ఏఐ ఇంటిగ్రేటెడ్​ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిఘా నీడలోనే సాగుతున్నాయి.​

సీఎం చేతుల మీదుగా ప్రారంభం: గతేడాది సెప్టెంబర్​లో సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభమైనటువంటి ఈ వ్యవస్థ జాతీయస్థాయిలో ఎన్నో ప్రశంసలను అందుకుంటోడటం విశేషం. ఈ అధునాతనమైన సాంకేతికతను అమలు చేసేందుకు దేశంలోని పలు కీలకమైన దేవస్థానాలు ఆసక్తిని చూపిస్తున్నాయి. శ్రీకాళహస్తికి ఇప్పటికే దాదాపు బ్లూప్రింట్​ సిద్ధమైంది. మహాశివరాత్రి పర్వదినం తర్వాత తిరుమలలోని సాంకేతిక బృందం క్షేత్రస్థాయి పరిశీలనలను నిర్వహించి పనులను ప్రారంభించింది.

విజయవాడ దేవస్థానంలో సైతం: ఉత్తరప్రదేశ్​లో వారణాసిలోని విశ్వేశ్వరుని ఆలయ అధికారులతో చర్చలనేవి జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ నూతన సాంకేతికత అక్కడ కూడా అమలు కానుంది. గుజరాత్​లోని సోమనాథ్ ఆలయం, అయోధ్య రామమందిరాల్లోనూ ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడంపై పీఎంవో స్థాయిలో సంప్రదింపులు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అంతేకాకుండా విజయవాడ కనకదుర్గ దేవాలయంలోనూ ఏఐ కమాండ్​ కంట్రోల్​ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి.

లడ్డూ కౌంటర్ల వద్ద అత్యాధునిక కెమెరాలు: వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద పంపిణీ ప్రక్రియను ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న 60 లడ్డూ కౌంటర్ల వద్ద అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్య ఆధారంగా ఎన్ని కౌంటర్లను తెరవాలి? ఎన్ని లడ్డూలను తాజాగా తయారు చేయాలి? అదే విధంగా ఏ కౌంటర్లలో రద్దీ ఏ విధంగా ఉంది? అనే సమాచారం అధికారులకు ముందే తెలుస్తుంది.

సామాన్య భక్తులకు అందుబాటులో: అదే విధంగా దీని వలన లడ్డూలు మిగులు లేదా ఎటువంటి కొరత లేకుండా సరఫరా వ్యవస్థ పటిష్ఠతతో కూడినదిగా మెరుగవుతుంది. క్యూలైన్లలో భక్తులు ఎంతమంది సమయం ఉంటున్నారు? ఎవరైనా సరే అనధికారికంగా లడ్డూలను పొందుతున్నారా? వంటి తదితర విషయాలను సైతం తెలుసుకోవచ్చు. దీనివల్ల దళారుల బెడద అనేది తగ్గి సామాన్య భక్తులకు ఎంతో త్వరగా ప్రసాదం చేరుతుంది

రద్దీని ముందుగానే అంచనా వేయొచ్చు: దీనికితోడు గతంలో అనుకోకుండా భక్తుల రద్దీ పెరిగితే వారు క్యూలైన్లలో వచ్చాక గానీ అధికారులకు ఏ మాత్రం తెలిసేది కాదు. ఇప్పుడు మాత్రం కమాండ్​ కంట్రోల్​ కేంద్రం సాయంతో భక్తులు ఎక్కడెక్కడ ఎంతెంత మంది ఉన్నారనేది లెక్క చెబుతుంది. దీనివలన కొన్ని గంటల ముందుగానే రద్దీని అంచనా వేసి క్యూలైన్ల నిర్వహణను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటోంది.

ఇటీవల రథసప్తమి వేడుకలకు మాడవీధుల్లో ఏర్పాటు చేసిన ఎఫ్​ఆర్​ఎస్​ (ముఖ ఆధారిత గుర్తింపు) కెమెరాల సాయంతో రద్దీని పర్యవేక్షించారు. తిరుమలలో అమలవుతున్న ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఎన్నారైలు ఇచ్చే విరాళాలతో రూ.18 కోట్ల వరకు వెచ్చించారు. సుమారు 342 అధునాతన కెమెరాలతో ఈ వ్యవస్థను అనుసంధానించారు.

తిరుమలలో ఏఐ సేవలు - దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు

భక్తుల సమస్యలకు చెక్ - తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌