ETV Bharat / state

పుస్తకాలు కొనలేని స్థితి నుంచి, 4 ఉద్యోగాలు సాధించేవరకు - యువకుడి స్ఫూర్తిదాయక గాథ

4 ప్రభుత్వ కొలువులు సాధించిన భాస్కర్‌ - 2 కేంద్ర, 2 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కైవసం - పోలీస్‌ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధం - యువకుడి స్పూర్తిదాయక స్టోరీ

Young Man Bhaskar Got 4 Govt Jobs
నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 2, 2026 at 10:33 PM IST

|

Updated : September 2, 2026 at 10:56 PM IST

2 Min Read
Choose ETV Bharat

Young Man Bhaskar Got 4 Govt Jobs : కష్టాలు కన్నీళ్లు ఎదురైనప్పుడు కొందరు తలవంచి ఓడిపోతారు కానీ మరికొందరు తమ తలరాతను తామే మార్చుకోవాలన్న దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తారు. ఆ కోవకే చెందుతాడు ఈ యువకుడు. ఏమాత్రం ఉన్నత ఉద్యోగాల నేపథ్యం లేని మారుమూల గిరిజన పల్లె నుంచి వచ్చి ఏకంగా 4 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపించాడు ఓ యువకుడు. పేదరికాన్ని జయించి, పట్టుదలతో విజయం సాధించిన ఆ స్ఫూర్తిదాయక ప్రయాణంపై కథనం.

పుస్తకాలు కొనలేని స్థితి నుంచి, 4 ఉద్యోగాలు సాధించేవరకు - యువకుడి స్ఫూర్తిదాయక గాథ (ETV Bharat)

కటిక పేదరికం నుంచి : చిన్న వయసులోనే తండ్రి మరణం, తల్లి క్యాన్సర్‌ పేషెంట్‌. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. ఉన్నత ఉద్యోగాలు అంటే కూడా తెలియని మారుమూల గిరిజన ప్రాంతం. ఇవేవీ ఆ యువకుడి సంకల్పానికి అడ్డుకాలేకపోయాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే బలమైన ఆకాంక్షతో రాత్రింబగళ్లు సన్నద్ధమయ్యాడు. ఫలితంగా ఇటీవల 2 కేంద్ర, 2 రాష్ట్ర స్థాయి కొలువులు సాధించి సత్తా చాటాడు.

ఈ యువకుడు భాస్కర్‌. సంగారెడ్డి జిల్లా పౌన్యా నాయక్ తండా స్వస్థలం. కల్హేర్‌ మండలంలోని ఓ మైనార్టీ వెల్పేర్‌ పాఠశాలలో టెన్త్‌, ఇంటర్‌ పూర్తి చేశాడు. ఇంటర్‌ చదువుతున్న క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం కావాలని నిర్ణయించుకున్నాడు. డిగ్రీలో చేరగానే అటు వసతి గృహంలో చదువుకుంటూనే ఇటు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటూ సన్నద్ధమయ్యాడు. అన్ని అనుకూలంగా ఉన్నవారికే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమవుతోన్న తరుణంలో పోటీ పరీక్షలకయ్యే దరఖాస్తు ఫీజు, పుస్తకాలు కొనలేని స్థితి ఎదురైనా ఆగిపోలేదు. 15 రకాల పరీక్షలు రాసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదటి తొమ్మిది పరీక్షల్లో చివరి వరకు వెళ్లి వెనుతిరిగానని, ఆ అనుభవమే తనను తరువాతి 4 ఉద్యోగాలు సాధించేలా గెలిపించిందని చెబుతున్నాడు భాస్కర్.

క్యూకట్టిన 4 ప్రభుత్వ ఉద్యోగాలు : పట్టుదల ఉంటే గమ్యం ఎంత దూరమైనా చేరుకోవచ్చని నిరూపిస్తూ రాష్ట్రస్థాయిలో 2023లో చేసిన తెలంగాణ కానిస్టేబుల్‌ జాబ్‌ సహా దిల్లీ పోలీస్ ఎస్ఐ, యూపీఎస్సీ సీఏపీఎఫ్ ఉద్యోగం సహా మరో కేంద్ర ప్రభుత్వ కొలువు కూడా సొంతం చేసుకున్నాడీ యువకుడు. భాస్కర్‌కు అన్న, ఇద్దరు అక్కలు ఉన్నారు. సోదరీమణులిద్దరికీ వివాహం కాగా అన్న నరసింహులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ ప్రోత్సాహం, ఐఏఎస్‌ పరీక్ష రాయడానికి వెళ్లి రావడంతో పాటు, ఉద్యోగ దరఖాస్తుల కోసం సైతం డబ్బులు ఇచ్చి ప్రోత్సహించాడని చెబుతున్నాడు భాస్కర్‌. తమ్ముడి కష్టానికి ఫలితంగా 4 ఉద్యోగాలు సాధించడం పట్ల అన్న నరసింహులు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా సంకల్ప బలంతో చదువుకొని అనుకున్న లక్ష్యాన్ని భాస్కర్‌ సాధించడం పట్ల గ్రామస్తులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదరికం ఏ విద్యార్థి విజయానికైనా అడ్డంకి కాదని సంకల్పం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించాడీ యువకుడు.

YUVA : దాతల ప్రోత్సాహంతో డిస్టెంక్షన్​లో డిగ్రీ పూర్తి - కటిక పేదరికాన్ని దాటుకొని 4 ప్రభుత్వ ఉద్యోగాలు కైవసం

YUVA : యూట్యూబ్​ వీడియోలతో ప్రిపరేషన్ - తొలి ప్రయత్నంలోనే 4 ఉద్యోగాలు

Last Updated : September 2, 2026 at 10:56 PM IST