ETV Bharat / sports

ట్రేడింగ్​లో ముంబయికి స్టార్ ప్లేయర్లు- మరి అర్జున్ తెందుల్కర్​ను వదిలేసినట్లేనా?

ఐపీఎల్ ట్రేడింగ్- ముంబయిలోకి స్టార్ ప్లేయర్లు- అర్జున్ సంగతేంటి?

Mumbai Indians IPL 2026
Mumbai Indians IPL 2026 (Source : ANI)
author img

By ETV Bharat Sports Team

Published : November 14, 2025 at 10:11 AM IST

2 Min Read
Choose ETV Bharat

Mumbai Indians IPL 2026 : 2026 ఐపీఎల్ సందడి మొదలైపోయింది. ఆయా జట్లు ట్రేడింగ్​లో ఎవరిని తీసుకోవాలి? పర్స్ వ్యాల్యూ ఎంత మిగిలి ఉంది? అనే లెక్కలేసుకుంటున్న సమయంలో స్టార్ జట్టు ముంబయి ఇండియన్స్ ట్రేడింగ్ డీల్స్ షురూ చేసేసింది. జట్టులోకి ఇద్దరు పవర్​ఫుల్ ప్లేయర్లను తీసుకుంది. ఈ విషయాన్ని ముంబయి అధికారికంగా ప్రకటించింది. దీంతో ముంబయి అభిమానుల్లో జోష్ పెరిగింది.

పేస్​లో బలం!
ముంబయి ముందుగా స్టార్ పేసర్ శార్దూల్ ఠాకూర్​ను జట్టులోకి తీసుకుంది. ఈ పేసర్​ కోసం లఖ్​నవూ సూపర్ జెయింట్స్​తో రూ.2 కోట్లకు ట్రేడ్​ ఒప్పందం కుదుర్చుకుంది. శార్దూల్ బౌలింగ్​తోపాటు జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటింగ్ కూడా చేయలగడు. ఇది కలిసొచ్చే అంశం. అయితే ముంబయి ఈ ట్రేడింగ్​లో అర్జున్ తెందుల్కర్​ను ఇచ్చేసి, శార్దూల్​ను తీసుకోనుందని మొదట్లో వార్తలు వినిపించాయి. కానీ, ఇప్పటికైతే ఈ డీల్​కు సంబంధించి షరతులు బయటకు రాలేదు.

మరి అర్జున్ ముంబయిలోనే ఉంటాడా? లేదా రూ.2 కోట్లతో పాటు అర్జున్​ను ఇచ్చేందుకు డీల్ కుదిరిందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే గత వేలంలో శార్దూల్​ను లఖ్​నవూ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అంతే మొత్తానికి ముంబయి తీసుకుంది. 2025 సీజన్​లో శార్దూల్ 10 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్​గా ఐపీఎల్​లో 105 మ్యాచ్​లు ఆడిన ఠాకూర్ 107 వికెట్లు పడగొట్టి, 325 పరుగులు చేశాడు. అయితే గతంలోనూ శార్దూల్ ముంబయిలో ఆడాడు.

భీకర బ్యాటర్!
శార్దూల్ ఠాకూర్ ట్రేడింగ్‌ అనౌన్స్​చేసిన నిమిషాల్లోనే ముంబయి రెండో డీల్ గురించి ప్రకటన చేసింది. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రూథర్‌ఫోర్డ్‌ను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ నుంచి ట్రేడింగ్ చేసుకుంది. రూ.2.6 కోట్ల ధరకు ముంబయి డీల్ క్లోజ్ చేసింది. 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున రూథర్‌ఫోర్డ్‌ 13మ్యాచ్‌ల్లో 291 పరుగులు చేశాడు. గతంలోనూ రూథర్‌ఫోర్డ్‌ ముంబయి ఇండియన్స్​లో ఆడాడు.

ఈ క్రమంలో రూథర్‌ఫోర్డ్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ హిస్టరీలో రెండుసార్లు ట్రేడింగ్ అయిన తొలి ఫారిన్ ప్లేయర్​గా రికార్డు కొట్టాడు. గతంలో 2020లో దిల్లీ క్యాపిటల్స్ నుంచి ముంబయే అతడిని ట్రేడ్ చేసుకుంది. 2020లో ముంబయి ఛాంపియన్​గా నిలిచిన జట్టులో రూథర్‌ఫోర్డ్‌ సభ్యుడే. ఈ రెండు డీల్స్​తో ముంబయి జట్టును బ్యాలెన్స్ చేసుకుంది. వేలంలో మరింత మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే ఆలోచనలోనూ ఉంది!

త్వరలోనే ఈ డీల్ కూడా!
అలాగే కొన్ని రోజులుగా సంజు శాంసన్- రవీంద్ర జడేజా ప్లేయర్ల కోసం రాజస్థాన్, చెన్నై జట్ల మధ్య భారీ ట్రేడింగ్ జరగొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. రాజస్థాన్​కు జడేజాను ఇచ్చేసి, శాంసన్​ను జట్టులోకి తీసుకునేందుకు చెన్నై ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గత ఐపీఎల్​ మెగావేలానికి ముందు ఈ ఇద్దరు ప్లేయర్లను ఆయా జట్లు రూ.18 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకున్నాయి. ఒకవేళ ఈసారి ఈ ట్రేడ్ జరిగితే ఐపీఎల్ చరిత్రలో ఇదే ఖారీదైన డీల్ కానుంది! కానీ, శాంసన్ కోసం జడ్డూను వదులుకునే సాహసం చెన్నై చేస్తుందా? అనేది చూడాలి.

ముంబయిని వీడి KKRకు వెళ్లనున్న రోహిత్ శర్మ?- 'అది మాత్రం కన్ఫార్మ్' అంటూ MI రిప్లై

'నేను మర్చిపోను!'- మ్యాచ్ తర్వాత నీతా అంబానీ పనికి నెటిజన్లు ఫిదా