ETV Bharat / sports

'రేస్​ టు టైటిల్'- ఒకేరోజు రెండు నాకౌట్ మ్యాచ్​లు- TG 20 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే!

తెలంగాణ 20 క్రికెట్​ లీగ్​లో అలసైన సమరం - ఒకే రోజు రెండు నాకౌట్ మ్యాచ్​లు- ఫైనల్​కు వెళ్లేదేవరో- నిష్క్రమించేదెవరో తేలేది గురువారమే!​

TG 20 League
TG 20 League (Source : TG 20 'x' Post)
author img

By ETV Bharat Sports Team

Published : July 8, 2026 at 7:38 PM IST

3 Min Read
Choose ETV Bharat

TG 20 League Knockout Matches : టీజీ 20 లీగ్​లో కీలక మ్యాచ్​లకు సమయం ఆసన్నమైంది. దాదాపు నెల కిందట 8 జట్లతో ప్రారంభమైన ఈ టోర్నీలో సగం జట్లు ఎలిమినేట్ అయిపోయాయి. మిగిలిన నాలుగు జట్ల మధ్యలో నాకౌట్ మ్యాచ్​లు జరగనున్నాయి. గురువారం తొలుత ఎలిమినేటర్, సాయంత్రం క్వాలిఫయర్​​ మ్యాచ్​లు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ మ్యాచ్​ల వివరాలపై ఓ లుక్కేద్దామా?

క్వాలిఫయర్​పైనే!
తెలుగు క్రికెట్ ప్రేక్షకుల అందరి దృష్టి గురువారం సాయంత్రం జరగనున్న క్వాలిఫయర్ మ్యాచ్​పైనే నెలకొంది. ఈ మ్యాచ్​లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ - అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడనున్నాయి. ఇందులో హైదరాబాద్ జట్టే ఫేవరెట్​గా బరిలోకి దిగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రూప్​ దశలో ఆడిన ఏడు మ్యాచ్​ల్లోనూ విజయం సాధించి ఇక్కడ దాకా రావడమే అందుకు కారణం. కెప్టెన్ అభిరథ్ రెడ్డి సారథ్యంలో ఈ ఛాంపియన్స్​ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది.

మరోవైపు ఖమ్మం జట్టు కూడా పటిష్ఠంగా ఉంది. టాపార్డర్ బ్యాటర్ కొడిమెల హిమతేజ అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ అతడి వద్దే ఉంది. ఇక కెప్టెన్ మిలింద్, వాఫి కచ్చి, వేద్ రెడ్డి బౌలింగ్​లో రాణిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తిగా ఉండే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్​లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్​కు దూసుకెళ్తుంది. ఇక ఓడిన జట్టుకు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఆ టీమ్ క్వాలిఫయర్ 2కు వెళ్తుంది.

ఎలిమినేటర్​లో వీళ్లు!
ఇక గురువారం తొలుత జరిగే ఎలిమినేటర్​ మ్యాచ్​లో కరీంనగర్ డైమండ్స్- రంగారెడ్డి రైజర్స్​ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా లీగ్ దశలో చెరో నాలుగేసి మ్యాచ్​ల్లో నెగ్గాయి. దీంతో చెరో 8 పాయింట్లతో నాకౌట్ దశకు అర్హత సాధించాయి. అయితే అనురాగ్ నల్గొండ నైట్​ జట్టు కూడా 8 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైన రన్​రేట్ కారణంగా కరీంనగర్, రంగారెడ్డి ముందంజ వేశాయి. దీంతో నల్గొండ ఎలిమినేట్ అయ్యింది.

ఇక ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే, కరీంనగర్​కు ఆ జట్టు కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ బలం. అతడితోపాటు బౌలింగ్​లో శుభమ్ శర్మ నిలకడగా రాణిస్తుండడం ఆ జట్టుకు కొలిసొచ్చేదే. ఇక రంగారెడ్డి విషయానికొస్తే, అరుణ్ జార్జ్, ఆదిత్య లాంటి బ్యాటర్లతో బలంగా ఉంది. లీగ్ స్టేజ్ ఆఖరి మ్యాచ్​లో వరంగల్​పై విధ్వంసం సృష్టించి ఫామ్​లో ఉన్నారు. కెప్టెన్ నితిన్ సాయి బౌలింగ్​లో రాణిస్తున్నాడు. అయితే ఇందులో ఓడిన జట్టుకు ఇంకో అవకాశం ఉండదు. నేరుగా ఎలిమినేట్ అవుతుంది. అందుకే ఇరుజట్లు కూడా విజయం కోసం పోటీ పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయం సాధించిన టీమ్ క్వాలిఫయర్ 2కు వెళ్తుంది. అక్కడ క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టుతో ఆడాల్సి ఉంటుంది.

టికెట్ల లింక్​ ఇక్కడ
కాగా, ఈ రెండు నాకౌట్​ మ్యాచ్​లు ఉప్పల్ స్టేడియం వేదికగానే జరగనున్నాయి. ఈ మ్యాచ్​లకు సంబంధించిన టికెట్ సేల్ షురూ అయ్యింది. ఈ ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ డిస్ట్రిక్ట్​లో అందుబాటులో ఉన్నాయి. రూ.49, రూ.99 ధరల్లో టికెట్లు ఉన్నాయి. బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లింక్​పై క్లిక్ చేసి టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

నాకౌట్ మ్యాచ్​ల షెడ్యూల్

  • ఎలిమినేటర్ - కరీంనగర్ డైమండ్స్ vs రంగారెడ్డి రైజర్స్ - జులై 09- మధ్యాహ్నం 2.15 గంటలకు
  • క్వాలిఫయర్ 1 - హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ vs ఖమ్మం ఏసెస్ - జులై 09- సాయంత్రం 7.15 గంటలకు

ఎక్కడ లైవ్ చూడాలి?
లీగ్​లో గ్రూప్ స్టేజ్​ల మాదిరిగానే ఈ నాకౌట్ మ్యాచ్​లకు కూడా స్టార్ స్పోర్ట్స్ అధికారిక బ్రాడ్​కాస్టర్​గా ఉంది. అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ జియోస్టార్ లైవ్ స్ట్రీమింగ్ అందిస్తుంది.

TG20 ప్లేఆఫ్స్‌ లైనప్‌ ఖరారు- కరీంనగర్‌, రంగారెడ్డి చివరి బెర్తులు సొంతం

టీమ్ఇండియా చెత్త రికార్డుల పరంపర- అయ్యర్ కెప్టెన్సీలో ఫ్లాప్ షో