చరిత్ర సృష్టించిన రోహిత్ విరాట్ - తొలి మ్యాచ్‌లోనే వరల్డ్ రికార్డులు
భారత్ - న్యూజిలాండ్ తొలి వన్డే- టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ విరాట్ ప్రపంచ రికార్డులు- ఎవరికి వారే సాటి!

Published : January 11, 2026 at 8:24 PM IST
Ind vs NZ ODI 2026 : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే కెరీర్లో అరుదైన రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం వడోదర వేదికగా కివీస్‌తో భారత్ తొలి వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో బరిలో దిగడంతోనే విరాట్ అరుదైన ఘనత అందుకోగా, ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. అవేంటంటే?
గంగూలీ, సంగక్కరను అధిగమించిన విరాట్
ఈ వన్డేలో బరిలో దిగడంతోనే విరాట్ అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో ఇది విరాట్‌కు 309వ వన్డే మ్యాచ్. దీంతో భారత్ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన ఐదో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ (308 మ్యాచ్‌లు)ని అధిగమించాడు. కాగా, ఈ లిస్ట్‌లో భారత దిగ్గజం సచిన్ తెందూల్కర్ టాప్‌లో ఉన్నాడు. సుదీర్ఘ కెరీర్లో సచిన్ భారత్ తరఫున 463 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే 400 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఏకైక భారత క్రికెటర్‌గానూ సచిన్ పేరిట రికార్డ్ ఉంది.
టీమ్ఇండియా తరఫున అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు
- సచిన్ తెందుల్కర్ - 463 మ్యాచ్‌లు
- మహేంద్రసింగ్ ధోనీ - 347 మ్యాచ్‌లు
- రాహుల్ ద్రవిడ్ - 340 మ్యాచ్‌లు
- మహ్మద్ అజారుద్దిన్ - 334 మ్యాచ్‌లు
- విరాట్ కోహ్లీ - 309*
- సౌరభ్ గంగూలీ - 308
ఇక ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ అదిరే ఫామ్ కొనసాగించాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ (మూడు ఫార్మాట్లలో కలిపి) లో 28వేల పరుగులు మైలురాయి అందుకున్నాడు. సుదీర్ఘ కెరీర్లో విరాట్ ఇప్పటిదాకా 28017* పరుగులతో కొనసాగుతున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా విరాట్ రికార్డు సాధించాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (28016 పరుగులు) ను అధిగమించాడు. క్రికెట్లో ఓవరాల్‌గా సచిన్ తెందుల్కర్ (34357 పరుగులు) టాప్‌లో ఉండగా, విరాట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్‌లో టాప్‌లో 2లో భారత క్రికెటర్లే ఉండడం విశేషం.
🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) January 11, 2026
Virat Kohli is now the second highest run-getter in international cricket (Men's) 🫡
Updates ▶️ https://t.co/OcIPHEpvjr#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/vf3Yr8FYhG
రోహిత్ @650
సిక్స్‌లకు రోహిత్ శర్మ పెట్టింది పేరు. ఇప్పటికే వన్డే, టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా కొనసాగుతున్న హిట్‌మ్యాన్ తాజా మ్యాచ్‌లో తన పేరిట అరుదైన రికార్డు లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ ఛేదనలో రోహిత్ 26 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 2 సిక్స్‌లు బాదాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ (మూడు ఫార్మట్లలో కలిపి) లో 650 సిక్స్‌లు పూర్తి చేసుకున్న ఏకైక బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ లిస్ట్‌లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గైల్ (553 సిక్స్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు. అంటే రోహిత్- గేల్‌కు మధ్య దాదాపు 100 సిక్స్‌ల తేడా ఉండడం గమనార్హం. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఓపెనర్‌గా అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గానూ రోహిత్ రికార్డు కొట్టాడు.
Rohit Sharma making history again. 650 international sixes is a number built over years of quality cricket. Well played bro 🙌 pic.twitter.com/4Vdkj6GLC7
— Shikhar Dhawan (@SDhawan25) January 11, 2026
ఓపెనర్‌గా (మూడు ఫార్మాట్లలో) అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్
- రోహిత్ శర్మ (భారత్) - 329
- క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 328
- సనత్ జయసూర్య (శ్రీలంక) - 263
- మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్) - 174
- సచిన్ తెందుల్కర్ (భారత్) - 167
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి సరిగ్గా 300 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవన్ కాన్వే (56 పరుగులు), హెన్రీ నికోల్స్ (62 పరుగులు), డారిల్ మిచెల్ (84 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తలో 2, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.
𝘐𝘧 𝘺𝘰𝘶 𝘤𝘢𝘯 𝘸𝘢𝘵𝘤𝘩 𝘰𝘯𝘦 𝘴𝘩𝘰𝘵 𝘧𝘰𝘳 𝘭𝘪𝘧𝘦𝘵𝘪𝘮𝘦
— Mumbai Indians (@mipaltan) January 11, 2026
Us: Rohit Sharma's pull shot! 🤌
pic.twitter.com/I2WueEQmpe
భారత్ x న్యూజిలాండ్ : ఫుల్ ఫామ్‌లో రో-కో - నయా జోష్‌లో టీమ్ఇండియా!
మిచెల్, కాన్వే హాఫ్ సెంచరీలు- టీమ్ఇండియా ముంగిట భారీ లక్ష్యం

