IPL ట్రేడింగ్ రూల్స్ ఏంటి?- ఇప్పటిదాకా ఖరీదైన ట్రేడ్ ఎవరిదో తెలుసా?
IPL హిస్టరీలో తొలి ట్రేడింగ్ ఎప్పుడు జరిగింది? ఆ ఆటగాడు, ట్రేడింగ్ ధర తెలుసా?

Published : November 14, 2025 at 12:04 PM IST
IPL Trading Rules : 2026 ఐపీఎల్ ట్రేడింగ్ సందడి ప్రారంభమైంది. ఈ సారి కూడా విదేశాల్లో వేలం ఉంటుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అబుదాబిలో డిసెంబర్ 15 లేదా 16న వేలం ప్రక్రియ ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే ముంబయి ఇండియన్స్ ట్రేడింగ్ ద్వారా ఇద్దరు ప్లేయర్లను జట్టులోకి తీాసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆటగాళ్ల ట్రేడ్ రూల్స్ ఎలా ఉన్నాయి? ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం.
ఒక సీజన్ ముగిసిన నెలరోజుల తర్వాత ఐపీఎల్ ట్రేడ్ విండో (ఆటగాళ్లను మార్చుకునేందుకు వీలు) మొదలవుతుంది. ఇది తదుపరి వేలం వారం ముందు వరకు కొనసాగుతుంది. ట్రేడ్ విండో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి (ప్లేయర్ ఫర్ క్యాష్) ఆటగాడిని ఇచ్చి డబ్బు పొందడం. మరోటి ప్లేయర్ టూ ప్లేయర్ (ఒక ఆటగాడిని మరొక ప్లేయర్‌ని తీసుకోవడం).
ఫ్రాంచైజీలు ఫలానా ఆటగాడిని తాము కావాలనుకుంటున్నట్లు బీసీసీఐ దృష్టికి తీాసుకెళ్లాలి. ఇందుకు ఆటగాడిని ఇచ్చే జట్టు రెస్పాంజ్ అవ్వడానికి 48 గంటల సమయం ఉంటుంది. ఇక ఆ ఆటగాడు కొత్త జట్టులో చేరేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి. ఆ తర్వాతే ప్లేయర్ ట్రేడ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆటగాడి కోసం కొత్త ఫ్రాంఛైజీ ప్రస్తుతం ఉన్న ధర కంటే ఎక్కువ చెల్లిస్తే, ఆ మొత్తాన్ని సదరు ప్లేయర్, అమ్మే టీమ్ పంచుకుంటాయి.
ఇలా ఎంతమంది ఆటగాళ్లనైనా ఫ్రాంఛైజీలు ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ ట్రేడింగ్ విషయంలో ఎలాంటి లిమిట్ లేదు. అయితే ఫ్రాంఛైజీలు ట్రేడ్ చేసే ప్లేయర్లు కచ్చితంగా ఫిట్‌గా ఉండటంతో పాటు మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. ఆటగాళ్ల ట్రేడ్‌లో ఏవైనా అవకతవకలు జరిగినట్లు బీసీసీఐ గుర్తిస్తే ఆ ట్రేడ్‌ని రద్దు చేసే అధికారం బోర్డుకు ఉంటుంది.
🚨 NEWS 🚨
— IndianPremierLeague (@IPL) November 13, 2025
Sherfane Rutherford has been traded from @gujarat_titans to @mipaltan.
Details 👉 https://t.co/zi36xK6OHg#TATAIPL | @SRutherford50_ pic.twitter.com/4vlSV88jUv
ఐపీఎల్ మొదటి ట్రేడ్
ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో తొలిసారి జరిగిన ప్లేయర్ ట్రేడింగ్ గురించి మీకు తెలుసా? 2008లో ఐపీఎల్ ప్రారంభం అవ్వగా, ఆ తర్వాత ఏడాదే తొలి ట్రేడింగ్ జరిగింది. 2009లో ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ (దిల్లీ డేర్ డెవిల్స్) మధ్య ఈ ట్రేడింగ్ జరిగింది. ముంబయి తమ బ్యాటర్ శిఖర్ ధావన్‌ను దిల్లీకు ఇచ్చేసి, దిల్లీ బౌలర్ ఆశిశ్ నెహ్రాను తీసుకుంది. ఆ సమయంలో ఆటగాళ్ల ట్రేడ్ విలువ వారి గత సీజన్ శాలరీ మాదిరిగానే ఉంది. ధావన్‌ను దిల్లీ రూ. 12 లక్షలకు కొనుగోలు చేయగా, నెహ్రాను ముంబయి రూ.16 లక్షలకు దక్కించుకుంది.
ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ట్రేడ్ ఇదే!
2023 వేలంలో ముంబయి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ. 17.5 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ ఐపీఎల్ 2024కు ముందు, ముంబయి కామెరూన్ గ్రీన్‌ను ఆర్సీబీకి అదే మొత్తానికి ట్రేడింగ్ చేశారు. దీంతో ట్రేడింగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2024కు ముందు గుజరాత్ నుంచి పాండ్యను ముంబయి రూ.15 కోట్లకు ట్రేడింగ్‌లో తీసుకుంది.
భారత్ x సౌతాఫ్రికా తొలి టెస్టు- లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
ట్రేడింగ్‌లో ముంబయికి స్టార్ ప్లేయర్లు- మరి అర్జున్ తెందుల్కర్‌ను వదిలేసినట్లేనా?

