క్రికెటర్ రింకు సింగ్ కుటుంబంలో విషాదం- క్యాన్సర్‌తో పోరాడుతూ తండ్రి మృతి
రింకు తండ్రి ఖాన్‌చంద్ సింగ్ అనారోగ్యంతో మృతి - తన ప్రార్థనలు ఎల్లప్పుడూ రింకు కుటుంబంతో ఉంటాయన్న భారత మాజీ స్పిన్నర్

Published : February 27, 2026 at 8:42 AM IST
Rinku Singh Father Death : టీమ్ ఇండియా క్రికెటర్ రింకు సింగ్ కుటుంబంలో విషాదం నెలకొంది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి ఖాన్‌చంద్ సింగ్ అనారోగ్యంతో మృతిచెందారు. స్టేజ్-4 కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతూ, శుక్రవారం తెల్లవారుజామున నొయిడాలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. తండ్రి అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన చికిత్స పోందుతున్న నోయిడాలోని ఆస్పత్రికి రింకూ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి జరిగిన జింబాబ్వే మ్యాచ్‌కు రింకూ దూరమయ్యారు.
రింకు ప్లేస్‌లో శాంసన్
ఫిబ్రవరి 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన 2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో రింకు ఆడలేదు. తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కారణంగా జట్టు నుంచి బయటికి వెళ్లిన రింకు, తండ్రి మరణంతో మళ్లీ జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతడి స్థానంలో సంజు శాంసన్ను తీసుకున్నారు. దీంతో అతడు జింబాంబ్వేతో ఆడాల్సిన మ్యాచ్‌లో స్థానం కోల్పోయాడు. అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ను ఆ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేశాడు.
కుటుంబం కోసం తండ్రి కృషి
రింకు తండ్రి తన కుటుంబాన్ని పోషించడానికి, తన పిల్లలకు మంచి జీవితం అందించడానికి చాలా కృషి చేశారు. గ్యాస్ డెలివరీ మ్యాన్‌గా పనిచేస్తూ కుటుంబానికి కావాల్సినవన్నీ సమకూర్చేవారు. కుటుంబం ఆర్థిక పరిస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ రింకుకు క్రికెటర్‌పై ఉన్న ఆసక్తి గమనించి అతడి కలలు నెరవేర్చేందుకు మద్దతుగా నిలిచాడు.
మరోవైపు రింకూ సింగ్ తండ్రి మరణంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించారు. రింకు తన క్రికెట్ బాధ్యతలకు కట్టుబడి ఉన్నప్పటికీ, ఈ సమయంలో అతని కుటుంబానికి ఇది చాలా కష్టమైన సమయం అని తెలిపారు. రింకు తండ్రి మరణం వార్త విని ఆయన చాలా బాధపడ్డారని, తన ప్రార్థనలు ఎల్లప్పుడూ రింకు కుటుంబంతో ఉంటాయని పేర్కొన్నారు.
Pained to learn about the demise of Shri Khanchand Singh Ji, father of Rinku Singh. This must be an especially difficult time for Rinku and his family, even as he remains committed to his responsibilities during the T20 World Cup.
— Harbhajan Turbanator (@harbhajan_singh) February 27, 2026
My heartfelt thoughts and prayers are with him…
స్పందించిన మాజీ కోచ్
ఇటీవల ఈ విషయంపై రింకు మాజీ కోచ్ మసూద్ అమిని స్పందిస్తూ ఖాన్చంద్ సింగ్ అడ్వాన్స్డ్ స్టేజ్ లివర్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని, అనారోగ్యం చివరి దశలో ఉందని చెప్పారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా ఆయన వెంటిలేటర్పై ఉన్నారు" అని అమిని అప్పట్లో చెప్పారు.
సమాజ్ వాది పార్టీ ప్రియ సరోజ్‌తో నిశ్చితార్థం
కాగా, గతేడాది జూన్ 8న రింకు సింగ్ సమాజ్ వాది పార్టీ ప్రియ సరోజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే లోక్‌సభకు ఎంపీగా ఎన్నికైన వారిలో పిరయా సరోజ్ ఒకరిగా నిలిచారు. అయితే వీరి వివాహం మూడు నెలల్లో జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం వీరి వివాహం 2026 జూన్‌లో జరిగే అవకాశం ఉందని తెలిపారు.
కానీ ఇదే సమయంలో రింకు తండ్రి అనారోగ్యంతో మరణించడంతో పెళ్లి మరింత వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రింకు కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో రింకు దృఢంగా నిలవాలని కోరుకుంటున్నారు. పరిస్థితులు అన్నీ సర్దుమణిగిన త్వరగా జట్టుతో కలిసి మరిన్ని మ్యాచ్లు ఆడాల్సిందిగా సోషల్ మీడియాలో కామెంట్స్ ద్వారా తెలుపుతున్నారు.
#WATCH | Uttar Pradesh: After battling fourth-stage cancer, Cricketer Rinku Singh’s father, Khanchand Singh passed away at Yatharth Hospital in Greater Noida earlier this morning.
— ANI (@ANI) February 27, 2026
Visuals from outside the hospital. pic.twitter.com/NvfT1xyhnX
రింకు స్ట్రైక్ రేట్
రింకు వరల్డ్‌కప్‌లో బ్యాటింగ్ విషయంలో మిశ్రమ ఫలితాలు అందుకున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌లో మొత్తం 24 పరుగులు మాత్రమే చేశారు, అందులో రెండు సార్లు ఔట్ కాకుండా నిలిచాడు. ప్రస్తుతం గణంకాల ప్రకారం రింకు సింగ్ భారత టీ20 జట్టులో కీలక ఆటగాడుగా కొనసాగుతున్నారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 45 మ్యాచ్లు, 665 పరుగులు, 155.74 స్ట్రైక్ రేట్‌ను సంపాదించాడు. ఐపీఎల్ ఫార్మాట్లో 59 మ్యాచ్లు, 1099 పరుగులు, 145.18 స్ట్రైక్ రేట్ సంపాదించాడు.

