15ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ - చిన్నోడి ఖాతాలో మరో రికార్డ్
పురుషుల సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ - సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్

Published : August 30, 2026 at 3:52 PM IST
Vaibhav Sooryavanshi : గత రెండేళ్లుగా క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతుంది. ఐపీఎల్‌తో ఆడిన ఏడాదికే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించిన ఈ చిచ్చరపిడుగు, ఇప్పుడు కెరీర్లో మరో కీలక ఘనత సాధించాడు. కేవలం 15ఏళ్లకే ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో హేమాహేమీ ఆటగాళ్లున్న జట్టుకు సారథ్యం వహించాడు. దీంతో ఈ టోర్నీ హిస్టరీలోనే అరుదైన దృశ్యం కనిపించింది.
వైస్ కెప్టెన్ నుంచి కెప్టెన్‌గా!
ఈ దులీప్ ట్రోఫీలో వైభవ్ ఈస్ట్ జోన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టీమ్‌కు అతడు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈస్ట్ జోన్ - సెంట్రల్ జోన్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అకస్మాత్తుగా గాయపడి మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీంతో 15 ఏళ్ల వయసున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి జట్టు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు వచ్చాయన్నమాట! అలా సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో వైభవ్ కెప్టెన్‌గా జట్టును నడిపించాడు.
డీఆర్ఎస్ సక్సెస్
సెంట్రల్ జోన్ బ్యాటింగ్‌లో 39.1 ఓవర్ వద్ద జుయల్ క్రీజులో ఉన్నాడు. ముకేశ్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడే క్రమంలో బంతి కీపర్ చేతిలో పడింది. దీనిని ఈస్ట్ జోన్ ఆటగాళ్లు క్యాచౌట్కు అప్పీల్ చేయగా అంపైర్ ఇవ్వలేదు. దీంకో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఉన్న వైభవ్ రివ్యూ తీసుకున్నాడు. రీప్లైలో బ్యాటుకు బంతి తగిలినట్లు తేలడంతో జుయల్‌ను అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అలా కెప్టెన్‌గా తీసుకున్న తొలి రివ్యూకే వైభవ్ సక్సెస్ అయ్యాడు.
Stand-in Captain Vaibhav Sooryavanshi goes for the review with 3 seconds remaining...and gets it right 👏
— BCCI Domestic (@BCCIdomestic) August 30, 2026
DRS done right as the set Aryan Juyal (46) is dismissed ✅
The celebrations say it all 🙌#DuleepTrophy pic.twitter.com/IwBQbr8hJQ
సీనియర్లకు హెడ్‌గా!
వైభవ్ సారథ్యం వహిస్తున్న జట్టులో టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్లు మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, కుమార్ కుషాగ్ర, అభిమన్యు ఈశ్వరన్, అనుకుల్ రాయ్ లాంటి టాప్ ప్లేయర్లు ఉన్నారు. వాళ్లను వైభవ్ ముందుండి నడిపిస్తున్నాడు.
గాయం ఇలా!
ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు వికెట్ కీపింగ్ చేస్తుండగా బంతి వేగంగా వచ్చి అతడి కుడి చేతికి బంతి బలంగా తగలింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిలల్లాడు. వెంటనే ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఇషాన్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం నొప్పి ఎక్కువగా ఉండడంతో ఇషాన్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీంతో వైభవ్‌కు నాయకుడిగా జట్టును నడిపించే అవకాశం దక్కింది.
మ్యాచ్ విషయానికొస్తే, ఈస్ట్ జోన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సెంట్రల్ జోన్ బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు 69 ఓవర్లకు ఆ జట్టు 214-8 స్కోర్‌తో నిలిచింది. రింకు సింగ్ (60 పరుగులు) టాప్ స్కోరర్. ఆర్యన్ జుయల్ (46 పరుగులు) రాణించాడు. ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేశ్ కుమార్ 3, అభిజిత్ కే సర్కార్ 2, కొనైన్ ఖురేషీ 2 వికెట్లు దక్కించుకొని సెంట్రల్ జోన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టారు.
Captain Vaibhav Suryavanshi 😅🔥
— Jara (@JARA_Memer) August 30, 2026
The moment Vaibhav Suryavanshi 𝗯𝗲𝗰𝗮𝗺𝗲 𝗰𝗮𝗽𝘁𝗮𝗶𝗻, there was no end to his happiness. His smile just wouldn’t stop! 😂
He probably couldn’t believe that players like Mohammad Shami and Mukesh Kumar were going to play under his… pic.twitter.com/jSejoFAo5N
మొదటిసారి సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా
కాగా, వైభవ్ సూర్యవంశీ సీనియర్ పురుషుల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి. 2024లో అతడు రంజీ ట్రోఫీ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అతడికి ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 10వ మ్యాచ్ మాత్రమే. ఇక దులీప్ ట్రోఫీలో కేవలం రెండోదే. అప్పుడే ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఓ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఈ నెల ప్రారంభంలో ఈస్ట్ జోన్ జట్టును ఎంపిక చేసేటప్పుడే సెలక్టర్లు వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.
ప్రస్తుత దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌లో ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్‌పై భారీ విజయం సాధించింది. కానీ ఆ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ బ్యాటింగ్ చేసింది. అందులో అతడు 8 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. కానీ బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో 2 వికెట్లు తీసి సర్ప్రైజ్ ఇచ్చాడు.
'ఏజ్ జస్ట్ నెంబరే బాస్'- 51ఏళ్ల వయసులో వరల్డ్ క్రికెట్‌లో రేర్ రికార్డ్

