టీమ్ఇండియాలోకి స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ!- సిక్స్‌ల వీరుడు వచ్చేస్తున్నాడు
Rinku Singh Come Back : వరల్డ్‌కప్ వదిలి మధ్యలో వెళ్లిన రింకు సింగ్ - రిటర్న్ వచ్చేస్తున్నట్లు కోచ్ ప్రకటన- తదుపరి మ్యాచ్‌లో బరిలోకి!

Published : February 25, 2026 at 4:00 PM IST
Rinku Singh Come Back : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. సెన్సేషనల్ బ్యాటర్ రింకు సింగ్ మళ్లీ టీమ్ఇండియా జట్టుతో చేరనున్నాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల మంగళవారం జట్టును వీడిన రింకు బుధవారం సాయంత్రానికి భారత్ శిబిరంలో చేరనున్నట్లు బ్యాటింగ్ కోచ్ షితాన్షు కోటక్ వెల్లడించాడు.
కాగా, తన తండ్రి కంచన్చంద్ సింగ్ రీసెంట్గా అనారోగ్యానికి గురవ్వడంతో మంగళవారం రింకు సింగ్ జట్టును వీడాడు. ఆయనను గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో రింకు అత్యవరస పరిస్థితుల్లో వరల్డ్‌కప్ నుంచి మధ్యలోనే వెళ్లాల్సి వచ్చింది.
ఇక సూపర్ 8లో తదుపరి మ్యాచ్‌లో రింకు బరిలో దిగే ఛాన్స్ ఉంది. కాగా, గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీస్‌కు చేరాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్‌లో నెగ్గడం తప్పనిసరి!
— BCCI (@BCCI) February 14, 2026

