ETV Bharat / sports

షణ్ముక 'చార్​మార్'- నల్గొండను బెంబేలెత్తించిన హైదరాబాద్ బౌలర్లు

హైదరాబాద్ vs నల్గొండ మ్యాచ్- తొలి ఇన్నింగ్స్ కంప్లీట్- హాఫ్ సెంచరీతో రాణించిన వరుణ్

Hyderabad vs  Nalgonda
Hyderabad vs Nalgonda (Source : Source : ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : July 6, 2026 at 9:08 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad vs Nalgonda TG 20 : ఉప్పల్ వేదికగా హైదరాబాద్​ ఈ ఛాంపియన్స్​తో జరుతున్న మ్యాచ్​లో అనురాగ్ నల్గొండ నైట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. వరుణ్ గౌడ్ (53 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓపెనర్లు జశ్వంత్ (36), గౌరవ్ (25) ఫర్వాలేదనిపించారు. చివరలో హర్షవర్ధన్ సింగ్ (23 పరుగులు, 11 బంతుల్లో) ధనాధన్ ఇన్నింగ్స్​తో మెరిశాడు. షణ్ముక అశ్విన్ 4 వికెట్లు కూల్చి నల్గొండ పతనాన్ని శాసించాడు. అజయ్ దేవ్, ప్రణవ్ వర్మ చెరో 2, అఖిల్ రాథోడ్ 1 వికెట్ దక్కించుకున్నారు.

రెచ్చిపోయిన హైదరాబాద్ బౌలర్లు
టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన నల్గొండకు మంచి ఆరంభమే దక్కింది. ఆ జట్టు తొలి నాలుగు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే ప్రణవ్ వర్మ దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ గౌరవ్ రెడ్డి (25)ని ఔట్ చేశాడు. దీంతో 42 పరుగుల వద్ద నల్గొండ తొలి వికెట్ కోల్పోయింది. ఇక పవర్ ప్లే ముగిసిన తర్వాత 6.1 వద్ద నితీశ్ రెడ్డి (7)ని షణ్ముక అశ్విన్ పెవిలియన్​కు పంపాడు. కాసేపటికి 8.1వద్ద షణ్ముక ఇంకో వికెట్ తీశాడు. అతడు జశ్వంత్​ను ఔట్ చేశాడు.

ఇక జట్టు స్కోర్ 100 పరుగులు దాటిన తర్వాత నల్గొండ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. 11.6 వద్ద రాహుల్​ను ప్రణవ్, 14.2 ఓవర్ వద్ద దివేశ్​ను అజయ్ పెవిలియన్​కు చేర్చారు. దీంతో నల్గొండ 116-5తో నిలిచింది. తర్వాత దేవ్ వేసిన 16వ ఓవర్లో వరుణ్ గౌడ్ చెలరేగాడు. 2 సిక్స్​లు, 2 ఫోర్లతో ఈ ఓవర్లో 23 పరుగులు రాబట్టాడు. దీంతో మెరుగైన స్థితిలో ఉన్నట్లు కనిపించిన నల్గొండను షణ్ముక తర్వాతి ఓవర్లోనే రెండు వికెట్లతో దెబ్బకొట్టాడు. దీంతో 154-7తో నిలిచింది. ఆ తర్వాత అజయ్, అఖిల్ ఒక్కో వికెట్ తీశారు. అయితే చివర్లో హర్షవర్ధన్ చెలరేగడంతో నల్గొండకు పోరాడగలిగే స్కోర్ దక్కింది.

హైదరాబాద్ తుది జట్టు
అభిరత్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, వైష్ణవ్ రెడ్డి ఎ (వికెట్ కీపర్), గడుగు గణేశ్, అన్విత్ రెడ్డి, ప్రణవ్ వర్మ, పి అరవింద్, అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్

నల్గొండ తుది జట్టు
జశ్వత్ మోతే, గౌరవ్ రెడ్డి, పాట్కూరి నితీష్ రెడ్డి, రాహుల్ బుద్ధి (కెప్టెన్), అనికేత్ రెడ్డి, హర్షవర్ధన్ సింగ్ (వికెట్ కీపర్), అర్ఫాజ్ అహ్మద్ మహ్మద్, దివేష్ సింగ్, వరుణ్ గౌడ్, ఇల్యాన్ సతాని, శరణు నిశాంత్