ETV Bharat / sports

చెన్నై రికార్డ్​ను బ్రేక్ చేసిన సన్​రైజర్స్- ఐపీఎల్​లో ఆరెంజ్ ఆర్మీ సరికొత్త రేర్ ఫీట్

పంజాబ్​పై సన్​రైజర్స్ ఘన విజయం- ఐపీఎల్​లో ఆరెంజ్ ఆర్మీ అరుదైన రికార్డ్

Sunrisers Hyderabad IPL Records
Sunrisers Hyderabad IPL Records (Source : AP News)
author img

By ETV Bharat Sports Team

Published : May 7, 2026 at 9:31 AM IST

3 Min Read
Choose ETV Bharat

Sunrisers Hyderabad IPL Records : 2026 ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ ఏడో విజయం నమోదు చేసింది. తాజాగా ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ఆల్​రౌండ్ షో తో మెరిసిన ఆరెంజ్ ఆర్మీ ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలోనూ టాప్​లోకి దూసుకెళ్లింది. అయితే ఇదే మ్యాచ్​తో సన్​రైజర్స్ ఐపీఎల్​లో అరుదైన రికార్డు కొట్టింది. అదేంటంటే?

ఐపీఎల్​లో పంజాబ్​ కింగ్స్​పై సన్​రైజర్స్ విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఈ రెండు జట్ల మధ్య 26 సార్లు మ్యాచ్ జరిగింది. ఇందులో ఆరెంజ్ ఆర్మీ అత్యధికంగా 18 మ్యాచ్​ల్లో విజయం సాధించింది. అటు పంజాబ్ 8 మ్యాచ్​ల్లోనే నెగ్గింది. దీంతో పంజాబ్​తో ముఖాముఖిలో సన్​రైజర్స్ డామినేషన్ క్లియర్​గా కనిపిస్తోంది. అదే క్రమంలో ఉప్పల్ వేదికగానూ ఆ జట్టుతో పోరులో సన్​రైజర్సే ఆధిపత్యం చలాయిస్తోంది.

ఉప్పల్​ మైదానంలో పంజాబ్​పై సన్​రైజర్స్​కు ఇది తొమ్మిదో విజయం. 2015- 2026 మధ్యలో వరుసగా తొమ్మిదిసార్లు ఆ జట్టుపై ఆరెంజ్ ఆర్మీ గెలుపొందింది. దీంతో ఒకే వేదికగా ఒక ప్రత్యర్థిపై వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సన్​రైజర్స్ రికార్డు కొట్టింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రికార్డును సన్​రైజర్స్ బ్రేక్ చేసింది. సీఎస్కే 2010- 2024 మధ్య చెన్నె చెపాక్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 విజయాలు నమోదు చేసింది.

ఐపీఎల్​లో సింగిల్ వేదికపై ఒకే ప్రత్యర్థిపై వరుసగా సాధించిన అత్యధిక విజయాలు

  • 9 - సన్​రైజర్స్ vs పంజాబ్ కింగ్స్- హైదరాబాద్‌ ఉప్పల్​లో (2015-26)*
  • 8 - చెచ్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , చెన్నై చెపాక్ (2010-24)
  • 7 - చెచ్నై సూపర్ కింగ్స్ vs దిల్లీ - చెన్నై చెపాక్ (2011-23)
  • 7 - ముంబయి ఇండియన్స్ vs కల్​తకా నైట్​రైజర్స్- వాంఖడే (2013-23)

ఇక ఓవరాల్​గా పంజాబ్​పై ఉప్పల్​ మైదానంలో సన్​రైజర్స్ 10సార్లు నెగ్గింది. అలా ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై ఒక ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా సన్​రైజర్స్​ కొనసాగుతోంది. ఈ జాబితాలో ముంబయి టాప్​లో ఉంది. కోల్​కతా నైట్​రైడర్స్ జట్టును ముంబయి వాంఖడే వేదికగా 11 సార్లు ఓఢించింది.

ఐపీఎల్​లో ఒకే వేదికపై ఒక ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు

  • 11 - ముంబయి ఇండియన్స్ vs కోల్​కతా నైట్​రైడర్స్ -వాంఖడే (13 మ్యాచ్​లు)
  • 10 - సన్​రైజర్స్​ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ - హైదరాబాద్ ఉప్పల్ (11 మ్యాచ్​లు)*
  • 9 - కోల్​కతా నైట్​రైడర్స్ vs పంజాబ్ కింగ్స్ - కోల్​కతా ఈడెన్ గార్డెన్స్ (15 మ్యాచ్​లు)
  • 9 - చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్​కతా నైట్​రైడర్స్ - చెన్నై చెపాక్ (13 మ్యాచ్​లు)

ఇదీ రికార్డే!
సన్​రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి 235 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్​ను 202-7 స్కోర్​కే కట్టడిచేసింది. అయితే సన్​రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి 220+ స్కోర్లు నమోదు చేసిన ప్రతీసారి నెగ్గింది. ఇప్పటిదాకా ఆరెంజ్ ఆర్మీ 11 సార్లు 220+ పరుగులు చేయగా, అన్నిసార్లూ ఆ స్కోర్​ను కాపాడుకుంది. ఇది కూడా ఐపీఎల్​లో రికార్డే!

ఇక మ్యాచ్ విషయానికొస్తే, పంజాబ్​పై ఆరెంజ్ ఆర్మీ 33 పరుగులు తేడాతో విజయం సాధించింది. 236 పరుగుల ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులకే పరిమితమైంది. కూపర్ కొనొలి (107 పరుగులు) సెంచరీ వృథా అయ్యింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్​రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69), ఇషాన్ కిషన్ (55), అభిషేక్ శర్మ (35), ట్రావిస్ హెడ్ (39), నితీశ్ కుమార్ రెడ్డి (29) రాణించారు.

హెడ్, క్లాసెన్ ధనాధన్ ఇన్నింగ్స్- వాంఖడేలో సన్​రైజర్స్ రికార్డ్ ఛేజింగ్!

SRH స్పెషల్ రికార్డ్- ఐపీఎల్​ ఎలైట్ క్లబ్​లో ఆరెంజ్ ఆర్మీ ఎంట్రీ