T20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ : సఫారీలపై కివీస్‌దే డామినేషన్- కానీ ఈసారి హిస్టరీ మారే ఛాన్స్!
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్ - దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ - ఫైనల్‌కు దూసుకెళ్లేదెవరో?

Published : March 3, 2026 at 11:01 PM IST
SA vs NZ IPL 2026 : 2026 టీ20 ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. టోర్నమెంట్‌లో తొలి సెమీఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో నెగ్గి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ఈ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఇప్పటివరకు రెండు జట్ల ప్రయాణం ఎలా సాగింది? ఎవరి బలం ఎంటో తెలుసుకుందాం!
దక్షిణాఫ్రికా నిలకడగా!
ఈ టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా అద్భుతంగా రాణిస్తోంది. గ్రూప్ దశతోపాటు సూపర్ 8లోనూ ఇప్పటిదాకా ఓటమి అనేది లేకుండా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కీలకమైన సూపర్ 8లో మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్ 1లో అగ్రస్థానం దక్కించుకుంది. అలాగే గ్రూప్ దశలో ఇప్పటికే కివీస్‌తో సఫారీ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. రేపటి మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం సఫారీలు భావిస్తున్నారు. ఈ జట్టులో కెప్టెన్ మార్‌క్రమ్‌తోపాటు డికాక్, రికిల్టన్, డివాల్డ్ బ్రేవిస్, మిల్లర్, బోష్, ఎంగ్డి, రబాడా కీలక ఆటాగాళ్లు.
మరోవైపు, సూపర్ -8 దశలో న్యూజిలాండ్ ఒక్కటంటే ఒకే మ్యాచ్‌లో గెలిచినప్పటికీ మెరుగైన్ రన్‌రేట్ ఉండడంతో సెమీస్‌లోకి దూసుకొచ్చింది. అయితే జోరుమీదున్న దక్షిణాఫ్రికాను ఆపడం మాత్రం కివీస్‌కు పెద్ద సవాలే. కానీ శాంట్నర్, ఫిన్ అలెన్, రచిన్, డారిల్ మిచెల్‌తో జట్టు బలంగానే కనిపిస్తుంది. కాష్టపడితే సౌతాఫ్రికాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక 2021 ఎడిషన్ తర్వాత తొలిసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవాలని కివీస్ కలలు కంటోంది.
𝐀𝐧𝐝 𝐭𝐡𝐞𝐧 𝐭𝐡𝐞𝐫𝐞 𝐰𝐞𝐫𝐞 𝐟𝐨𝐮𝐫 🤩
— ICC (@ICC) March 1, 2026
The #T20WorldCup 2026 semi-finals are locked 🔒
More details➡️ https://t.co/0UKXfuke7c pic.twitter.com/IxJeZvr5M3
హెడ్ టు హెడ్ రికార్డ్
దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్ ఇప్పటివరకు మొత్తం 19 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో దక్షిణాఫ్రికాదే పైచేయిగా ఉంది. అత్యధికంగా 12 మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా గెలిచింది. అటు న్యూజిలాండ్ కేవలం 7 మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. అయితే న్యూజిలాండ్ - దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో తలపడటం మాత్రం ఇదే మొదటిసారి.
అందులో కివీస్‌దే పైచేయి
కాగా, ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఐసీసీ టోర్నమెంట్‌ల్లో మూడుసార్లు నాకౌట్ మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికాకు పేలవమైన రికార్డు ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఎప్పుడూ గెలవలేదు. అందుకే ఈసారి నెగ్గి కొత్త చరిత్ర సృష్టించాలని సఫారీలు ఆశిస్తున్నారు. న్యూజిలాండ్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి ఐసీసీ నాకౌట్ మ్యాచ్ 2011 వన్డే ప్రపంచ కప్‌లో జరిగింది. అది క్వార్టర్ ఫైనల్. ఢాకాలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను న్యూజిలాండ్ 49 పరుగుల తేడాతో ఓడించింది.
New Zealand have had the edge over South Africa in ICC tournament knockouts 👀
— T20 World Cup (@T20WorldCup) March 3, 2026
Who will emerge victorious in the #T20WorldCup 2026 semi-final 🤔
Tune in to watch LIVE action, broadcast details 👉 https://t.co/Wf4VaE4pSJ pic.twitter.com/rKJBP9Cvmd
ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో కివీస్ - సఫారీ తలపడ్డాయి. ఆక్లాండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక గతేడాది 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్‌లోనూ ఇరు జట్లు మూడోసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కూడా దక్షిణాఫ్రికాను న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఓడించింది. అలా ఐసీసీ టోర్నీల్లో నాకౌట్లో మూడుకు మూడుసార్లు కివీసే నెగ్గింది.
మ్యాచ్ ఎప్పుడు, ఎప్పుడు జరుగుతుంది?
ఈ తొలి సెమీఫైనల్ మ్యాచ్ భారత సమయం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మ్యాచ్ ప్రారంభానికి 30 నిమిషాల ముందు, అంటే సాయంత్రం 6:30 గంటలకు పడుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది. అలాగే జియో హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్కీమింగ్ చూడొచ్చు!

