ETV Bharat / sports

ముగిసిన SRH ఇన్నింగ్స్- స్కోర్ 200 దాటినా ఫినిషింగ్​లో నిరాశ!

ముగిసిన సన్​రైజర్స్ ఇన్నింగ్స్- ఉవ్వెత్తున లేచి కిందపడ్డ ఆరెంజ్ ఆర్మీ- అనుకున్న దానికంటే తక్కువకే పరిమితం!

SRH vs PBKS
SRH vs PBKS (Source : AP News)
author img

By ETV Bharat Sports Team

Published : April 11, 2026 at 5:27 PM IST

3 Min Read
Choose ETV Bharat

SRH vs PBKS IPL 2026 : ముల్లాన్​పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్​రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (74 పరుగులు) సూపర్ ఇన్నింగ్స్​తో చెలరేగిపోయాడు. పంజాబ్ బౌలర్లలో శశాంక్ సింగ్, అర్షదీప్ సింగ్ చెరో 2, జెవియర్ 1 వికెట్ దక్కించుకున్నారు.

పవర్​ ప్లే రికార్డ్
పవర్​ ప్లేలో సన్​రైజర్స్ రెచ్చిపోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ విజృంభించడంతో ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్​లో పవర్ ప్లే లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా ఆరెంజ్ ఆర్మీ రికార్డ్ కొట్టింది.

అభిషేక్ ఫైర్ ఇన్నింగ్స్
సన్​రైజర్స్ ఇన్నింగ్స్​లో అభిషేర్ శర్మ ఆటే హైలైట్. అతనొక్కడు తప్ప మిగితా బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. 28 బంతుల్లో అభిషేక్ 74 రన్స్ చేశాడు. ఇందుసో 5 ఫోర్లు, 8 సిక్స్​లు ఉండడం విశేషం. అంటే బౌండరీల ద్వారానే అతడు 68 పరుగులు చేశాడన్నమాట! ఇక 8.1వద్ద శశాంక్ సింగ్​ హెడ్​ను ఔట్ చేశాడు. దీంతో తొలి వికెట్​కు 120 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్ మూడో బంతికి జోష్​లో ఉన్న అభిషేక్​ను కూడా శశాంకే ఔట్ చేశాడు. ఇక ట్రావిస్ హెడ్ (38 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. ఇషాన్ కిషన్ (27), అనికేత్ వర్మ (18 పరుగులు) వేగంగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరారు. హెన్రీచ్ క్లాసెన్ (39 పరుగులు, 33 బంతులు) చాలా స్లో గా ఆడాడు.

అనుకున్న ముగింపు రాలేదు!
సన్​రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరుకు చివరికి సాధించిన స్కోర్​కు పోలిక లేదు. 6 ఓవర్లకు 105-0తో ఉండగా, 8 ఓవర్లకు 128-0తో నిలిచింది. దీంతో సన్​రైజర్స్ మరోసారి 250+ స్కోర్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, చివర్లో తడబడుతూ ఆడింది. దీంతో 20 ఓవర్లకు 219 పరుగుల వద్దే ఆగిపోయింది.

సన్​రైజర్స్ ఇన్నింగ్స్ సాగిందిలా!

  • తొలుత బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్ స్కోర్ పవర్​ ప్లేలో జెట్​ స్పీడ్​తో పరిగెత్తింది. ఓపెనర్ అభిషేక్ శర్మ పంజాబ్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే అతడు అర్ధ శతకం పూర్తి చేశాడు. ఆ తర్వాతా అభిషేక్ రెచ్చిపోవడంతో ఆరు ఓవర్లలో ఎస్​ఆర్​హెచ్​ 17.5 రన్​రేట్​తో 105-0 పరుగులు చేసింది.
  • ఆ తర్వాత 7 నుంచి 15 ఓవర్ల మధ్యలో పరుగుల వేగం నెమ్మదించింది. ఈ మధ్యలో అభిషేక్​తోపాటు ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్​ పెవిలియన్ చేరారు. దీంతో పరుగులు ఈజీగా రాలేదు. ఈ మిడిల్ (తొమ్మిది) ఓవర్లలో సన్​రైజర్స్ 7.88 రన్​రేట్​తో 71 పరుగులు చేసింది.
  • ఇక డెత్ ఓవర్లలోనైనా పుంజుకుంటుందనుకుంటే బ్యాటర్లు నిరాశ పర్చారు. అదే సమయంలో పంజాబ్ బౌలర్లు పట్టుబిగించడంతో చివరి 5 ఓవర్ల (16 నుంచి 20)లో సన్​రైజర్స్​కు 43 పరుగులే వచ్చాయి. ఇందులో 33 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా 19వ ఓవర్లో అర్షదీప్ 8 రన్స్​ ఇవ్వగా, 20వ ఓవర్లో జేవియర్ ఐదు పరుగులే ఇచ్చాడు.

IPLలో అత్యధిక పవర్‌ప్లే స్కోర్లు

  • 125/0 - SRH vs DC, దిల్లీ, 2024
  • 107/0 - SRH vs LSG, హైదరాబాద్, 2024
  • 105/0 - SRH vs PBKS, ముల్లాన్‌పూర్, 2026
  • 105/0 - KKR vs RCB, బెంగళూరు, 2017
  • 100/2 - CSK vs PBKS, ముంబయి, 2014

ఉప్పల్​లో థ్రిల్లింగ్ మ్యాచ్- పోరాడి ఓడిన సన్​రైజర్స్- బోణీ కొట్టిన లఖ్​నవూ

ఉప్పల్​లో SRH VS LSG మ్యాచ్ - స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు