ETV Bharat / state

మొక్కలకు 45 రోజుల "క్వారంటైన్" - అసలు ఎందుకో తెలుసా?

కడియంలో వందల సంఖ్యలో నర్సరీలు - 10కి పైగా అంతర్జాతీయ లైసెన్స్‌ - విదేశాల నుంచి సుమారు 50 రకాల మొక్కల వెరైటీలు దిగుమతి

Quarantine for Foreign Plants
విదేశీ మొక్కలకు 45 రోజుల క్వారంటైన్ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 1, 2026 at 10:48 AM IST

2 Min Read
Choose ETV Bharat

Quarantine for Foreign Plants : దేశాన్ని కొవిడ్‌ మహమ్మారి పీడించినప్పుడు ఎక్కువగా వినిపించిన పదం ‘క్వారంటైన్‌. సాధారణంగా పెట్‌లు, ఇతర జంతువులను విదేశాలకు పంపించే క్రమంలో ఈ విధానాన్ని పాటిస్తారు. కానీ, వీటికే కాదండోయ్‌.. విదేశాల నుంచి తీసుకొచ్చే మొక్కలకూ 45 రోజుల క్వారంటైన్‌ ఉంటుంది! అసలు మొక్కలకు ఈ ఐసోలేషన్ ఎందుకు విధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం?

తూర్పుగోదావరి జిల్లా కడియంలో వందలాది నర్సరీలు ఉన్నాయి, వాటిలో సుమారు పదింటికి అంతర్జాతీయ లైసెన్సులు ఉన్నాయి. చైనా, స్పెయిన్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం వంటి దేశాల నుంచి సుమారు 50 వైరైటీలు దిగుమతి అవుతాయి. విదేశాల నుంచి అరుదైన మొక్కల రకాలు, వందల ఏళ్లున్న చెట్లను విదేశాల నుంచి తీసుకువచ్చి, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటిని మార్చుతారు. చైనా నుంచి సైకాస్, స్పెయిన్ నుంచి ఆలివ్, ఆర్నమెంటల్, పామ్ వెరైటీలు, స్విట్జర్లాండ్ నుంచి పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్​లో పువ్వుల రకాలు తెస్తారు. వీటిని దేశీయ మొక్కలతో పాటు మల్టిపుల్ చేస్తారు. ఆ తర్వాత స్థానికంగా ఉత్పత్తి చేస్తారు. వాటిని పెంచిన తర్వాత, విభిన్న ఆకర్షణీయ ఆకృతులతో సిద్ధం చేస్తారు.

మొక్కలు దిగుమతి ప్రక్రియ ఇలా: విదేశాల నుంచి మొక్కలు దిగుమతి చేసుకోవడం అంటే అంత సులభమైన ప్రక్రియ అయితే కాదు. ఏ దేశం నుంచి మొక్కలు దిగుమతి చేయాలనుకుంటున్నారో వాటి జాబితాను ముందుగానే కస్టమ్స్ అధికారులకు సమర్పించాలి. వారు ఆమోదించిన వాటిని మాత్రమే తీసుకురావచ్చు. ఒక కంటైనర్‌ను బుక్ చేసుకోవడానికి కనీసం రూ.25 లక్షల వరకు కాషన్ సెక్యూరిటీ డిపాజిట్ అవసరం.

ఇండోర్, అవుట్‌డోర్, ఫ్లవరింగ్ మొక్కలతో పాటు, ఏళ్ల వయసున్న వృక్షాలను కూడా ఏసీ కంటైనర్లలో సముద్ర మార్గాల ద్వారా చెన్నై, ముంబయి పోర్టుకు తీసుకువస్తారు. అక్కడి నుంచి వాటిని రోడ్డు మార్గంలో నర్సరీలకు తరలిస్తారు. అక్కడికి చేరుకున్న తర్వాత, మొక్కలను వెంటనే అమ్మకుండా, క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తారు.

క్వారంటైన్ సెంటర్​లో 45 రోజులు: నిర్ణీత ప్రమాణాల ప్రకారం రూపొందించిన 'ప్లాంట్ క్వారంటైన్ సెంటర్'లో వాటిని కనీసం 45 రోజుల పాటు ఉంచాలి. అదే విధంగా ఇండోర్, అవుట్‌డోర్ ప్లాంట్లకు వేర్వేరుగా క్వారంటైన్ ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, కస్టమ్స్ అధికారులు సమగ్రంగా పరిశీలించి, చీడపీడలు లేవని నిర్ధారిస్తారు. అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. చెట్లు ఉన్న లొకేషన్​ను, ఫొటోలతో సహా మ్యాపింగ్ చేస్తారు. క్వారంటైన్ ముగిసిన తర్వాత మాత్రమే వాటిని విక్రయానికి అనుమతి ఇస్తారు.

ఇష్టంగా పెంచుకుంటున్న 'మొక్కలు' వాడిపోయాయా? - ఈ చిన్న చిట్కాలతో మళ్లీ 'జీవం'!

బొమ్మల్లో బాపు, నర్సరీల్లో కడియం - అంబానీ 'వంతార' నుంచి అయోధ్య దాకా మన మొక్కలే