స్వయం సహాయక సంఘాల మహిళలకు హెల్త్ చెకప్‌లు - ఎప్పుడంటే?
గ్రామీణ మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ - మార్చి 2 నుంచి జూన్ 9 వరకు ‘హెల్త్ మిషన్-100’ అమలు - నాలుగు దశలుగా ఈ కార్యక్రమాలు

Published : February 27, 2026 at 3:38 PM IST
30 Types of Diagnostic Tests for Women : ఈ మధ్యకాలంలో మానవ జీవనశైలిలో మార్పులు రావడంతో సహజమైంది. మరి ముఖ్యంగా మహిళలకు, చిన్నారులకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులు, రోగనిరోధక శక్తిలో మార్పుల వల్ల థైరాయిడ్, గుండె సమస్యలు, డయోబెటిక్, లివర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో 30 రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరిగా మారింది. ఇలా పరీక్షలు చేయడం వల్ల ఆ వ్యాధి తీవ్రతను పర్యవేక్షించడానికి, చికిత్స ప్రణాళికను రూపొందించడానికి, దాన్ని నివారించేందుకు సహయపడతాయి.
100 రోజుల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం : దీన్ని ఉద్దేశించి టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా 42 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. గ్రామీణ మహిళలకు డిజీటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన సహా పలు కార్యక్రమాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రణాళిక తయారు చేసింది. తెలంగాణ విజన్-2047లో భాగంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ మార్చి 2 నుంచి జూన్ 9 వరకు హెల్త్ మిషన్-100 పేరిట దీనిని నిర్వహించనుంది. ఇందులో మొత్తం నాలుగు దశలుగా కార్యక్రమాలు చేపడతారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత తనిఖీలు నిర్వహించి మౌలిక సదుపాయాలు, ఇన్ఫెక్షన్ నియంత్రణ, పరిశుభ్రత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో లోపాలను గుర్తించి సరిదిద్దుతారు. రోగులకు కావాల్సిన సౌకర్యాలపై దృష్టి సారిస్తారు.
పోషకాహారంపై దృష్టి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడిసిన్, గైనకాలజీ, కంటి, పిల్లల, ఎముకలు, దంత వైద్య నిపుణులతో ప్రత్యేక సేవలు చేస్తారు. మొత్తం 33 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వృద్ధాప్య చికిత్స శిబిరాలు, స్క్రీనింగ్ పరీక్షలు చేపడతారు. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, ఐరన్ మాత్రల పంపిణీ, రక్తహీనత పరీక్షలు చేస్తారు. పాఠశాలలు, అంగన్వాడీల్లో ఆర్బీఎస్కే ద్వారా విద్యార్థులకు కంటి చూపు పరీక్షలు, పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాల తనిఖీలు చేపడుతారు. అంతేకాకుండా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 16న జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి.
ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఈ క్యాంపులు : క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించడం, క్యాన్సర్ కేర్ పాలసీ విడుదల, క్యాన్సర్ రిజిస్ట్రీ ఏర్పాటు, బాధితులకు సేవలు, ఆరోగ్య మహిళ కింద క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు, జిల్లా డే-కేర్ క్యాన్సర్ కేంద్రాల్లో కీమోథెరపీ సేవల మ్యాపింగ్ చేయనున్నారు.
మే 12న ప్రత్యేక కార్యక్రమాలు : టీబీ కేసుల గుర్తింపు, చికిత్స, పోషకాహారం అందించడం, వడదెబ్బ, అతిసారం, డెంగ్యూ వంటి వ్యాధులపై నిఘా పెట్టారు. కింగ్ కోఠి, వనస్థిలిపురం, కరీంనగర్, నిజామాబాద్, ఆసిఫాబాద్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వడదెబ్బ చికిత్స గదులు ఏర్పాటు చేశారు. మే 1 కార్మిక దినోత్సవం, మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.
ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ యానిట్లు ఏర్పాటు : నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పాలీ క్లినిక్స్గా అప్‌గ్రేడ్ చేయడం ఐటీడీఏ ప్రాంతాల్లో సికిల్‌సెల్, థలసీమియా స్క్రీనింగ్‌కు మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు చేశారు. హీమోఫీలియోపై దృష్టి పాఠశాలల, వసతి గృహాల్లో ఆహార తనిఖీలు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రచార విజయాల ప్రదర్శన, 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహిస్తారు.
విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు - భ్రూణహత్యలకు అడ్డుకట్ట వేసేదెలా?
'స్టార్' ఉండగా రక్తహీనత బెంగే ఉండదు - ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు చేస్తారు

