ETV Bharat / sports

జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం

ఐదు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం- 5 వికెట్లను కోల్పోయి 154 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా

South Africa
South Africa (AP)
author img

By ETV Bharat Sports Team

Published : March 1, 2026 at 6:50 PM IST

1 Min Read
Choose ETV Bharat

South Africa Vs Zimbabwe : టీ20 ప్రపంచ కప్​లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో జింబాబ్వేపై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. దీంతో గ్రూప్ -1 నుంచి అగ్రస్థానంతోనే సఫారీ జట్టు సెమీస్‌లో అడుగు పెట్టింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 154 పరుగులు చేసింది.