టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్- ఆ వన్డే సిరీస్‌కు 'రో-కో' డౌటే!
భారత్ పర్యనటకు అఫ్గానిస్థాన్- ఒక టెస్టు, మూడు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టుతో అఫ్గాన్ ఢీ- టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు నిరాశ

Published : June 4, 2026 at 3:17 PM IST
Ind vs Afg ODI 2026 : ఐపీఎల్ ముగియడంతో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతారా? అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే సొంతగడ్డపై ఇదే నెలలో జూన్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌కు సీనియర్లు రోహిత్, విరాట్ కూడా ఎంపికయ్యారు. దీంతో త్వరలోనే తమ అభిమాన స్టార్లను మైదానంలో చూడొచ్చని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. అయితే అలా సంబరపడిపోతున్న అభిమానులకు నిరాశ మిగిలేలాగా కనిపిస్తుంది.
షరతులతోనే ఎంపిక!
ఇటీవల ముగిసిన ఐపీఎల్లో రోహిత్ శర్మ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో పలు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో అతడిని ఈ సిరీస్‌కు రోహిత్‌ను సెలక్టర్లు షరతులతో ఎంపిక చేశారు. సిరీస్ ప్రారంభానికి ముందు అతడు ఫిట్నెస్ టెస్టులో పాస్ అవ్వడంపైనే జట్టులో చోటు ఆధారపడి ఉంటుందని సెలక్టర్లు తెలిపారు. అయితే ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇవ్వడం, వచ్చీ రాగానే హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో ఫిట్నెస్ క్లియర్ చేయడం పక్కా అని అభిమానులు అనుకున్నారు. కానీ తాజా పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఇంకా కండరాలగాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు ఇంకా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్ట్ చేయలేదని తెలుస్తోంది.
విరాట్ కూడా!
మరోవైపు, ఈ ఐపీల్లో 600+ పరుగులతో అదరగొట్టిన విరాట్ కూడా ఈ సిరీస్‌కు దూరం కానున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్ మ్యాచ్ సమయంలో విరాట్ కూడా తొడ కండరాల గాయానికి గురయ్యాడు. బ్యాటింగ్ చేస్తుండగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. అయినప్పటికీ ఆ మ్యాచ్‌లో చివరిదాకా విరాట్ క్రీజులో ఉండి హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే విరాట్ ప్రస్తుతానికి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇంకా రిపోర్ట్ చేయలేదని తెలిసింది. దీంతో విరాట్ కూడా అఫ్గాన్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాని తెలుస్తోంది. ఏదేమైనా టీమ్ఇండియాకు ఇది బిగ్ బ్లో అని చెప్పవచ్చు!
Virat Kohli has been advised a minimum of 2 week rest. He could be fit in time for the last ODI on 20th June, but the selectors are unlikely to rush him. (Express Sports). pic.twitter.com/6kyo514Lb0
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2026
ఇద్దరు దూరం!
అలా కండరాల గాయంతో జట్టులోని స్టార్ ప్లేయర్లు ఇద్దరు కూడా అఫ్గాన్‌తో సిరీస్‌కు దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్లు లేకపోవడం టీమ్ఇండియాకు కూడా గట్టి ఎదురుదెబ్బే! అటు అభిమానులు ఈ వార్తతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. యువ టీమ్ఇండియాకు ఇదొక ఛాలెంజ్‌గా మారనుంది. సీనియర్ల స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారు? రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్‌గా ఎవరు వస్తారు? అనే విషయాల్లో ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.
ఈ పర్యటనలో అఫ్గాన్ షెడ్యూల్
- ఏకైక టెస్టు మ్యాచ్ - జూన్ 06 - 10 - ముల్లాన్‌పుర్
- తొలి వన్డే - జూన్ 13- ధర్మశాల
- రెండో వన్డే- జూన్ 17 - ఎకానా స్టేడియం, లఖ్‌నవూ
- మూడో వన్డే - జూన్ 20, చిదంబరం స్టేడియం, చెన్నై
వచ్చే నెలలోనైనా!
ఇక అఫ్గాన్‌తో సిరీస్ తప్పితే టీమ్ఇండియా మళ్లీ వచ్చే నెలలో వన్డేలు ఆడనుంది. జులైలో టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో ఐదు టీ20, మూడు వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉంది. జులై 14 తొలి వన్డే ఉండనుంది. ఈ సిరీస్‌లోపు అయినా రో-తో ద్వయం ఫుల్ ఫిట్నెస్ సాధిస్తుందా? అనేది వేచి చూడాలి!
'ప్రపంచంలోనే సూపర్‌స్టార్ అవుతాడు- కానీ అలా ఉంటేనే!'- వైభవ్‌పై లలిత్ మోదీ ప్రశంసలు!

