ETV Bharat / sports

తొలి రౌండ్​లోనే జకోవిచ్​కు భారీ షాక్ - US ఓపెన్​ నుంచి ఔట్

యూఎస్ ఓపెన్​లో సంచలనం - నొవాక్ జకోవిచ్​ను తొలి రౌండ్​లోనే ఓడించిన 25ఏళ్ల మారియానో

Novak Djokovic
నొనాక్ జకోవిచ్ (ఫైల్) (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : August 31, 2026 at 3:05 PM IST

2 Min Read
Choose ETV Bharat

Novak Djokovic US Open 2026 : 2026 యూఎస్ ఓపెన్​లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్​కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలి రౌండ్​లో అసలు సీడింగే లేని అర్జెంటీనా ఆటగాడు మారియానో ​​నావోన్​ను ఢీ కొట్టిన జకోవిచ్​కు ఓటమి ఎదురైంది. నాలుగో సీడ్ జకోవిచ్‌ను 7-6, 5-7, 6-4, 2-6, 6-1 తేడాతో ఓడించి మారియానో సంచలనం సృష్టించాడు. దీంతో రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్​స్లామ్ టైటిల్ నెగ్గాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన నొవాక్ జకోవిచ్​కు తొలి రౌండ్​లో పరాభవం ఎదురైంది. దీంతో భారీ అంచనాలతో బరిలోకి దిగిన జకోవిచ్ టోర్నీ నుంచి ​ నిష్క్రమించాడు.

ప్రత్యర్థితో పోరాటం
ఆర్థర్ యాష్ స్టేడియంలో జకోవిచ్‌ - నావోన్ మారియానో మధ్య ఈ మ్యాచ్​ దాదాపు నాలుగు గంటల పాటు సాగింది. అయితే ఇందులో మారియానోనే పైచేయిగా సాగింది. తొలి రౌండ్​లోనే జకోవిచ్​పై 7-6తో నెగ్గి మారియానో షాకిచ్చాడు. ఆ తర్వాత రౌండ్​లో జకోవిచ్​ అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా రెండు సెట్లు 5-7, 6-4 తేడాతో దక్కించుకున్నాడు. దీంతో జకోవిచ్ ఫామ్​లోకి వచ్చాడని అంతా భావించారు. ఈ క్రమంలోనే జకోవిచ్​ ఫిజికల్​గా ఇబ్బంది పడ్డాడు.

వేడితో జకోవిచ్ ఇబ్బందులు
న్యూయార్క్ నగరంలోని తీవ్రమైన వేడి అతడికి సవాలుగా మారింది. తీవ్రమైన వేడి కారణంగా జకోవిచ్ తలపై పదేపదే ఐస్ ప్యాక్ పెట్టుకొని ఉపశమనం పొందాడు. ఈ క్రమంలో జకోవిచ్ కోర్టులోనే పలుమార్లు వాంతి చేసుకున్నాడు. ఫిజియో, వైద్య బృందం చికిత్స అందించడంతో కోలుకుని తిరిగి ఆటను కొనసాగించాడు. కానీ అతడి ప్రత్యర్థి మారియానో కూడా ఊహించని రేంజ్​లో కమ్​బ్యాక్ ఇచ్చాడు. నాలుగో రౌండ్​లో ఏకంగా 6-2 తేడాతో జకోవిచ్​ను ఓడించాడు. దీంతో మ్యాచ్‌ను నిర్ణయాత్మకమైన ఐదో సెట్‌కు వెళ్లింది.

చివరి సెట్‌లో కన్నీటి పర్యంతమైన జకోవిచ్
నిర్ణయాత్మక చివరి సెట్‌లో జకోవిచ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నావోన్ 4-1 ఆధిక్యంతో విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించినప్పుడు, జకోవిచ్ కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యాడు. జొకోవిచ్ అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకున్న నవోన్, ఐదో సెట్‌ను 6-1 తేడాతో సులభంగా గెలిచి తన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేశాడు.

కాగా, 2006 తర్వాత గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లో జకోవిచ్ తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఈ ఓటమితో యూఎస్ ఓపెన్‌లో జిమ్మీ కానర్స్ పేరిట ఉన్న 98 విజయాల రికార్డును అధిగమించాలనే లక్ష్యం కూడా అందుకోలేకపోయాడు.

జకోవిచ్ ఇంటిబాట పట్టడంతో ఈ టోర్నీలో డిఫెండిగ్ ఛాంపియన్​గా బరిలోకి దిగిన కార్లోజ్ అస్కరాస్​కు ట్రోఫీ నిలబెట్టుకోవడం మరింత ఈజీగా మారింది. పోటీ ప్రారంభానికి ముందే అతడికి గట్టి ప్రత్యర్థి అని భావించిన జనిక్ సినర్ తప్పుకున్నాడు. ఇప్పుడు జకోవిచ్ కూడా టోర్నీ నుంచి బయటకు వెళ్లాడు. ఇకపై ప్రస్తుత పోటీలో అల్కరాస్​కు జ్వెరెవ్, మెద్వెదెవ్ మాత్రమే చెప్పుకోదగ్గ పోటీదారులు అని చెప్పవచ్చు. మరి ఈ పరిస్థితులు అల్కరాస్​కు ఎంతమేర కలిసొస్తాయో చూడాలి

క్రికెటర్ల వసతి సౌకర్యాలపై BCCI అభ్యంతరం- మౌనం వీడిన ఆసియా క్రీడల నిర్వాహకులు - ఏమన్నారంటే?

మహిళల​ ఆసియా కప్​: థాయిలాండ్​పై 94 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం