హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం- పోరాడి ఓడిన ముంబయి
ముంబయి ఇండియన్స్‌కు మూడో ఓటమి- సొంతగడ్డపై భంగపాటు- ఆర్సీబీ 18 రన్స్ తేడాతో విజయం

Published : April 13, 2026 at 12:10 AM IST
RCB vs MI : వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో నెగ్గింది. ఆర్సీబీ నిర్దేశించిన 241 పరుగుల భారీ ఛేదనలో ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులే చేసింది. రూథర్‌ఫోర్డ్ (71) మెరుపులు సరిపోలేదు. హార్దిక్ పాండ్య (40), రికెల్టన్ (37) ఫర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ 2, రసిక్ ధర్, డఫీ, కృనాల్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (78 పరుగులు), విరాట్ కోహ్లీ (50 పరుగులు)లతో పాటు కెప్టెన్ రజత్ పటిదార్ (53 పరుగులు) హాఫ్ సెంచరీలు చేశారు. ముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య, శాంట్నర్, శార్దూల్ ఠాకుర్, బౌల్ట్ తలొ వికెట్ తీశారు.
Back to winning ways! ✅❤️
— Star Sports (@StarSportsIndia) April 12, 2026
After a solid batting display, #RCB bowlers hold their nerve to restrict #MumbaiIndians & seal back-to-back wins at Wankhede stadium! 👏🔥#MIvRCB #RajatPatidar #HardikPandya #RohitSharma #ViratKohli pic.twitter.com/4OkZoLiQ5W
- మ్యాచ్ గురించి మరిన్ని విషయాలు
- ఐపీఎల్లో 200+ టార్గెట్‌ను అత్యధికసార్లు కాపాడుకున్న జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్‌లో నిలిచింది. ఈ రెండు జట్లు చెరో 23సార్లు ఈ టార్గెట్‌ను కాపాడుకున్నాయి
- ముంబయి- ఆర్సీబీ మధ్య గత 8 మ్యాచ్‌ల్లో ఆర్సీబీదే పైచేయిగా ఉంది. ఇందులో అత్యధికంగా ఆర్సీబీ ఆరుసార్లు నెగ్గగా, ముంబయి రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది
- ఈ మ్యాచ్‌లో ముంబయి స్కోర్ 222-5. ఐపీఎల్లో ఆర్సీబీపై ఆ జట్టుకిదే హైయ్యెస్ట్ స్కోర్. గతంలో 2018లో 213-6 స్కోర్ టాప్‌లో ఉండేది
- ముంబయి బ్యాటర్ షర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 71 పరుగులు చేశాడు. ముంబయి తరఫున ఆరు లేదా అంతకంటే తక్కువ బ్యాటింగ్ ఆర్డర్లో ఓ బ్యాటర్ చేసిన రెండో అత్యధిక స్కోర్ ఇది. టాప్‌లో హార్దిక్ పాండ్య ఉన్నాడు. అతడు 2019లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 91 పరుగులు చేశాడు
- ప్రస్తుత సీజన్లో ఆర్సీబీకి ఇది నాలుగు మ్యాచ్‌ల్లో మూడో విజయం. మరోవైపు అన్నే మ్యాచ్‌లు ఆడిన ముంబయి ఇది మూడో ఓటమి
రోహిత్‌కు ఏమైంది?
ఛేజింగ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా అతడికి తొడ వెనుక కండరాలు పట్టేశాయి. అప్పటికి అతడు 13 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఇందులో 2 పోర్లు, 1 సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించాడు. దీంతో ముంబయి అభిమానుల్లో కొండంత ఆశలు నెలకొన్నాయి. కానీ, ఆరో ఓవర్లో ప్రారంభానికి ముందే అతడికి నొప్పి ఎక్కువైంది. ఫిజియో వచ్చి చూశాడు.
దీంతో రోహిత్ సెట్ అయినట్లు కనిపించాడు. కానీ తొలి బంతికే సింగిల్ తీసి, రెండో బంతి ఆడిన తర్వాత మళ్లీ నొప్పితో బాధపడ్డాడు. దీంతో క్రీజును వీడాలని డిసైడ్ అయ్యాడు. అంపైర్ అనుమతితో రోహిత్ 5.2 ఓవర్ వద్ద రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి ముంబయి స్కోర్ 51-0. ఇక హిట్‌మ్యాన్ గాయంపై అప్డేట్ రావాల్సి ఉంది. ఈ నెల 16న పంజాబ్ కింగ్స్‌తో ముంబయి ఆడాల్సి ఉంది. అప్పటిలోగా రోహిత్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
హిట్‌మ్యాన్ సూపర్ రికార్డ్
ఈ మ్యాచ్‌లో రోహిత్ చేసింది 19 పరుగులే అయినా ఖాతాలో అరుదైన రికార్డు వేసుకున్నాడు. ఐపీఎల్లో అతడు ముంబయి ఇండియన్స్ తరఫున 6 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు కొట్టాడు. 2011లో ముంబయి ఫ్రాంచైజీతో చేరిన రోహిత్ 15ఏళ్లుగా ఇదే జట్టుకు ఆడుతున్నాడు. ఈ క్రమంలో 231 ఇన్నింగ్స్‌లో 6013 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో రోహిత్ తర్వాతి స్థానంలో సూర్యకుమార్ 3809 రన్స్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు

