ETV Bharat / state

ట్విన్స్​ డే స్పెషల్​ - మాంటిస్సోరి స్కూల్​లో 32 మంది కవలలు

32 జంటలకు కవల దినోత్సవ వేడుకలు నిర్వహించిన యాజమాన్యం - కవల విద్యార్థులకు మొక్కలు, చాక్లెట్లు, పెన్సిళ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు - కవల పిల్లల ప్రాధాన్యత వివరించేందుకు వేడుకలు నిర్వహించినట్లు వెల్లడి

Montessori School Twins Day Celebrations at Tanuku
Montessori School Twins Day Celebrations at Tanuku (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 21, 2026 at 8:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

Montessori School Twins Day Celebrations at Tanuku : ఒకే పోలికలతో కనిపించే కవలలను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎవరెవరూ అనేది గుర్తు పట్టడం కష్టమే. ఒకేరోజు నిమిషాల తేడాలో పుట్టి, పెరుగుతున్న వారిని గుర్తించడం వారి తల్లిదండ్రులకూ ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటిది ఒకే పాఠశాలలో వివిధ తరగతుల్లో చదువుతున్న కవల విద్యార్థులను గుర్తించడం బోధించే ఉపాధ్యాయులకు సైతం సమస్యగానే ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాంటిస్సోరి పాఠశాలలో ముందస్తు కవలల పిల్లల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

సాధారణంగా కవల పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. అందులోనూ ఒక స్కూల్లో కవలల సంఖ్య మహా అయితే ఒకట్రెండు జంటలు ఉండటం సహజం. కానీ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని మాంటిస్సోరి పాఠశాలలో 32 జంటల కవలలకు ముందస్తు కవల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏదైనా పాఠశాలలో రెండు, మూడు జంటల కవల పిల్లలను చూస్తుంటాం. కాని మాంటిస్సోరి పాఠశాలలో 30 మంది కవల జంటలు, రెండు ట్రిప్లెక్స్ జంటలు ఉండడం విశేషం. ఇంతమంది కవల పిల్లలకు మాంటిస్సోరి పాఠశాల వేదికైంది.

కవలల దినోత్సవ వేడుకలు - మాంటిస్సోరి స్కూల్​లో 32 జంటల ట్విన్స్ (ETV Bharat)

ముందస్తు కవల దినోత్సవ వేడుకలు : ఆదివారం కవలల దినోత్సవం కావడంతో పాఠశాల యాజమాన్యం ముందస్తు వేడుకలు నిర్వహించింది. పాఠశాల అధినేత గణపతి ప్రకాశరావు, డైరెక్టర్ జ్ఞాన మంజరి కవల విద్యార్థులకు పూల మొక్కలు, చాక్లెట్లు, పెన్సిల్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కవల దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని, కవల పిల్లల ప్రాధాన్యతను వివరించేందుకు ఈ వేడుకలు నిర్వహించినట్లు మాంటిస్సోరి పాఠశాల డైరెక్టర్‌ తెలిపారు.

''అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా మా స్కూల్​లో చదువుతున్న కవలలు అందరినీ ఒకచోటకు చేర్చి వాళ్లను అభినందించాం. మా పాఠశాలలో 30 మంది కవల జంటలు, 2 ట్రిప్లెక్స్​ జంటలు ఉన్నారు. సాధారణంగా కవల పిల్లలు ఉండడం అరదు. కాని మా స్కూల్​లో 32 మంది జంటలకు కవల దినోత్సవ వేడుకలు నిర్వహించాం. ఎంతో సంతోషంగా ఉంది.'' - జ్ఞాన మంజరి, మాంటిస్సోరి పాఠశాల డైరెక్టర్

కవల పిల్లలందరినీ ఒకచోట చేర్చి సంబరాలు: ప్రపంచ కవల పిల్లల దినోత్సవం సందర్భంగా తణుకు మాంటిస్సోరి స్కూల్​లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ పాఠశాలలో ఉన్న కవల పిల్లలందరినీ ఒకచోట చేర్చి సంబరాలు జరిపారు. 32 కవల జంటలు ఉండడం విశేషం. కవల జంటలకు పూల మొక్కలు, చాక్లెట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.

పాఠశాల డైరెక్టర్ జ్ఞానమంజరి మాట్లాడుతూ ఇంతమంది కవల పిల్లలు మా పాఠశాలలో ఉండడం, వారందరికీ వేడుకలు జరపడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. కవల పిల్లలు అందరికీ శుభాకాంక్షలు తెలియ జేశారు. కవల పిల్లలు అందరికీ భగవంతుడు మంచి చదువు, ఆరోగ్యం ప్రసాదించాలని జ్ఞాన మంజరి ఆకాంక్షించారు.

అమ్మగీసిన అపు'రూపం' - పాఠశాలల్లో కనువిందు చేసిన కవల పిల్లలు

JEE మెయిన్స్​లో ట్విన్ బ్రదర్స్ అదుర్స్- మార్కులు, పర్సంటైల్ 'సేమ్ టు సేమ్'