ఉద్యోగం రాదేమోనని భయం - అమెరికాలో ప్రాణాలు తీసుకున్న కర్నూలు యువకుడు
ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న కర్నూలు యువకుడు - ఒత్తిడి తట్టుకోలేక ఏప్రిల్ 28న అపార్ట్‌మెంట్ గదిలో పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2026 at 4:50 PM IST
Young Man from Kurnool Commits Suicide in US: ఉన్నత చదువులు చదివి, తండ్రి కష్టాన్ని తీర్చి కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకున్న ఓ యువకుడి ఆశలు అడియాశలయ్యాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం దొరకలేదన్న ఆవేదనతో కర్నూలుకు చెందిన ఇరగనబోయిన చందు (26) తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన షికాగోలో చోటు చేసుకుంది.
మృతుడి తండ్రి కర్నూలులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ కుమారుడిని ప్రయోజకుడిని చేసేందుకు ఎంతగానో శ్రమించారు. తండ్రి పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన చందు, ఎదైనా సాధించాలన్న పట్టుదలతో చదువులో రాణించారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి షికాగోలోని డీపాల్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్ (MS) పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని కలలు కన్నారు.
వేధించిన నిరుద్యోగ భయం: అయితే, ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ఐటీ రంగంలో వస్తున్న మార్పుల వల్ల చందుకు ఉద్యోగం లభించలేదు. చదువు పూర్తయినా ఇంకా తండ్రి పంపే డబ్బుపైనే ఆధారపడాల్సి వస్తుండటం అతడిని తీవ్రంగా కలిచి వేసింది. తోటి స్నేహితులు ఉద్యోగాల్లో స్థిరపడుతుంటే, తాను మాత్రం ఖాళీగా ఉండటంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 28న తన అపార్ట్‌మెంట్ గదిలో పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.
ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకున్న తల్లిదండ్రులకు, చందు మరణవార్త పిడుగులా తగిలింది. చేతికి అందిన కొడుకు ఇక లేడన్న వార్తతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. తానా (TANA) టీం స్క్వేర్ కో-ఛైర్ చిరంజీవి గల్లా ఈ ఘటనపై స్పందిస్తూ మృతదేహాన్ని కర్నూలుకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆత్మహత్య పరిష్కారం కాదు: మీకు ఆత్మహత్య ఆలోచనలు కలిగి ఉంటే, లేదా స్నేహితుడి గురించి ఆందోళన చెందుతుంటే లేదా భావోద్వేగ మద్దతు అవసరమైతే, వినడానికి ఎవరైనా ఎల్లప్పుడూ ఉంటారు. స్నేహ ఫౌండేషన్ - 04424640050 (24x7 అందుబాటులో ఉంది) లేదా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెల్ప్‌లైన్ - 9152987821 ఐకాల్‌కు కాల్ చేయండి, ఇది సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. బాధలో ఉన్నవారికి మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే కొన్ని హెల్ప్‌లైన్‌లు ఇక్కడ ఉన్నాయి
Sneha Foundation Helpline Number- 04424640050 (available 24x7)
JeevanAastha Helpline - 18002333330
Tele Manus Helpline Number- 1800-89-14416
iCall, TISS (Tata Institute of Social Sciences)- 9152987821
Email- icall@tiss.edu
Facebook- iCALL Psychosocial Helpline
X- @iCALLhelpline
NIMH Helpline: 988
ఇంట్లో తల్లి, భార్య హత్య - రైల్వే ట్రాక్‌పై తానూ ఆత్మహత్య- కాపాడబోయిన పిల్లలు దుర్మరణం
"గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వొద్దు" - మనస్తాపంతో యువతి ఆత్మహత్య

