ETV Bharat / sports

రాజస్థాన్​ సూపర్​ విక్టరీ- వైభవ్‌ విధ్వంసంతో RCBకి తొలి ఓటమి

బెంగళూరుపై రాజస్థాన్‌ విజయం- ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై రాజస్థాన్‌ గెలుపు

IPL 2026 RR vs RCB
IPL 2026 RR vs RCB (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : April 11, 2026 at 6:49 AM IST

2 Min Read
Choose ETV Bharat

IPL 2026 RR vs RCB : గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై రాజస్థాన్‌ రాయల్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ 26 బంతుల్లో 8ఫోర్లు, 7 సిక్స్‌లతో చెలరేగి 78 పరుగులు చేశాడు. ధ్రువ్‌ జురెల్‌ 43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 రన్స్‌ కొట్టాడు. జడేజా (24 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్‌, హేజెల్‌వుడ్‌ రెండేసి వికెట్లు తీయగా మిగిలినవారు విఫలమయ్యారు. తుఫాన్ ఇన్నింగ్స్​తో చెలరేగిన యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఛేదనలో వైభవ్ ఆటే హైలైట్. అతడు భువనేశ్వర్, హేజిల్​వుడ్ లాంటి స్టార్ బౌలర్ల బౌలింగ్​లో సైతం బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అయితే వైభవ్‌ ఔటైన తర్వాత రాజస్థాన్‌ ఓ దశలో తడబడింది. జైస్వాల్‌ (13 పరుగులు), రియాన్‌ పరాగ్‌ (3 పరుగులు) , హెట్‌మయర్‌ (0) నిరాశ పర్చారు. అయితే జురెల్‌, జడేజా క్రీజులో పాతుకుపోయి ఇంకో వికెట్ పడకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్​కు 50 బంతుల్లో అజేయంగా 68 పరుగులు జోడించారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటీదార్ (63 పరుగులు, 40 బంతుల్లో) హాఫ్ సెంచరీతో మెరిశాడు. విరాట్ కోహ్లీ (32 పరుగులు), రొమారియో షెపర్డ్ (22 పరుగులు), వెంకటేశ్ అయ్యర్ (29 పరుగులు) ఆకట్టుకున్నారు. చివర్లో వెంకటేశ్ అయ్యర్, పాటీదార్ ఆడడంతో ఆర్సీబీ స్కోర్ 200 దాటింది. ఫిల్‌ సాల్ట్‌ (0), దేవ్‌దత్‌ (14 పరుగులు), కృనాల్‌ పాండ్య (1 పరుగు), జితేశ్‌ శర్మ (5 పరుగులు) , టిమ్‌ డేవిడ్‌ (13 పరుగులు) విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, రవిబిష్ణోయ్‌, బ్రిజేశ్‌ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. సందీప్‌ శర్మ, జడేజా చెరో వికెట్‌ తీశారు.

ఐపీఎల్‌లో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఇండియన్ బ్యాటర్లు (బంతుల పరంగా)

  • 13 బంతుల్లో - యశస్వీ జైస్వాల్ (RR) vs కోల్​కతా నైట్​రైడర్స్ , కోల్‌కతా, 2023
  • 14 బంతుల్లో- KL రాహుల్ (PBKS) vs దిల్లీ క్యాపిటల్స్, మొహాలి, 2018
  • 15 బంతుల్లో - యూసుఫ్ పఠాన్ (KKR) vs సన్​రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా, 2014
  • 15 బంతుల్లో - వైభవ్ సూర్యవంశీ (RR) vs చెన్నై సూపర్ కింగ్స్ , గువాహటి, 2026
  • 15 బంతుల్లో - వైభవ్ సూర్యవంశీ (RR) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గువాహటి, 2026*

IPLలో 200పైగా పరుగుల లక్ష్యాన్ని అత్యధిక సార్లు విజయవంతంగా ఛేదించిన జట్లు

  • 9 - పంజాబ్ కింగ్స్
  • 6 - ముంబయి ఇండియన్స్
  • 5 - రాజస్థాన్ రాయల్స్
  • 4 - సన్​రైజర్స్ హైదరాబాద్
  • 4 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

లైవ్ ప్రెస్​మీట్​లో 'విరాట్​ కోహ్లీ'తో పోలిక- రిపోర్టర్​కు బాబర్ అజామ్ స్ట్రాంగ్ కౌంటర్!

'బౌలర్​ ఎవరైతే నాకేంటి?- నేను బంతినే చూస్తా'- వైభవ్ సూర్యవంశీ బోల్డ్ స్టేట్​మెంట్