ETV Bharat / sports

వరల్డ్​కప్​లో ఫెయిల్ - శ్రీలంక హెడ్​కోచ్ సంచలన నిర్ణయం

టీ20 వరల్డ్​కప్​ నుంచి శ్రీలంక ఔట్- కోచ్ పదవి నుంచి వైదొలగిన జయసూర్య

Sanath JayasuriyaSanath Jayasuriya
Sanath Jayasuriya (Source : ANI)
author img

By ETV Bharat Sports Team

Published : March 1, 2026 at 11:35 AM IST

3 Min Read
Choose ETV Bharat

Sanath Jayasuriya Coach : సొంతగడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్​కప్​లో శ్రీలంక సెమీఫైనల్​కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో ఆ జట్టు హెడ్​కోచ్, మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. అయితే జయసూర్య పదవీకాలం ఈ ఏడాది జూన్ ​దాకా ఉంది.

'శ్రీలంక జట్టుకు కోచ్​గా నా కాంట్రాక్ట్ 2026 జూన్ వరకు ఉంది. అయినప్పటికీ ఈ పదవిలో కొనసాగే ఉద్దేశం నాకు లేదు. జట్టు బాధ్యతలను ఇంకొకరికి అప్పగించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నా' అని పాకిస్థాన్​తో మ్యాచ్ అనంతరం జయసూర్య వెల్లడించాడు. అయితే తక్షణమే సూర్య జట్టుకు దూరమయ్యే అవకాశం లేదు. అఫ్గానిస్థాన్​తో మార్చి రెండో వారంలో శ్రీలంక టీ20, వన్డే సిరీస్​ ఆడాల్సి ఉంది. దుబాయ్ వేదికగా ఈ సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్​కు మాత్రం జయసూర్య లంక జట్టుతో ఉండనున్నట్లు తెలుస్తోంది.

వరల్డ్​కప్​లో ఫెయిల్
2024 టీ20 ప్రపంచకప్ అనంతరం జయసూర్య శ్రీలంక క్రికెట్ జట్టుగా హెడ్ కోచ్​గా ఎంపికైయ్యాడు. అతడి కోచింగ్ పీరియడ్​లో శ్రీలంక పాత వైభవం అందుకుందని చెప్పవచ్చు. దాదాపు రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్​లో నిలకడగా రాణించింది. సొంతగడ్డపై 2024 ఆగస్టులో టీమ్ఇండియాపై వన్డే సిరీస్ గెలిచింది. భారత్​పై వన్డే సిరీస్​లో 27 ఏళ్ల తర్వాత లంక విజయం సాధించింది.

ఆ తర్వాత ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌పై టెస్టు గెలుపు, న్యూజిలాండ్‌ను క్లీన్​ స్వీప్ చేయడం వంటి అద్భుతం విజయాలు అందుకుంది. ఇక భారీ అంచనాలతో సొంతగడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్​కప్​లో అడుగుపెట్టింది. అందుకు తగ్గట్లే గ్రూప్ స్టేజ్​లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఇందులో ఆస్ట్రేలియాపై గెలుపు తమ ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. ఇక జింబాబ్వేతో ఓడినా, సూపర్ 8కు అర్హత సాధించింది.

అయితే కీలకమైన దశలోనే లంక తడబాటుకు గురైంది. సూపర్ 8లో తొలి మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై అనూహ్య ఓటమి ఎదుర్కొంది. ఆ తర్వాత న్యూజిలాండ్​పై భారీ తేడాతో ఓడి, ఇంకో మ్యాచ్ ఉండగానే సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. ఇక పాకిస్థాన్​తో చివరి మ్యాచ్​లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని భావిస్తే, గెలుపు అంచులదాకా వచ్చి ఓడింది. ఈ మ్యాచ్​లో 5 పరుగుల తేడాతో లంక ఓడింది. అయితే కీలకమైన సూపర్ 8 దశలో లంక ప్రదర్శన ఆదేశ అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేసింది.

పాకిస్థాన్​తో మ్యాచ్ విషయానికొస్తే
గెలుపు అంచులదాకా వచ్చి శ్రీలంక ఓడింది. 213 పరుగుల ఛేదనలో లంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 రన్స్​ చేసింది. డాసున్ షనక (76 పరుగులు, 31 బంతుల్లో), పవన్ రత్నాయకే (58 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో షనక విజయంపై ఆశలు రేకెత్తించాడు. ఆఖరి ఓవర్లో 28 పరుగులు అవసరం కాగా, షనక వరుసగా తొలి నాలుగు బంతుల్లోనే 22 పరుగులు బాదాడు. అయితే చివరి రెండు బంతుల్లో పరుగులేమీ రాకపోవడంతో పాక్ 5 రన్స్​ తేడాతో నెగ్గింది. పాకిస్థాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 3, షహీన్ అఫ్రిదీ, నసీమ్ షా, మహ్మద్ నవాజ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఓపెనర్లు షహిబ్​జాదా ఫర్హాన్ (100 పరుగులు) సెంచరీ సాధించగా, ఫకర్ జమాన్ (84 పరుగులు) రాణించాడు. దీంతో పాక్ భారీ స్కోర్ అందుకుంది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక 3, డాసున్ షనక 2, దుష్మంత చమీర 1 వికెట్ దక్కించుకున్నారు.

పాకిస్థాన్ బ్యాటర్ ఊచకోత- విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్

ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం- కివీస్ ఓటమితో పాకిస్థాన్ ఖుష్!