'బౌలర్ ఎవరైతే నాకేంటి?- నేను బంతినే చూస్తా'- వైభవ్ సూర్యవంశీ బోల్డ్ స్టేట్మెంట్
ఐపీఎల్లో స్టార్ బౌలర్లను సైతం ఉతికారేస్తున్న వైభవ్- బుమ్రా, భువీ, హేజిల్‌వుడ్ బౌలింగ్‌లోనూ బౌండరీలు!

Published : April 11, 2026 at 1:44 PM IST
|Updated : April 11, 2026 at 2:36 PM IST
Vaibhav Suryavanshi IPL 2026 : 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ నయా స్టార్ అయ్యాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ నుంచే బాదుడే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న వైభవ్ బౌలర్లను ఉతికారేస్తున్నాడు. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 26 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. ఇక ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌ల్లో 200 పరుగులు చేసి టాప్‌లో కొనసాగుతున్నాడు. అయితే ఇదంతా ఒకెత్తు అయితే అతడు వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్ల బౌలింగ్‌లోనూ సిక్స్‌లు బాదడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కోవడంపై అతడి రియాక్షన్ ఎంటంటే?
బుమ్రాకే షాకిచ్చాడు!
రీసెంట్గా రాజస్థాన్- ముంబయి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు యార్కర్ కింగ్ 'బుమ్రా ముందు వైభవ్ తేలిపోతాడు', 'బుమ్రాను ఎదుర్కొనే శక్తి వైభవ్‌కు ఉందా?' అనే వాదనలు వినిపించాయి. కానీ, అవన్నీ పటాపంచలు చేస్తూ ఆ రాత్రి బుమ్రా వేసిన తొలి బంతినే ఈ చిచ్చరపిడుగు స్టాండ్స్‌లోకి పంపించి అందరి నోళ్లూ మూయించాడు. ఆ ఒక్క బంతేనా? ఆ తర్వాత కూడా బుమ్రా బౌలింగ్‌ను ఈజీగా ఆడుతూ సిక్స్‌లు, ఫోర్లు కొట్టేశాడు. ప్రపంచంలోని టాప్ బ్యాటర్లనే బెంబేలెత్తించే బుమ్రా బౌలింగ్, 15ఏళ్ల కుర్రాడి ముందు తేలిపోయింది.
Orange cap now sits on the youngest ever to play IPL 💗 pic.twitter.com/TE7TjfPswA
— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2026
భువీ, హేజిల్‌వుడ్ కూడా!
ఇక తాజాగా ఆర్సీబీ మ్యాచ్‌లోనూ ఇదే రిపీట్ అయ్యింది. ప్రత్యర్థి జట్టులో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్, పేస్ గన్ జోష్ హేజిల్‌వుడ్ ఉన్నాకన్న కంగారు వైభవ్‌లో కాసింతైనా కనపించలేదు. క్రీజులో కూల్‌గా ఉంటూ ఈ ఇద్దరి బౌలింగ్‌లో ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. 'మీరు ఎవరైతే నాకేంటి? బౌండరీ బాదడమే నా పని' అన్నట్లు భువీ, హేజిల్‌వుడ్‌ను వైభవ్ ఎదుర్కొన్న తీరుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హేజిల్‌వుడ్ వేసిన నాలుగో ఓవర్లో ఏకంగా మూడు ఫోర్లు, ఒ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో భువీనీ వదల్లేదు. 17 పరుగులు బాది తన బాధితుల అకౌంట్లో వేసేశాడు.
𝐍𝐨 𝐟𝐞𝐚𝐫. 𝐍𝐨 𝐩𝐚𝐮𝐬𝐞. 𝐉𝐮𝐬𝐭 𝐏𝐎𝐖𝐄𝐑 😤
— Star Sports (@StarSportsIndia) April 10, 2026
Vaibhav Sooryavanshi is going after bowlers without any hesitation 🥵#TATAIPL 2026 | #RRvRCB | LIVE NOW 👉https://t.co/b7gS3cp7ce pic.twitter.com/lJcL7OFKZv
వీళ్లనూ డోంట్‌కేర్!
వీళ్లతోపాటు ఈ సీజన్లో వైభవ్ ఇప్పటికే మ్యాట్ హెన్రీ, మహ్మద్ సిరాజ్, సిరాజ్, ప్రసిద్ధ్‌కృష్ణ, కగిసో రబాడ, శార్దూల్ ఠాకూర్లను అయితే లెక్కే చేయలేదు. వీళ్లందరి బౌలింగ్‌లోనూ బౌండరీలు బాదేశాడు. దీంతో వైభవ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
వైభవ్ రియాక్షన్!
బుమ్రా, భువనేశ్వర్, హేజిల్‌వుడ్ వంటి బౌలర్లను ఎదుర్కోవాలంటే భయమేసిందా? అన్న ప్రశ్నకు, తాను బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్ ఎవరు అనేది చూడనని కేవలం బంతినే చూస్తానని క్లియర్‌గా చెప్పాడు. 'సర్, నేను బౌలర్‌ను చూడను. కేవలం బంతిని ఆడటానికే ప్రయత్నిస్తా. నేను నా బలాన్నే నమ్ముతా. నెట్స్‌లో చేసిన ప్రాక్టీస్‌ను క్రీజులో అమలు చేయడానికే ప్రయత్నిస్తాను. అయితే బౌలర్ ఎవరో అనేది నా మనసుకు తెలుసు. అయినప్పటికీ, నేను బౌలర్ ఎవరు అనేది చూడకుండా బంతిని ఆడటంపైనే దృష్టి పెడతాను' అని ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్‌లో వైభవ్ స్పష్టంగా చెప్పాడు.
𝟏𝟓 𝐛𝐚𝐥𝐥𝐬. 𝐓𝐡𝐚𝐭’𝐬 𝐚𝐥𝐥 𝐡𝐞 𝐧𝐞𝐞𝐝𝐬 🤯
— Star Sports (@StarSportsIndia) April 10, 2026
Vaibhav Sooryavanshi, the first-ever batter in the TATA IPL to smash three fifties in 17 balls or less 🥵#TATAIPL 2026 | #RRvRCB | LIVE NOW 👉https://t.co/b7gS3cp7ce pic.twitter.com/yOD9jabOHW
నెక్ట్స్ వీళ్లే!
వరుసగా స్టార్ బౌలర్లను ఉతికారేయంతో వైభవ్‌పై నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. రాజస్థాన్ జట్టు సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూతో ఆడాల్సి ఉంది. దీంతో బుమ్రా, భువీ అయిపోయారని ఇకపై ఆడాల్సిన జట్లలోని స్టార్ బౌలర్లను ఎలా బాదేస్తాడో అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఆయా జట్లలో ఉనాద్కత్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, లుంగి ఎంగ్డి, ముకేశ్ కుమార్, నటరాజన్ లాంటి బౌలర్లు ఉన్నారు.
'మామూలోడు కాదు- ద్రవిడ్‌కు చెప్పి మరీ చేశాడుగా!'- వైభవ్ గేమ్‌ప్లాన్ రివీల్ చేసిన శాంసన్

