ETV Bharat / state

ఏడీ జయరాజు అరెస్టు - ఆయన నివాసాల్లో రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ

భూపాలపల్లి, హైదరాబాద్‌లోని ఏడీ జయరాజు ఇళ్లల్లో ఏసీబీ సోదాలు - ఏడీ జయరాజు నివాసాల్లో సుమారు రూ.100 కోట్ల ఆస్తులు గుర్తింపు - భూపాలపల్లి జిల్లా భూగర్భగనులశాఖ ఏడీ జయరాజు అరెస్టు

ఏడీ జయరాజ్ ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు
ఏడీ జయరాజ్ ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 27, 2026 at 10:36 PM IST

3 Min Read
Choose ETV Bharat

ACB Raids on AD Jayaraj Residence : హైదరాబాద్ బోడుప్పల్​లో కోట్ల రూపాయల విలువ చేసే రెండస్తుల భవనం కీసర సహా 5 చోట్ల ఓపెన్‌ ప్లాట్లు, సోదాల్లో రూ.10 లక్షలు, బ్యాంకు నిల్వ రూ.71 లక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే అక్రమాస్తులు విలువ వంద కోట్లకు పైమాటే. ఇవన్నీ భూపాలపల్లి జిల్లాలోని మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న జయరాజు అక్రమాస్తుల చిట్టా. వరుసగా అవనీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాజుపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఏక కాలంలో 8 చోట్ల సోదాలు నిర్వహించి సుమారు రూ.100 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. సదరు అధికారి ఇటీవల జిల్లాలోనే ఉత్తమ అధికారిగా అవార్డు పొందటం గమనార్హం.

8 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ప్రస్తుతం వరంగల్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ఫుల్ అడిషనల్ చార్జ్ నిర్వహిస్తున్న బొజ్జ జయరాజుపై వరంగల్ రేంజ్ ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఆయన స్థిర చరాస్తులపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్, వరంగల్, సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో సోదాలు చేసింది. అనిశా జాయింట్ డైరెక్టర్ సాయి మనోహార్ ఆధ్వర్యంలో సోదాలు చేసిన అధికారులు హైదరాబాద్ బోడుప్పల్​లోని అయన నివాసం, బంధువులు ఇళ్లు, సూర్యాపేట, తుంగతుర్తి లోని బంధువుల ఇళ్లు, అతని డ్రైవర్ నివాసం సహా మొత్తం 8 ప్రాంతాల్లో ఏక కాలంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.

సోదాల్లో భాగంగా ఏసీబీ అధికారులు జయరాజుకు చెందిన భారీగా అక్రమాస్తులు గుర్తించారు. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో మూడంస్థుల భవనం, హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలో అపార్ట్మెంట్ ఫ్లాట్, హైదరాబాద్ కీసరలో రెండు ఓపెన్‌ ప్లాట్లు, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటలో ఒక్కో ప్లాట్​ను ఏసీబీ గుర్తించింది. సూర్యాపేటలో 3.21 ఎకరాల వ్యవసాయ భూమి, బోడుప్పల్ ఆయన నివాసంలో సోదాల సమయంలో రూ.10 లక్షల నగదు, ఎల్‌ఐసీ, మ్యాక్స్ సేవింగ్స్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పాటు మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.20 లక్షల పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, 629 గ్రాముల బంగారు ఆభరణాలు సోదాల్లో గుర్తించింది. రూ.10 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, మొత్తం మూడు బ్యాంకు ఖాతాల్లోని రూ.71.27 లక్షల నిల్వ గుర్తించారు.

రూ.100 కోట్ల ఆస్తులు గుర్తింపు : అంతే కాకుండా సోదాలు, ప్రాథమిక విచారణ సమయంలో జైరాజు డ్రైవర్ సత్తునూరి యాదయ్య మొబైల్ ఫోన్‌లో కీలక సమాచారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. డ్రైవర్ బ్యాంకు ఖాతా నుంచి నిందిత అధికారి కుమార్తె బ్యాంకు ఖాతాకు పలు లావాదేవీల ద్వారా సుమారు రూ.24.80 లక్షలు బదిలీ అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై విచారించగా ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసి తన ఖాతాకు పంపి వాటిని తిరిగి కుమార్తె ఖాతాకు బదిలీ చేసినట్లు డ్రైవర్ తెలిపాడు. ఏడీ జయరాజు ఇళ్లల్లో జరిగిన ఏసీబీ సోదాల్లో రూ.100 కోట్ల ఆస్తులను గుర్తించారు. కాగా జైరాజు అరెస్ట్ చేసిన ఏసీబీ హైదరాబాద్ తరలించనున్నారు. విచారణ అనంతరం రిమాండ్​కు తరలించే అవకాశం ఉంది.

అవినీతిలో పోటీపడుతున్న అధికారులు! - హోటల్స్‌లో సెటిల్‌మెంట్స్​తోనే భారీగా సంపాదన