ETV Bharat / sports

సిరీస్ గెలిస్తే, ఏం లాభం?- తగ్గిన టీమ్ఇండియా పర్సంటేజ్- WTC ఫైనల్ ఛాన్స్​లు ఎలా ఉన్నాయంటే?

శ్రీలంకతో టెస్టు సిరీస్​ విజయం - 1-0తో గెలుచుకున్న భారత్ - అయినప్పటికీ డబ్ల్యూటీసీ టేబుల్​లో నో యూజ్

WTC Points Table
WTC పాయింట్ల పట్టిక (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : August 27, 2026 at 7:57 PM IST

2 Min Read
Choose ETV Bharat

WTC Points Table 2025- 27 : శ్రీలంక పర్యటనలో రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను 1-0తో దక్కించుకున్నప్పటికీ వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్​లో భారత్​కు ప్రయోజనం కలగలేదు. ఈ పర్యటనలో తొలి మ్యాచ్​లో విజయం సాధించిన టీమ్ఇండియా, రెండో టెస్టును డ్రా చేసుకుంది. దీంతో సిరీస్ సొంతమైనా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానంలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ టెస్టు సిరీస్‌కు ముందు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్, సిరీస్ గెలిచిన తర్వాత కూడా అదే ప్లేస్​లో కొనసాగుతోంది.

సిరీస్ దక్కినా తగ్గిన పర్సంటేజీ
సిరీస్​లో తొలి మ్యాచ్​ను గెలుచుకున్న భారత్ పాయింట్ పర్సంటేజీని మెరుగుపర్చుకొంది. ఆ మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా పాయింట్ పర్సంటీజీ 48.15 నుంచి 53.33కు పెరిగింది. ఇక రెండో మ్యాచ్​లోనూ గెలుపొంది పట్టికలో నాలుగో స్థానంలోకి దూసుకెళ్లాలని భారత్ భావించింది. అందుకు అనుగునంగానే మ్యాచ్​ను ఆరంభించింది. తొలి నాలుగు రోజులు భారత్​దే ఆధిపత్యంగా సాగింది. కానీ, ఐదో రోజు మాత్రం అదృష్టం శ్రీలంకను వరించింది.

ఆ జట్టు ఆల్​రౌండ్ సొనాల్ దినుషతోపాటు లోయార్డర్ క్రీజులో పాతుకుపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ ఫలితం భారత్​ పర్సంటేజీని దెబ్బతీసింది. టేబుల్​లో పొజిషన్​ మారకపోగా, భారత్ గెలుపు శాతం 53.33 నుంచి 51.52కి పడిపోయింది. మరోవైపు, శ్రీలంక గెలుపు శాతం 33.33గా ఉంది. ఆ జట్టు ఆరో స్థానంలోనే కొనసాగుతోంది. ఒకవేళ భారత్ ఈ టెస్టు సిరీస్‌ను 2-0తో గెలిచి ఉంటే బంగ్లాదేశ్​ను వెనక్కినెట్టి నాలుగో ప్లేస్​కు దూసుకెళ్లేది!

ఇకపై కఠిన సవాల్
2025-27 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఇప్పటివరకు మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు విజయాలు, నాలుగు ఓటములు ఉన్నాయి. ఇంకో రెండు టెస్టులను డ్రా గా ముగించింది. ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్​లో ఫైనల్‌కు చేరాలంటే భారత్ ఇకపై మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో భారత్ ఇంకా ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లలో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని జట్టుకు కఠిన సవాలు ఎదురుకానుంది. ఇందులో రెండు న్యూజిలాండ్​తో, మరో ఐదు ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఎంతమేర రాణిస్తుందో చూడాలి.

టాప్​లో ఆసీస్
ప్రస్తుతం డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో 80.00 గెలుపు శాతంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా 75.00 గెలుపు శాతంతో రెండో స్థానంలో ఉంది. 72.22 పాయింట్ పర్సంటేజీతో న్యూజిలాండ్ మూడో ప్లేస్​లో ఉండగా, 55.56 శాతంతో బంగ్లాదేశ్ నాలుగో పొజిషన్​లో కొనసాగుతోంది.

WTC ఫైనల్​ అవకాశాలు
డబ్ల్యూటీసీలో భారత్ ఫైనల్​ అవకాశాలు క్లిష్టంగా మారాయి. తదుపరి ఆడనున్న ఏడు టెస్టుల్లోనూ భారత్ నెగ్గితే అప్పుడు పాయింట్ పర్సంటేజీ 70.37కు చేరుకుంటుంది. ఆరు విజయాలు సాధించి, ఒకదాంట్లో ఓడిపోతే 65 శాతంతో ఉంటుంది. ఒకవేళ న్యూజిలాండ్‌తో 0- 2తో ఓడిపోయి, స్వదేశంలో ఆస్ట్రేలియాపై 5- 0తో గెలిస్తే అప్పుడు భారత్ 59.26 పర్సంటేజీతో ఉంటుంది. అప్పుడు ఫైనల్​కు చేరుతుందని గ్యారెంటీ లేదు. ఇతర జట్ల ఫలితాలపై టీమ్ఇండియా అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

భారత్​కు నిరాశ- రెండో టెస్టును డ్రా చేసుకున్న శ్రీలంక

చరిత్ర సృష్టించిన సొనాల్ దినుష- 67ఏళ్ల తర్వాత భారత్‌పై ఆ ఫీట్ సాధించిన బ్యాటర్​గా రికార్డు