ETV Bharat / sports

2026 IPL : ఈ సీజన్​లో వైభవ్ సూర్యవంశీ ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?

అవార్డులే అవార్జులు, రివార్డులే రివార్డులు- ఈ ఐపీఎల్ సీజన్​లో వైభవ్ సూర్యవంశీ ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?

Vaibhav Sooryavanshi IPL
Vaibhav Sooryavanshi IPL (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : June 1, 2026 at 5:34 PM IST

2 Min Read
Choose ETV Bharat

Vaibhav Sooryavanshi IPL : ఈ ఐపీఎల్​లో మెజార్టీ రికార్డులు రాజస్థాన్ రాయల్స్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ చుట్టూనే తిరిగాయి. టోర్నమెంట్ ఆసాంతం రాణించిన అతడు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో అత్యధిక పరుగులు, మోస్ట్ సిక్సెస్, అత్యధిక స్ట్రైక్ రేట్ ఇలా ఏకంగా ఐదు అవార్డులను గెలుచుకున్నాడు. దీంతో అసలు ఈ సీజన్​లో వైభవ్ ఎంత సంపాదించాడు? ప్రైజ్​మనీ, శాలరీ తదితర రూపంలో అతడికి ఎంత డబ్బు వచ్చిందో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో వైభవ్ తాజా ఐపీఎల్ సంపాదనపై ఓ లుక్కేద్దాం!

శాలరీ ఎంతంటే?
వైభవ్ 13 ఏళ్లు ఉన్నప్పుడే అతడి సత్తాను రాజస్థాన్ రాయల్స్ గుర్తించింది. దీంతో 2024లో జరిగిన వేలంలోనే అతడి కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యింది. ఈ చిన్నోడికి అప్పుడు రాజస్థాన్ ఫ్రాంచైజీ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక 2025లో అదరగొట్టడంతో జట్టులోనే కొనసాగించింది. అందుకే ఈ సీజన్​కు కూడా అంతే శాలరీతో లీగ్​లో అడుగుపెట్టాడు. అంటే సీజన్ ప్రారంభానికి ముందే ఈ చిచ్చరపిడుగు రూ.1.10 కోట్లు జేబులో వేసుకున్నాడు.

మ్యాచ్ ఫీజులు- రివార్డులు
ఇక భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్ అదరగొట్టాడు. రాజస్థాన్ ఆడిన అన్ని మ్యాచ్​ల్లోనూ బరిలోకి దిగాడు. ఈ సీజన్​లో ఆ జట్టు గ్రూప్ స్టేజ్, ప్లేఆఫ్స్​ కలుపుకొని 16 మ్యాచ్​లు ఆడింది. ఐపీఎల్​లో ఒక్కో మ్యాచ్​కు ఆటగాళ్లకు రూ.7.5 లక్షల ఫీజును బోర్డు అందిస్తుంది. ఇలా అన్ని మ్యాచ్​లకు కలిపి అతడు రూ.1.20 కోట్లు సంపాదించాడు. దీంతోపాటుగా లీగ్​లో మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అవి రూ.3 లక్షలు. వీటితోపాటు మోస్ట్‌ సిక్సెస్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ఎలక్ట్రిక్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులతో ఇంకొంత క్యాష్ అందుకున్నాడు.

5 అవార్డులు- భారీ క్యాష్ ప్రైజ్​
అలాగే టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో వైభవ్​కు ఏకంగా ఐదు అవార్డులు దక్కాయి. టోర్నీలో ముఖ్యమైన ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్​కు రూ.15 లక్షలు, ఆరెంజ్ క్యాప్​కు రూ.10 లక్షలు, అత్యధిక సిక్స్​లకు రూ.10 లక్షలు, అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచినందుకు రూ.10 లక్షలు, అత్యధిక సిక్స్​లు బాదిన అవార్డుకుగానూ రూ.10 లక్షలు ఇలా ఫైనల్​ అనంతరం రూ.55 లక్షల విలువైన చెక్కులు సొంతం చేసుకున్నాడు.

మొత్తం ఎంతంటే?
టోర్నీలో ఆడిన మ్యాచ్​లు ఫీజులు, సీజన్ శాలరీ, అలాగే లీగ్​లో గెలుచుకున్న రివార్డులు అన్నీ కలుపుకొని వైభవ్ సూర్యవంశీ 2026 ఐపీఎల్​లో రూ.2.85 కోట్లకుపైగానే డబ్బు అందుకున్నాడు. ఈ క్యాష్ రివార్డులతోపాటుగా అతడికి టాటా సియారా కారు కూడా దక్కింది.

Vaibhav IPL 2026 Runs : 2026 సీజన్​లో వైభవ్ 16 మ్యాచ్​లు ఆడాడు. ఇందులో 48 యావరేజ్​, 237.31 స్టైక్ రేట్​తో 776 పరుగులు నమోదు చేశాడు. మొత్తం 63 ఫోర్లు, 72 సిక్స్​లు బాదాడు. ఇందులో ఒక శతకం, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. దీంతో ఐపీఎల్​ చరిత్రలో అత్యంత చిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న బ్యాటర్​గా వైభవ్ అద్భుతమైన రికార్డు కొట్టాడు. అలాగే ఒకే సీజన్​లో ఐదు అవార్డులు అందుకున్న క్రికెటర్​గానూ అరుదైన ఘనత సాధించాడు.

RCB కప్పు గెలిచినా డామినేషన్ వైభవ్​దే- 15ఏళ్లకే ఏకంగా ఐదు అవార్డులు

'రోజుకు ఎన్ని లీటర్ల పాలు తాగుతావ్?'- వైభవ్​కు రవిశాస్త్రి ఫన్నీ క్వశ్చన్