విజిల్స్ ఉండవు, తుపాకీ పేలదు! ఈ 'సైలెంట్ ఒలింపిక్స్' గురించి మీకు తెలుసా?
టోక్యోలో 25వ సమ్మర్ డెఫ్లింపిక్స్ -100వ డెఫ్లింపిక్స్ వార్షికోత్సవం - సౌండ్ లేకుండా డెఫ్లింపిక్స్ పోటీలు

Published : November 17, 2025 at 9:57 AM IST
Deaflympics Silent Games: ఒలింపిక్స్ అనగానే మనకు వివిధ రకాల పోటీలు గుర్తొస్తాయి. ఆ తర్వాత, దివ్యాంగుల కోసం పారాలింపిక్స్ కూడా జరుగుతాయని మనందరికీ తెలుసు. కానీ, వీటికి సమాంతరంగా, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) గుర్తింపు పొందిన మరో మెగా స్పోర్ట్స్ ఈవెంట్ గత 100 ఏళ్లుగా జరుగుతోందని ఎంతమందికి తెలుసు? అదే 'డెఫ్లింపిక్స్'. పారాలింపిక్స్ గురించి తెలిసినంతగా వీటి గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రీడల్లో శబ్దానికి అస్సలు చోటు ఉండదు. విజిల్స్ ఊదరు, రేస్ స్టార్ట్ చేయడానికి తుపాకీ పేల్చరు. అయినా, పోటీలు హోరాహోరీగా జరుగుతాయి. ఇంతకీ ఏంటీ 'సైలెంట్ ఒలింపిక్స్'?
పారాలింపిక్స్‌కు, డెఫ్లింపిక్స్‌కు తేడా ఏంటి?
చాలా మంది పారాలింపిక్స్, డెఫ్లింపిక్స్ రెండూ ఒకటే అనుకుంటారు, కానీ కాదు. పారాలింపిక్స్ వివిధ రకాల శారీరక వైకల్యం ఉన్న అథ్లెట్ల కోసం. కానీ డెఫ్లింపిక్స్ కేవలం వినపడని, తక్కువ వినపడే వారికి మాత్రమే. ఇది వైకల్యం కంటే, మరొక సాంస్కృతిక సమూహంగా చూస్తారు. ఇందులో పాల్గొనాలంటే, 'మంచి చెవి'లో కనీసం 55 డెసిబెల్స్ (dB) వినికిడి లోపం ఉండాలి. అన్నింటికంటే ముఖ్యమైన రూల్ ఏంటంటే, పోటీల సమయంలో ఎలాంటి వినికిడి యంత్రాలు లేదా కాక్లియర్ ఇంప్లాంట్లు వాడటానికి వీల్లేదు. అందరూ ఒకే స్థాయిలో, కేవలం కంటి చూపుతోనే పోటీ పడాలి.
🎉The 25th Summer #Deaflympics Tokyo 2025 marks Japan’s 1st time hosting & 100 years since Paris 1924! Let’s celebrate inclusion!✨
— Tokyo Gov (@Tokyo_gov) November 14, 2025
🗓️The Games will be held from November 15 to 26 across Tokyo—with events also taking place in Fukushima (Football) and Shizuoka (Cycling Road)!🚴⚽ pic.twitter.com/9TVCFCA5WZ
రూల్స్ అన్నీ 'సైలెంట్'- విజిల్స్ బదులు జెండాలు!
ఈ క్రీడల్లో సౌండ్ ఉండదు కాబట్టి, రూల్స్ అన్నీ విజువల్‌గానే ఉంటాయి. 100 మీటర్ల పరుగు పందెం స్టార్ట్ చేయడానికి తుపాకీ పేల్చరు, దానికి బదులుగా ఫ్లాషింగ్ లైట్స్ వాడతారు. ఆ లైట్ వెలగగానే అథ్లెట్లు పరిగెత్తాలి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రిఫరీ విజిల్ ఊదడు, దానికి బదులుగా జెండా ఊపుతాడు. స్విమ్మింగ్‌లో కూడా లైట్ సిస్టమ్స్ వాడతారు. "క్రీడల ద్వారా సమానత్వం" అనేది వీరి నినాదం. వీరికి ఉన్న ప్రత్యేక పాలకమండలి (ICSD)లో కూడా అందరూ చెవులు కూడా వినపడని వారే ఉండటం మరో విశేషం.
Team India lights up the opening ceremony of the 25th Summer Deaflympics Tokyo 2025, taking place from 15th to 26th November 2025!
— Nabibhai Sayyad (@NabibhaiSayyad) November 15, 2025
Wishing all the athletes the very best. Let’s go for those Gold Medals! Proud of you all! 🇮🇳🏅 pic.twitter.com/OPfQODuz8o
100 ఏళ్ల చరిత్ర- టోక్యోలో ప్రస్తుతం ఇదే హడావుడి!
పారాలింపిక్స్ కంటే ఈ 'సైలెంట్ గేమ్స్' చాలా పాతవి. వీటి చరిత్ర 1924లో ప్యారిస్‌లో మొదలైంది. అప్పట్లో వీటిని "అంతర్జాతీయ నిశ్శబ్ద క్రీడలు" అనేవారు. దివ్యాంగుల కోసం మొదలైన మొట్టమొదటి గ్లోబల్ స్పోర్టింగ్ ఈవెంట్ ఇదే. ఇప్పుడు, ఈ నవంబర్ 15 నుంచి 26 వరకు జపాన్‌లోని టోక్యోలో 25వ సమ్మర్ డెఫ్లింపిక్స్ జరుగుతున్నాయి. ఇది ఈ క్రీడల 100వ వార్షికోత్సవం (శతాబ్ది) కావడం చాలా స్పెషల్. జపాన్ ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి.
これまでのキャラバンカー巡回の様子を順次紹介していきます🌈
— 【公式】東京2025デフリンピック(デフリンピック運営委員会) (@2025deaflympics) October 28, 2025
【キャラバンカーA(北回り)】
キャラバンカーは青森県から岩手県に引き継がれました。
The caravan car moved from Aomori Prefecture to Iwate Prefecture.#TOKYO2025DEAFLYMPICS #全国キャラバン pic.twitter.com/mq35iG7RaT
టోక్యో 2025, 3000 మంది అథ్లెట్లు!
ప్రస్తుతం టోక్యోలో జరుగుతున్న ఈ 25వ డెఫ్లింపిక్స్‌లో 80కి పైగా దేశాల నుంచి సుమారు 3,000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, షూటింగ్ వంటి మొత్తం 21 క్రీడల్లో వీరు పోటీ పడుతున్నారు. ఈ క్రీడల పట్ల అవగాహన పెంచడానికి, వీటిని అధికారిక టోక్యో 2025 డెఫ్లింపిక్స్ వెబ్‌సైట్ యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తున్నారు. మన దేశం నుంచి కూడా పెద్ద బృందమే ఈ పోటీల్లో పాల్గొంటోంది. ఒలింపిక్స్ అంటే కేవలం సమ్మర్ గేమ్స్, పారాలింపిక్స్ మాత్రమే కాదు, ఈ 'డెఫ్లింపిక్స్' కూడా అందులో ఒక భాగమే. శబ్దంతో సంబంధం లేకుండా, కేవలం తమ ప్రతిభ, పట్టుదలతో ఈ అథ్లెట్లు సాధిస్తున్న విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకం.
10/16に鳥取でデフリンピックセミナー開催!
— 【公式】東京2025デフリンピック(デフリンピック運営委員会) (@2025deaflympics) October 8, 2024
主に報道&自治体の方を対象としたセミナーですが、大会に興味のある方どなたでも参加OKです☺
申込フォーム>https://t.co/Sjdc0uDeRU
日時: 10/16(水) 13:30~15:30
場所:とりぎん文化会館第4会議室
内容: 大会説明/デフアスリート講演/情報保障機器体験 pic.twitter.com/QLdjd6nPrx

