ETV Bharat / sports

ర్యాంకింగ్స్​లో ఇషాన్ జోరు- ఒక్క నెలలోనే భారీ ఛేంజ్ - టాప్​ 10లోకి బుమ్రా

ICC rankings 2026- తాజా ర్యాంకులు రిలీజ్ చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ముందుకు ఇషాన్ కిషన్, బుమ్రా- మూడు స్థానాలు కోల్పోయిన తిలక్ వర్మ

ICC rankings
ICC rankings (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : February 25, 2026 at 3:42 PM IST

3 Min Read
Choose ETV Bharat

ICC rankings 2026 : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా యువ సంచలనం ఇషాన్ కిషన్ గతకొన్ని రోజులుగా రాకెట్​ స్పీడ్​లో దూసుకెళ్తున్నాడు. బ్యాటింగ్​ విభాగంలో గతనెల టాప్ -50లో కూడా లేని ఇషాన్, తాజా ర్యాకింగ్స్​లో ఏకంగా టాప్ -5లోకి దూసుకొచ్చేశాడు. రెండేళ్ల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్​లో రీఎంట్రీలో న్యూజిలాండ్​తో రెచ్చిపోయిన అతడు, ప్రస్తుత టీ20 వరల్డ్​కప్​లోనూ రాణిస్తున్నాడు. దీంతో లేటెస్ట్ ర్యాకింగ్స్​లో ఇషాన్ మరో మూడు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్ దక్కించుకున్నాడు.

మరోవైపు యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ టాప్ 5 నుంచి చోటు కోల్పోయాడు. టీ20 వరల్డ్​కప్​లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న తిలక్​ తాజా ర్యాంకింగ్స్​లో మూడు స్థానాలు దిగజారిపోయాడు. ​దీంతో ప్రస్తుతం అతడు ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సౌతాఫ్రికా సెన్సేషన్ ప్లేయర్ డివాల్డ్ బ్రేవిస్ ఏకంగా 10 స్థానాలు ఎగబాకాడు. ఫలితంగా అతడు టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్​లోనే కొనసాగుతున్నాడు.

తిలక్ పేలవ ప్రదర్శన
ప్రస్తుత వరల్డ్​కప్​లో తిలక్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వన్​డౌన్​లో బరిలోకి దిగుతున్నా ఇప్పటిదాకా అతడి నుంచి పెద్ద ఇన్నింగ్స్ రాలేదు. మొత్తం 5 మ్యాచ్​ల్లో అతడు కేవలం 107 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 118 మాత్రమే ఉండడం గమనార్హం. దీంతో జింబాబ్వేతో సూపర్ 8 మ్యాచ్​లో అతడి ప్లేస్ డేంజర్​లో పడింది. అతడిని పక్కన పెట్టేసి ఇంకో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

రాణిస్తున్న ఇషాన్
ఇషాన్ కిషన్ ఈ టోర్నీలో రాణిస్తున్నాడు. ఇప్పటిదాకా 5 మ్యాచ్​ల్లో 35 సగటుతో 176 పరుగులు చేశాడు. 193.41 స్టైక్ రేట్​తో 19 ఫోర్లు, 11 సిక్స్​లు బాదాడు. ఈ వరల్డ్​కప్​లో భారత్ తరఫున కెప్టెన్ సూర్యకుమార్ (180 పరుగులు) అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్​గా కొనసాగుతున్నాడు. సూర్య తర్వాత టీమ్ఇండియా తరఫున అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్ ఇషాన్ కిషనే!

టాప్ 5 బ్యాటర్లు

  • అభిషేర్ శర్మ (భారత్)- 877 రేటింగ్స్
  • ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్)- 815 రేటింగ్స్
  • షహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్)- 810 రేటింగ్స్
  • పాథుమ్ నిస్సాంక (శ్రీలంక)- 789 రేటింగ్స్
  • ఇషాన్ కిషన్ (భారత్)- 742 రేటింగ్స్

అలాగే భారత్ యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఏడు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. దీంతో టాప్ 10లోకి ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం 669 రేటింగ్స్​తో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ బౌలర్ మ్యాథ్యూ ఫోర్డే ఏకంగా 23 స్థానాలు ఎగబాకాడు. అతడు 679 రేటింగ్స్​తో ఏడో స్థానం దక్కించుకున్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి (790 రేటింగ్స్) టాప్​లోనే కొనసాగుతున్నాడు.

టాప్ 5 బౌలర్లు

  • వరుణ్ చక్రవర్తి (భారత్) - 790 రేటింగ్స్
  • రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్)- 753 రేటింగ్స్
  • కర్బిన్ బోష్ (సౌతాఫ్రికా)- 731 రేటింగ్స్
  • ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్)- 716 రేటింగ్స్
  • అబ్రార్ అహ్మద్ (పాకిస్థాన్)- 712 రేటింగ్స్

ఆల్​రౌండర్ల విభాగానికి వస్తే, జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఒక స్థానం మెరుగుపర్చుకొని టాప్​లోకి దూసుకెళ్లాడు. అతడు ప్రస్తుతం 294 రేటింగ్స్​తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇన్ని రోజులు టాప్​లో ఉన్న పాక్ క్రికెటర్ సైమ్ అయూబ్ రెండో స్థానానికి పడిపోయాడు. భారత్ స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య 272 రేటింగ్స్​తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రీసెంట్​గా వరల్డ్​కప్​లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న శివమ్ దూబే రెండు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. దూబే ప్రస్తుతం 216 రేటింగ్స్​తో ఏడో ప్లేస్​లో ఉన్నాడు. దీంతో టాప్ 10లో ఇద్దరు భారత ఆల్​రౌండర్లు కొనసాగుతున్నారు.

టాప్ 5 ఆల్​రౌండర్లు

  • సికిందర్ రజా (జింబాబ్వే)- 294 రేటింగ్స్
  • సైమ్ అయూబ్ (పాకిస్థాన్)- 282 రేటింగ్స్
  • హార్దిక్ పాండ్య (భారత్)- 272 రేటింగ్స్
  • దీపేంద్ర సింగ్ (నేపాల్)- 244 రేటింగ్స్
  • అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గాన్)- 241 రేటింగ్స్

ఇషాన్ కిషన్ పెళ్లిపై స్పందించిన తల్లి- గర్ల్‌ఫ్రెండ్ పేరును స్వయంగా బయటపెట్టిన తాత

ర్యాంకింగ్స్​లో దుమ్ములేపిన ఇషాన్- ఏకంగా 17 స్థానాలు ఎగబాకి!