చరిత్ర సృష్టించిన సొనాల్ దినుష- 67ఏళ్ల తర్వాత భారత్‌పై ఆ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా రికార్డు
భారత్‌తో రెండో టెస్టు - బ్యాటింగ్‌తో అదరగొట్టిన సొనాల్ దినుష- 25ఏళ్లకే టెస్టుల్లో రేర్ రికార్డు సాధించిన లంక ఆల్రౌౌండర్

Published : August 27, 2026 at 3:42 PM IST
Ind vs SL Test 2026 : కొలంబో టెస్టులో భారత్‌పై ఆతిథ్య శ్రీలంక జట్టు పట్టు వదలకుండా పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్‌లో ఆడుతున్న లంక, మ్యాచ్‌ను డ్రా చేసుకునే దిశగా తీసుకెళ్తుంది. ముఖ్యంగా లంక ఆల్‌రౌండర్ సొనాల్ దినుష అద్భుతంగా పోరుడుతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు సెంచరీ సాధించాడు. అజేయంగా 133 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సొనాల్ టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. భారత్‌పై 67ఏళ్ల తర్వాత సెన్సేషనల్ ఫీట్ సాధించాడు. ఇంతకీ అదేంటంటే?
67 ఏళ్ల తర్వాత రేర్ రికార్డు
భారత్‌తో జరుగుతున్న ఈ సిరీస్‌లో 25ఏళ్ల శ్రీలంక ఆల్ రౌండర్ సోనల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ వరుసగా 50కి పైగా పరుగులు సాధించాడు. రీసెంట్గా గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో అతడు వరుసగా 100, 84 స్కోర్లు సాధించాడు. ఆ తర్వాత ప్రస్తుతం కొలంబో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న రెండో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు 103 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో ఐదో రోజు బ్యాటింగ్‌లో మరో శతకం బాదేశాడు. దీంతో, గడిచిన 67ఏళ్లలో టెస్టు క్రికెట్‌లో భారత్‌పై వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లలో 50కి పైగా పరుగులు చేసిన క్రికెటర్‌గా సొనాల్ రికార్డు కొట్టాడు.
Back-to-Back Test Centuries! 🔥🏏
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 26, 2026
Sonal Dinusha does it again! 💯💯
From Galle to Colombo, the century streak continues! What a player! 🇱🇰#SonalDinusha #SriLankaCricket #SLvIND #BackToBackCenturies pic.twitter.com/0P3UybMcbe
ఓవరాల్‌గా నాలుగో ప్లేయర్‌గా!
గతంలో ఇంగ్లాండ్ ఆటగాడు డగ్లస్ జార్డిన్ 1932- 34లో తొలిసారి భారత్‌పై ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌కు చెందిన క్లైడ్ వాల్కాట్ 1948లో ఈ రికార్డును నెలకొల్పారు. చివరగా 1959లో ఇంగ్లాండ్‌కు చెందిన కెన్ బారింగ్టన్ భారత్‌పై ఈ ఘనతను సాధించాడు. ఆ తర్వాత గడిచిన 67ఏళ్లలో ఏ బ్యాటర్ కూడా టీమ్ఇండియాపై టెస్టుల్లో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 50+ రన్స్ చేయలేదు. తాజాగా 25ఏళ్ల సోనల్ దినుష ఈ ఫీట్ సాధించి అరుదైన జాబితాలో చేరాడు.
Sonal Dinusha Test Career : గతేడాది బంగ్లాదేశ్‌పై సొనాల్ టెస్టు అరంగేట్రం చేశాడు. అయితే ఆ సిరీస్‌లో పెద్దగా రాణించలేదు. కానీ ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 92, 43 స్కోర్లు నమోదు చేశాడు. దీంతో భారత్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇక ఈ సిరీస్‌లో అతడు ప్రతిభను చాటుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 420 పరుగులు చేసి సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండడం విశేషం. ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇక ఓవరాల్‌గా సొనాల్ ఇప్పటిదాకా 5 టెస్టుల్లో 86.57 యావరేజ్‌తో 606 పరుగులు చేశాడు.
తుది జట్లు
భారత్ - యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సారాంశ్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
శ్రీలంక - లహిరు ఉదర, కమిల్ మిషారా, పసిందు సూర్యబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), సోనాల్ దినుష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో
సెహ్వాగ్, ద్రవిడ్ వారసులకు బిగ్ ఛాన్స్- అండర్ 19 టీమ్‌లో చోటు- సత్తా చాటుతారా?

