ETV Bharat / sports

రోహిత్ శర్మ @ 2026- దిగ్గజాల ఆల్​టైమ్ రికార్డ్స్​పై హిట్​మ్యాన్ కన్ను- ఇంకో 63 పరుగులే!

మరో రెండు రోజుల్లో బరిలోకి రోహిత్ శర్మ- కలీస్, షమీమ్ ఆమ్లా ఆల్​టైమ్ రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్!- 2026 రికార్డ్స్ లోడింగ్

Rohit Sharma 2026
Rohit Sharma 2026 (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : January 9, 2026 at 8:06 PM IST

2 Min Read
Choose ETV Bharat

Rohit Sharma 2026 : 2025 ఏడాదిని ఘనంగా ముగించిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కొత్త సంవత్సరంలో బరిలో దిగేందుకు రెడీ అయ్యాడు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్​లో హిట్​మ్యాన్ ఆడనున్నాడు. జనవరి 11న వడోదర వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తాజాగా వడోదరకు చేరుకున్నాడు. అయితే కొత్త ఏడాదిలో హిట్​మ్యాన్ పలు రికార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. అందులో ఒకట్రెండు ఘనతలు ఈ సిరీస్​లోనే సాధించే అవకాశం ఉంది. మరి ఆ రికార్డులు ఏంటంటే?

మూడో క్రికెటర్​గా నిలిచే ఛాన్స్
రోహిత్ శర్మ ఇప్పటిదాకా 279 వన్డే మ్యాచ్​ల్లో 49.21 సగటుతో 11516 పరుగులు చేశాడు. మరో 484 రన్స్​ చేస్తే వన్డేల్లో 12వేల పరుగుల క్లబ్​లో చేరతాడు. దీంతో ఈ మైలురాయి అందుకున్న భారత మూడో క్రికెటర్​గా రోహిత్ అరుదైన ఘనత ఖాతాలో వేసుకుంటాడు. భారత్​ నుంచి ఇప్పటిదాకా దిగ్గజం సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరే వన్డేల్లో ఈ మార్క్ అందుకున్నారు. ఓవరాల్​గా ఏడో బ్యాటర్​గా నిలుస్తాడు.

అలాగే మరో 224 పరుగులు చేస్తే, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ (11739 పరుగులు)ను అధిగమిస్తాడు. ఇంకో 63 పరుగులు చేస్తే సౌతాఫ్రికా దిగ్గజం జాక్ కలీస్ (11579 పరుగులు) ను దాటేస్తాడు. ఈ ఇద్దరినీ ఇదే సిరీస్​లో దాటేసే అవకాశం ఉంది.

100 ఫిఫ్టీల రికార్డు
ఇంటర్నేషనల్ వన్డే కెరీర్​లో హిట్​మ్యాన్ ఇప్పటిదాకా 96సార్లు 50+ స్కోర్లు నమోదు చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే మరో ఆరు 50+ స్కోర్లు నమోదు చేస్తే, వన్డే కెరీర్​లో 100సార్లు 50+ స్కోర్లు చేసిన బ్యాటర్​గా అరుదైన రికార్డు సాధిస్తాడు.

సిక్స్​ల మైల్​స్టోన్
వన్డే కెరీర్​లో రోహిత్ శర్మ ఇప్పటిదాకా 355 సిక్స్​లు బాదాడు. ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక సిక్స్​లు బాదిన బ్యాటర్​గా రోహిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే మరో 45 సిక్స్​లు బాదితే వన్డేల్లో 400 సిక్స్​ల మార్క్ అందుకున్న తొలి క్రికెటర్​గా నిలుస్తాడు.

దిగ్గజాల రికార్డుపై కన్ను!
18ఏళ్ల సుదీర్ఘ ఇంటర్నేషనల్ కెరీర్​లో రోహిత్ ఇప్పటిదాకా మూడు ఫార్మాట్లలో కలిపి 50 శతకాలు నమోదు చేశాడు. మరో ఈ లిస్ట్​లో పదో స్థానంలో ఉన్నాడు. క్రికెట్​లో దిగ్గజాలు బ్రియన్ లారా (53), మహేల జయవర్దనే (54), హషీమ్ ఆమ్లా (55)కు మరో 5 సెంచరీల దూరంలో ఉన్నాడు. ఈ ఏడాది ఇంకో 6 శతకాలు బాదితే వీళ్లను అధిగమించి ఏడో స్థానానికి దూసుకెళ్లే ఛాన్స్ ఉంది.

భారత్- న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్

మ్యాచ్తేదీవేదిక
తొలి వన్డే జనవరి 11వడోదర
రెండో వన్డేజనవరి 14 రాజ్​కోట్
మూడో వన్డేజనవరి 18ఇందౌర్


భారత్ వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్, అర్షదీప్ సింగ్, యశస్వీ జైస్వాల్

రోహిత్ శర్మ సూపర్ సెంచరీ- హిట్​మ్యాన్​ జపంతో హోరెత్తిన జైపుర్ స్టేడియం

న్యూజిలాండ్​తో వన్డే సిరీస్​కు భారత్ జట్టు ప్రకటన- పాండ్య, బుమ్రాకు నో ప్లేస్!