ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా- 44 రోజుల్లోనే భారత్ రికార్డ్ బ్రేక్

అరుదైన ఘతన సాధించిన సౌతాఫ్రికా- భారత్ రికార్డ్ బద్దలు

World Record
World Record (Representative Image (AP News))
author img

By ETV Bharat Sports Team

Published : November 10, 2025 at 1:21 PM IST

3 Min Read
Choose ETV Bharat

South Africa Breaks India World Record : సౌతాఫ్రికా ఏ జట్టు వరల్డ్​ రికార్డ్ సృష్టించింది. భారత్ ఏతో తాజాగా జరిగిన నాలుగు రోజుల అనధికార టెస్టులో సఫారీ జట్టు ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్​లో 416 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగిన బవూమా సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే భారత్ 44 రోజుల కిందట క్రియేట్ చేసిన రికార్డును సౌతాఫ్రికా బద్దలు కొట్టింది.

సౌతాఫ్రికా వరల్డ్ రికార్డ్!
నవంబర్ 06న బెంగళూరు వేదికగా సౌతాఫ్రికా ఏ- భారత్ ఏ జట్ల మధ్య రెండో అనధికార టెస్టు మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఈ మ్యాచ్​లో భారత్ ఏ రెండు ఇన్నింగ్స్​ల్లో వరుసగా (225- 10, 382- 7d) స్కోర్లు నమోదు చేసింది. ఇక సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్​లో 221 రన్స్​కే ఆలౌట్ అయ్యింది. అయితే 416 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా పుంజుకుంది. నిలకడగా ఆడిన సౌతాఫ్రికా బ్యాటర్లు ఏకంగా ఐదుగురు అర్థ శతకాలు నమోదు చేశారు.

ఓపెనర్లు జోర్దన్ హెర్మన్ (91 పరుగులు), లెసిగొ సెనోక్​వానే (77 పరుగులు) మంచి ఆరంభం ఇవ్వగా, హంజా (77 పరుగులు), టెంబ బవూమా (59 పరుగులు), కానోర్ (52 పరుగులు) రాణించారు. దీంతో లక్ష్యాన్ని సౌతాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా రికార్డు క్రియేట్ చేసింది.

44 రోజుల్లోనే బ్రేక్!
ఈ ఛేదనతో బవూమ సేన భారత్ రికార్డ్​ను బ్రేక్ చేసింది. 'ఏ' జట్ల టెస్టు మ్యాచ్​ల్లో నాలుగో ఇన్నింగ్స్​లో ఛేజ్ చేసిన అత్యధిక లక్ష్యం ఇదే కావడం విశేషం. ఇదివరకు ఈ రికార్డు భారత్ ఏ జట్టుపై ఉండేది. 44 రోజుల కిందటే ఆస్ట్రేలియా ఏ జట్టుపై భారత్ ఏ ఈ ఘనత సాధించింది. 413 పరుగుల టార్గెట్​ను విజయవంతంగా ఛేదించి ఈ రికార్డ్ కొట్టింది. 44 రోజుల్లోనే ఈ రికార్డును సౌతాఫ్రికా బ్రేక్ చేసింది. కాగా, ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి అనధికార టెస్టులో భారత్ ఏ నెగ్గింది. 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • నాలుగో ఇన్నింగ్స్​లో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన 'ఏ' జట్లు
  • సౌతాఫ్రికా ఏ- 417 పరుగులు vs భారత్ ఏ (2025)
  • భారత్ ఏ - 413 పరుగులు vs ఆస్ట్రేలియా ఏ (2025)
  • ఆస్ట్రేలియా ఏ- 367 పరుగులు vs శ్రీలంక ఏ (2022)
  • వెస్టిండీస్ ఏ - 365 పరుగులు vs ఇంగ్లాండ్ ఏ (2006)
  • న్యూజిలాండ్ ఏ - 365 పరుగులు vs ఆస్ట్రేలియా ఏ (2003)

ప్రస్తుతం భారత్ పర్యనటలో ఉన్న సౌతాఫ్రికా ఇక్కడ రెండు టెస్టు, మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్​ల సిరీస్​లు ఆడనుంది. నవంబర్ 14న కోల్​కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్​కు భారత్ ఇప్పటికే జట్టును ప్రకటించింది. శుభ్​మన్ గిల్ సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది.

సౌతాఫ్రికా టెస్టు సిరీస్​కు భారత్ జట్టు : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్.

467 వికెట్లు తీసిన బౌలర్​కు టీమ్ఇండియాలో నో ప్లేస్- ఇక రిటైర్మెంటేనా?

11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ- వరుసగా 8 సిక్స్​లు- వరల్డ్ రికార్డ్ కొట్టిన భారత బ్యాటర్