ETV Bharat / sports

ఇండోనేసియాపై శ్రీలంక ఘన విజయం - 7 వికెట్లతో చెలరేగిన చమరి అటపట్టు

ఆసియా కప్​లో లంక వరుసగా రెండో గెలుపు - చిత్తుగా ఓడిపోయిన ఇండోనేసియా

Sri Lanka Women vs Indonesia Women
శ్రీలంక- ఇండోనేసియా మహిళల క్రికెట్ (Source : Srilnaka Cricket 'x' Post)
author img

By ETV Bharat Sports Team

Published : September 2, 2026 at 11:08 PM IST

2 Min Read
Choose ETV Bharat

Sri Lanka Women vs Indonesia Women : 2026 మహిళల ఆసియా కప్​లో శ్రీలంక వరుసుగా రెండో విజయం నమోదు చేసింది. గ్రూప్​ బీలో బుధవారం ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్​లో లంక జట్టు 75 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. శ్రీలంక నిర్దేశించిన 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇండోనేసియా అందుకోలేకపోయింది. ఆ జట్టు 18.3 ఓవర్లలో 49 పరుగులు చేసి ఆలౌటైంది. లంక బౌలర్లలో కెప్టెన్ చమరి అతపట్టు 7, సుగంధిక కుమరి, కవిశ దిల్హారి తలో 1 వికెట్ పడగొట్టారు.

స్వల్ప ఛేదనను ఇండోనేసియా కాస్త మెరుగ్గానే ఆరంభించింది. 18 పరుగుల దాకా ఒక్క వికెట్ కోల్పోకుండా ఆడింది. 3.4 వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ చమరి రహ్మవతి (10)ని పెవిలియన్ చేర్చింది. తర్వాతి ఓవర్లోనే నీ లు దేవి () ఔఠ్ అయ్యింది. ఆ తర్వాత ఓవర్లో చమరి రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని తీవ్రంగా దెబ్బకొట్టింది. తొలి బంతికే మరియా (6)ను చమరి పెవిలియన్​కు పంపింది. రెండో బంతికి రాధా రాణ్ (0)ని ఔట్ చేసింది. దీంతో ఇండోనేసియా పవర్ ప్లే లోనే 21 పరుగులే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత లంక బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగులు చేయడం కష్టమైంది. ఆ తర్వాత ఇండోనేసియా ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక పరుగులు చేసేందుకు కష్టపడింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేయగలిగింది. ఇండోనేసియా బౌలర్లు అద్భుతంగా లంక బ్యాటర్లను కట్టడిచేశారు. నీలక్షికా సిల్వా (50 పరుగులు) మాత్రమే హాఫ్ సెంచరీ సాధించి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడింది. ఆ ఇన్నింగ్స్​తోనే లంక ఆ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. కెప్టెన్ చమరి (9 పరుగులు)తోపాటు స్టార్ బ్యాటర్లు హర్షిత సమరవిక్రమ (5 పరుగులు), ఓపెనర్ ఇమేషా దులానీ (3 పరుగులు), కవిషా దిల్హారీ (6 పరుగులు) విఫలమయ్యారు. ఇండోనేసియా బౌలర్లలో నీ లు దేవి 3, సంగ్ మైపిరాణి 2, ని కెడక్, సోఫియా తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

ఈ విజయం​తో లంక నాలుగు పాయింట్లతో గ్రూప్ బీలో టాప్​లో కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటిదాకా రెండు మ్యాచ్​లు ఆడిన ఇండోనేసియా రెండింట్లోనూ ఓడిపోయి పాయింట్ల ఖాతా తెరవలేదు.

శ్రీలంక తుది జట్టు
ఇమేషా దులానీ, చమరి అతపట్టు (కెప్టెన్), సంజన కవింది, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలక్షికా సిల్వా, కౌషని నుత్యంగన (వికెట్ కీపర్), సుగందికా కుమారి, చాముడి ప్రభోద, చేతన విముక్తి, కావ్య కావింది

ఇండోనేసియా తుదిజట్టు
మరియా కొరజోన్, రహ్మావతి పంగేస్తుతి, ని లుహ్ దేవి, ని పుటు ఆయు నంద సకారిణి (కెప్టెన్, వికెట్ కీపర్), ని కడెక్ ఫిత్రియా రాదా రాణి, దేశీ వులందారి, నీ మేడే పుత్రి సువాందీవి, సోఫియా వెలిక్, ని కడెక్ అరియాని, సంగ్ మేప్రియాని, దారా లక్ష్మీ పరమిత