ETV Bharat / sports

WPL 2026 : మ్యాచ్​ టైమింగ్స్? లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్- ఫ్రీ గా చూడొచ్చా?

మహిళల ప్రీమియర్ లీగ్​ నాలుగో ఎడిషన్​కు అంతా రెడీ- వికెండ్​లో డబుల్ హెడర్స్- లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

WPL 2026
WPL 2026 (Source : WPL 'x' Post)
author img

By ETV Bharat Sports Team

Published : January 8, 2026 at 7:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

WPL 2026 Live Streaming : 2026 మహిళల ప్రీమియర్ లీగ్​కు అంతా సిద్ధమైంది. ఈ టోర్నమెంట్​కు జనవరి 09న తెర లేవనుంది. ఫిబ్రవరి 05న వడోదర వేదికగా జరిగే ఫైనల్​తో ఈ డబ్ల్యూపీఎల్ ముగుస్తుంది. 28 రోజులపాటు ఫ్రాంచైజీ క్రికెట్ మజా అందించేందుకు మహిళా క్రికెటర్లు రెడీ అయిపోయారు. 5 జట్లు మొత్తం 22 మ్యాచ్​లు ఆడుతున్నాయి. ఇటీవల జరిగిన వేలంలో అన్ని జట్లు కూడా పలువురు కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి.

తొలి మ్యాచ్
డబ్ల్యూపీఎల్​లో అత్యంత సక్సెస్​ఫుల్ జట్లు ముంబయి ఇండియన్స్ - రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్యే తొలి మ్యాచ్ జరగనుంది. ముంబయి ఈ ఎడిషన్​లో డిఫెండింగ్ ఛాంపియన్స్​గా బరిలో దిగుతోంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారథ్యంలోని ముంబయి నాట్​సీవర్, అమెలియా కేర్, హీలీ మ్యాథ్యూలతో బలంగా ఉంది. అటు ఆర్సీబీ సైతం పటిష్ఠంగా ఉంది. స్మతి మంధాన, రిచా ఘోష్, నదైన్ డి క్లర్క్, జార్జియా వాల్​ కీలక ప్లేయర్లుగా ఉన్నారు.

మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ఈసారి డబ్ల్యూపీఎల్ మ్యాచ్​లు నవీ ముంబయి, వడోదర రెండు స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. తొలి దశలో 9 నుంచి 17 దాకా నవీ ముంబయిలో మ్యాచ్​లు ఉండనున్నాయి. తర్వాత జనవరి 19 నుంచి ఫిబ్రవరి 05 దాకా వడోదర మైదానం వేదికగా టోర్నీ సాగుతుంది. ​ మ్యాచ్​లు రోజూ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. వీకెండ్ (ఆదివారం) డబుల్ హెడర్ మ్యాచ్​లు ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్​లు 3.30 గంటలకు ప్రారంభం అవుతాయి. అర్ధగంట ముందు టాస్ ఉంటుంది.

ఇక ఈ టోర్నీకి ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌, ఓటీటీ ప్లాట్​ఫామ్ జియోస్టార్​ అధికారిక బ్రాడ్​కాస్టర్లుగా వ్యవహరిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్​కు సంబంధించిన టెలివిజన్ ఛానెల్​లో లైవ్ మ్యాచ్ ప్రసారం అవుతుంది. అలాగే జియోస్టార్​లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే జియోస్టార్​లో ఉచితంగా మ్యాచ్ చూడడం కుదరదు. దీనికి సబ్​స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, జియో తమ యూజర్లకు ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్స్​పై జియోస్టార్ ఫ్రీ సబ్​స్క్రిప్షన్ ఇస్తుంది.

2023లో డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్ జరిగింది. అది సక్సెస్​ అవ్వడంతో ఆ తర్వాత ప్రతి ఎడిషన్​కు ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. దీంతో స్టేడియాల్లోనూ భారీ సంఖ్యలో ఆడియెన్స్​ కనిపిస్తున్నారు. అటు ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రసారాల్లోనూ లైవ్ చూస్తున్న వాళ్ల సంఖ్య కోట్లలో ఉంటుంది.

ఓపెనింగ్ సెర్మనీ
శుక్రవారం తొలి మ్యాచ్ ప్రారంభానకి ముందు ఓపెనింగ్ సెర్మనీ ఉండనుంది. సాయంత్రం 6.45 గంటలకు ప్రీ మ్యాచ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని డబ్ల్యూపీఎల్ నిర్వహాకులు తెలిపారు. ఈ ఈవెంట్​లో ఇండియన్ మోడల్, నటి హర్నాజ్ కౌర్ సంధు పాల్గొననున్నారు.

ఈసారైనా కొత్త ఛాంపియన్
డబ్ల్యూపీఎల్​ టోర్నీలో ముంబయి ఇండియన్స్​ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. గడిచిన మూడు సీజన్లలో రెండుసార్లు ముంబయి ఛాంపియన్​గా నిలిచింది. 2023, 2025 ఎడిషన్లలో హర్మన్​ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ముంబయి టైటిల్ దక్కించుకుంది. ఇక 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. అయితే ఈ మూడు సీజన్లలోనూ దిల్లీ క్యాపిటల్స్ ఫైనల్​కు వచ్చింది. కానీ మూడుసార్లు కూడా తుదిమెట్టుపై బోల్తా పడింది. ఈ క్రమంలో ఈసారి ఎవరు టైటిల్ సాధిస్తారో అని ఆసక్తిగా మారింది. మళ్లీ ముంబయి, అర్సీబీల్లో ఒకరు గెలుస్తారా? లేదా కొత్త ఛాంపియన్​ను చూస్తామా? అని అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.

WPL షెడ్యూల్ రిలీజ్- 22 మ్యాచ్​లు- రెండే వేదికలు

'అనుష్క శర్మ' కోసం RCB బిడ్డింగ్- WPL వేలంలో ఈ సీన్ గమనించారా?