ETV Bharat / state

రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించిన మయన్మార్‌ బృందం - తమ దేశంలో ఆచరిస్తామన్న టియాన్ లిన్‌

స్టడీటూర్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించిన మయన్మార్‌ బృందం - ఆర్​ఎఫ్​సీని సందర్శించిన మయన్మార్‌ సమాచార శాఖ మంత్రి టియాన్ లిన్‌ - స్టడీ టూర్‌లో నేర్చుకున్న విషయాలను తమ దేశంలో ఆచరిస్తామని వెల్లడి

Myanmar Minister of Information Tiun Lin Visits Ramoji Film City
Myanmar Minister of Information Tiun Lin Visits Ramoji Film City (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 17, 2026 at 9:19 AM IST

2 Min Read
Choose ETV Bharat

Myanmar Delegation Visits Ramoji Film City : ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీని రిపబ్లిక్​ ఆఫ్​ ది యూనియన్​ ఆఫ్​ మయన్మార్‌ సమాచార శాఖ కేంద్రమంత్రి యు హతిన్‌ లిన్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదివారం సందర్శించింది. ఫిల్మ్‌ రీ స్టోరియేషన్, డిజిలైజేషన్‌ స్టడీ కోసం మయన్మార్‌ ప్రతినిధుల బృందం భారత్‌ పర్యటన సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించారు. వారికి రామోజీ ఫిల్మ్‌సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఏవీరావు సాదర స్వాగతం పలికారు.

రామోజీ ఫిల్మ్‌ సిటీ ప్రయోజనకరంగా ఉంది : అనంతరం మయన్మార్‌ ప్రతినిధుల బృందానికి రామోజీ ఫిల్మ్‌ స్టూడియో గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, సైబర్ భద్రత, డేటా సెంటర్ నిర్వహణ వంటి అంశాల గురించి సవివరంగా చర్చించారు. అనంతరం రామోజీ ఫిల్మ్​సిటీని సందర్శించి ఆ అందాల్ని చూసి మైమరచిపోయారు. అనంతరం ఈటీవీ స్టూడియోను సందర్శించారు.

పీసీఆర్, ఫీడ్ రూమ్ సహా సర్వర్‌ రూమ్‌లను గమనించారు. ఈటీవీ బాల భారత్‌ను సందర్శించి చిన్న పిల్లలకు సంబంధించి ప్రసారం చేస్తున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టడీ టూర్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శించడం చాలా సంతోషంగా ఉందని మయన్మార్‌ సమాచార శాఖ మంత్రి టియాన్ లిన్‌ అన్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ సందర్శన ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. మయన్మార్‌ మీడియా, చలనచిత్ర రంగ అభివృద్ధికి ఉపయోగపడే అనేక విషయాలను తెలుసుకున్నామని తెలిపారు. ఈ పరస్పర చర్చ ఇరుదేశాల మధ్య మీడియా, చలనచిత్ర రంగాల్లో భవిష్యత్‌ సహకారానికి బలమైన పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించిన మయన్మార్‌ బృందం - తమ దేశంలో ఆచరిస్తామన్న టియాన్ లిన్‌ (ETV Bharat)

"ఈ స్టడీ టూర్‌లో భాగంగా ఇండియాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీడియా, సినిమా రంగంలో భారత్‌ ఎలాంటి అడుగులు వేస్తుందో తెలుసుకోవడం నిజంగా గొప్ప అవకాశం. రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. భారత సినీ రంగానికి రామోజీ ఫిల్మ్‌ సిటీ ఓ గొప్ప వేదికగా మారింది. నేను ఇక్కడ కేవలం అభివృద్ధి మాత్రమే కాదు ఐటీ అభివృద్ధి కూడా గమనించాను. ఇక్కడ ఉద్యోగుల పనితీరు బాగుంది. ఇక్కడ సంస్కృతి, సంప్రదాయలు బాగున్నాయి. సాంకేతిక అంశాలను రికార్డు చేసే విధానం చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఐటీ రంగం ఆర్ట్స్‌తో కలిసి ఉండటం వల్ల ఔట్‌పుట్ చాలా కళాత్మకంగా ఉంది. మీ కష్టపడేతత్వం బాగుంది. మీకు ధన్యవాదాలు. మీకు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను" - టియాన్ లిన్‌, మినిస్టర్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్, మయన్మార్

ఫిల్మ్‌ సిటీలోని సదుపాయాలు, చిత్ర నిర్మాణ విధానాలను పరిశీలించిన మయన్మార్‌ ప్రతినిధులు ఆకర్షితులయ్యారు. అక్కడి వినూత్న ఆలోచనా విధానాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఓటీటీ వేదికల అభివృద్ధి, సైబర్‌ భద్రత, డేటా సెంటర్‌ నిర్వహణ, సినిమా-టెలివిజన్‌ రంగాల్లో వేగంగా మారుతున్న సృజనాత్మక కంటెంట్‌, మీడియా ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయి. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా బలమైన మీడియా వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడంతో పాటు మయన్మార్‌లో సృజనాత్మక పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించే అంశాలపైనా చర్చలు జరిగాయి.

రామోజీ ఫిల్మ్ సిటీపై అమితాబ్ ప్రశంసల వర్షం- ప్రపంచ స్థాయి సినిమా నిర్మాణ కేంద్రమని కితాబు

రామోజీ ఫిల్మ్‌సిటీ అత్యద్భుతం : పునీత్ అగర్వాల్