ETV Bharat / sports

ఆసియా క్రీడలకు టీమ్ఇండియా 'B' టీమ్- బీసీసీఐ మనసు మార్చుకుందా?

వచ్చే నెలలోనే ఆసియా గేమ్స్​ - ఆందరి ఆసక్తి క్రికెట్​పైనే- అయితే నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్లపై బీసీసీఐ అసంతృప్తి

Asian Games Cricket 2026
బీసీసీఐ బోర్డు మీటింగ్ (పైల్) (SOurce : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : August 28, 2026 at 7:17 PM IST

3 Min Read
Choose ETV Bharat

Asian Games Cricket 2026 : జపాన్‌ వేదికగా జరగనున్న 2026 ఆసియా క్రీడల క్రికెట్ పోటీల ఏర్పాట్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అసంతృప్తి వ్యక్తం చేశాయి. వచ్చే నెలలోనే పోటీలు జరగాల్సి ఉండగా, ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరగకపోవడంపై బీసీసీఐ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ పోటీలకు ముందుగా ప్రకటించిన మెయిన్​ జట్టును కాకుండా 'ఇండియా బి' (India 'B') జట్టును ఆసియా క్రీడలకు పంపే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఆసియా క్రీడల్లో క్రికెట్​ విభాగంలో మహిళల మ్యాచ్​లు సెప్టెంబర్ 17, పరుషుల మ్యాచ్​లు అదే నెల 24 నుంచి జరగనున్నాయి. ఈ మ్యాచ్​లన్ని జపాన్​లోని కొరోగి అథ్లెటిక్ పార్క్​ మైదానంలో జరగనున్నాయి. అయితే ఇప్పటిదాకా మైదానంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు జరగలేదు. కనీసం 2 వేల మంది కూర్చొని మ్యాచ్ వీక్షించే విధంగా కూడా సౌకర్యం లేదని తెలిసింది. అలాగే పిచ్‌ నాణ్యత కూడా అత్యంత నాసిరకంగా ఉందని, దీంతోపాటు ఆటగాళ్ల హోటల్, డ్రెస్సింగ్ రూమ్​ విషయంలోనూ ఏర్పాట్లు అనుకున్న స్థాయికి తగ్గట్లు లేకపోవడంతో బీసీసీఐ అసంతృప్తి చెందినట్లు తెలిసింది. అందుకే ఈ పోటీలకు బీ టీమ్​ను పంపించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

"జపాన్‌లో ఆసియా క్రీడల నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్లపై బీసీసీఐతోపాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అసంతృప్తిగా ఉన్నాయి. అందుకే బోర్డు అక్కడికి పరిశీలకులను పంపుతోంది. వారు అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి పూర్తి నివేదిక సమర్పిస్తారు. ఒకవేళ ఏర్పాట్లు సరిగా లేవని తేలితే, ప్రధాన జట్టుకు బదులుగా 'బి' టీమ్​ను పంపుతారు" అని బీసీసీఐ అధికారి ఒకరు జపాన్‌లో అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి జాతీయ మీడియాతో తెలిపారు. అలాగే ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లు టెంట్ల రూపంలో ఉన్నాయని, టాయిలెట్లు ఆ టెంట్ల నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నాయని తెలిసింది. దీంతో మ్యాచ్ సమయంలో ఆటగాళ్లకు ఇబ్బంది కలుగుతుందని, ఈ విషయాన్ని మేము జపాన్ అధికారులకు ఇప్పటికే బీసీసీఐ తెలియజేసినట్లు తెలిసింది. అంతేకాకుండా అక్కడి హోటల్ గదులు కూడా చాలా ఇరుకుగా ఉన్నాయని సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ, భారత ఒలింపిక్‌ అసోసియేషన్, ఆసియా గేమ్స్ ఆర్గనైజింగ్‌ కమిటీతో చర్చలు జరిపినట్లు సమాచారం.

పోటీలకు స్టార్ ప్లేయర్లు
ఈ పోటీలకు భారత్ నుంచి మహిళ, పరుషుల జట్ల నుంచి స్టార్ ఆటగాళ్లు బరిలో దిగనున్నారు. అయితే ప్లేయర్లకు ఏర్పాట్లు చేసిన హోటల్ గదులు చాలా చిన్నవిగా ఉన్నాయని, ఇద్దరు ఆటగాళ్లతోపాటు తమతమ కిట్​లను కూడా అందులో ఉంచేందుకు అవి సరిపోవని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్టార్ ఆటగాళ్లు బరిలో దిగనున్న ఈ పోటీలకు ఏర్పాట్లు మరింత అత్యుత్తమంగా చేయాల్సిన అవసరం ఉందని నిర్వాహకులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఆసియా క్రీడల కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పురుషుల జట్టుకు కెప్టెన్సీ వహించనుండగా, హర్మన్​ప్రీత్ కౌర్ నాయకత్వంలో మహిళల టీమ్ బరిలోకి దిగనుంది. ఈ మేరకు జట్లను ఇప్పటికే ప్రకటించారు.

ఆసియా క్రీడల కోసం భారత పురుషుల జట్టు : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి.ఎస్. కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ

లార్డ్స్ టెస్ట్ మధ్యలో ఇమ్రాన్ కుమారుల ఇంటర్వ్యూ- బహిష్కరిస్తామని PCB వార్నింగ్​- అసలేం జరిగిందంటే?

గ్రాండ్ చెస్ టూర్: చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద- తొలి భారతీయుడిగా ఘనత