ETV Bharat / sports

సౌతాఫ్రికా గ్రాండ్ విక్టరీ- చిత్తుగా ఓడిన వెస్టిండీస్​- టీమ్ఇండియా ఫ్యాన్స్ ఖుష్!

T20 World Cup : సూపర్ 8లో వరుసగా రెండో విజయం- సెమీ ఫైనల్​కు దగ్గరగా సౌతాఫ్రికా- చిత్తుగా ఓడిన వెస్టిండీస్

West Indies vs South Africa
West Indies vs South Africa (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : February 26, 2026 at 6:17 PM IST

3 Min Read
Choose ETV Bharat

West Indies vs South Africa : సూపర్ 8లో వరుసగా రెండో విజయంతో సౌతాఫ్రికా సెమీఫైనల్​కు మరింత దగ్గరైంది. అహ్మదాబాద్​ వేదికగా వెస్టిండీస్​తో జరిగిన ఈ మ్యాచ్​లో సఫారీలు 9 వికెట్ల తేడాతో నెగ్గారు. విండీస్ నిర్దేశించిన 177 పరుగులు టార్గెట్​ను సౌతాఫ్రికా 1 వికెట్ కోల్పోయి 16.1 ఓవర్లలోనే ఛేదించింది. ఎయిడెన్ మార్​క్రమ్ (82 పరుగులు), డికాక్ (47 పరుగులు), ర్యాన్ రికెల్​టన్ (45 పరుగులు) రాణించారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్​ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

ఓ మోస్తారు ఛేదన​ను సౌతాఫ్రికా ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు మార్​క్రమ్ (82), క్వింటన్ డికాక్ (47 పరుగులు, 24 బంతుల్లో) జెట్ స్పీడ్​తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీళ్ల విధ్వంసానికి సౌతాఫ్రికా పవర్​ప్లేలోనే వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. ఆ తర్వాత జోరు కొనసాగింది. అయితే ఎనిమిదో ఓవర్ ఛేజ్ బౌలింగ్​లో ఆఖరి బంతికి డికాక్ ఔటయ్యాడు. దీంతో తొలి వికెట్​కు 95 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాతి ఓవర్లోనే మార్​క్రమ్ హాఫ్ సెంచరీ (27 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చి రికెల్​టన్​ అదే జోరును కొనసాగించాడు. మార్​క్రమ్​తో కలిసి రెండో వికెట్​కు అజేయంగా 71 పరుగులు జోడించాడు.

పడి లేచిన విండీస్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఆరు ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయిన విండీస్ ఇంతటి స్కోర్ చేసిందంటే అందుక్కారణం జేసన్ హోల్డర్ (49 పరుగులు, 31 బంతుల్లో), రొమారియో షెపర్డ్ (52* పరుగులు, 37 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్సే. ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (21 పరుగులు, 11 బంతుల్లో, 5 ఫోర్లు), షాయ్ హోప్ (16 పరుగులు, 6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్​లు) మెరుపు ఆరంభం ఇచ్చారు. అయితే కగిసో రబాడా మూడో ఓవర్లో హోప్, హెట్​మయర్ (2)ను ఔట్ చేసి దెబ్బ కొట్టాడు.

ఆదుకున్న ఆ ఇద్దరు
ఆ తర్వాత విండీస్ వరుసగా కింగ్, రోస్టన్ ఛేజ్ (2), షేర్ఫేన్ రూథర్​ఫోర్డ్ (12), రోవ్​మన్ పావెల్ (9), మ్యాథ్యూ ఫోర్డ్ (11) పెవిలియన్​కు క్యూ కట్టారు. దీంతో 10.2 ఓర్లకు విండీస్ 83-7 స్కోర్​తో నిలిచింది. ఈ దశలో హోల్డర్, షెపర్డ్ జట్టును ఆదుకున్నారు. అసాధారణ ప్రదర్శనతో ఎనిమిదో వికెట్​కు 89 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే షెపర్డ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే హోల్డర్​ రనౌట్ అయ్యాడు. దీంతో ఆఖర్లో స్కోర్ వేగం తగ్గింది. చివరి రెండు ఓవర్లలో విండీస్​కు 13 పరుగులే వచ్చాయి. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగ్డి 3, కార్బిన్ బోష్, కగిసో రబాడా చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.

T20 వరల్డ్​కప్​ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు

  • 303 పరుగులు - బాబర్ అజామ్ (2021)
  • 264 పరుగులు - ఎడెన్ మార్​క్రమ్ (2026)
  • 257 పరుగులు - రోహిత్ శర్మ (2024)
  • 225 పరుగులు - జోస్ బట్లర్ (2022)
  • 216 పరుగులు - కేన్ విలియమ్సన్ (2021)

టీమ్ఇండియా ఫ్యాన్స్ ఖుషీ!
తాజా విజయంతో సౌతాఫ్రికా గ్రూప్ 1 నుంచి సెమీస్​కు అవకాశాలు మెరుగుపర్చుకుంది. ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచ్​ల్లో రెండు విజయాలతో నాలుగా పాయింట్లు (+2.890) టాప్​లో ఉంది. తమ ఆఖరి మ్యాచ్​లో జింబాబ్వేను డీ కొట్టాల్సి ఉంది. ఆ మ్యాచ్​లో ఓడినా సఫారీలకు ఛాన్స్ ఉంటుంది. ఇక భారత్, వెస్టిండీస్, జింబాబ్వే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఇప్పుడు విండీస్ ఓడడంతో భారత్​కు అవకాశాలు కాస్త మెరుగయ్యాయి. తమ తదుపరి రెండు మ్యాచ్​ (జింబాబ్వే, వెస్టిండీస్)ల్లో గెలిస్తే ఇలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా నేరుగా సెమీస్​కు అర్హత సాధించవచ్చు!